కరెంట్‌ అఫైర్స్‌

2022 డిసెంబరులో బీబీసీ (బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌) విడుదల చేసిన ప్రపంచంలో వంద మంది అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో చోటు పొందిన నలుగురు భారతీయ మహిళలు ఎవరు?

Published : 07 Mar 2023 00:53 IST

మాదిరి ప్రశ్నలు

* 2022 డిసెంబరులో బీబీసీ (బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌) విడుదల చేసిన ప్రపంచంలో వంద మంది అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో చోటు పొందిన నలుగురు భారతీయ మహిళలు ఎవరు?
జ:
ప్రముఖ బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా, రచయిత్రి గీతాంజలి శ్రీ, ఇంజినీర్‌, వ్యోమగామి శిరీష బండ్ల, సామాజిక కార్యకర్త స్నేహ జవాలే

* అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం - 2022ను ఏ థీమ్‌తో నిర్వహించారు? (అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని ఏటా డిసెంబరు 9న నిర్వహిస్తారు.)
జ:
యునైటింగ్‌ ద వరల్డ్‌ ఎగైనెస్ట్‌ కరప్షన్‌

* మాజీ అమెరికా ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామా ఇటీవల రచించిన పుస్తకం ఏది? (క్రౌన్‌ పబ్లిషింగ్‌ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.)
జ:
ది లైట్‌ వుయ్‌ క్యారీ: ఓవర్‌కమింగ్‌ ఇన్‌ అన్‌సర్టెన్‌ టైమ్స్‌

* ప్రఖ్యాత రచయిత డొమినిక్‌ లాపియర్‌ 2022 డిసెంబరులో ఫ్రాన్స్‌లో మరణించారు. ఈయన ప్రముఖ రచనలు ఏవి? (ఈయన అమెరికాకు చెందిన లారీ కోలిన్స్‌తో కలిసి భారత్‌కు సంబంధించి ఈ రచనలు చేశారు. ఈయనకు 2008లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారాన్ని ప్రదానం చేసింది)                    
జ:
ఫ్రీడమ్‌ ఎట్‌ మిడ్‌నైట్‌, సిటీ ఆఫ్‌ జాయ్‌, ఫైవ్‌ పాస్ట్‌ మిడ్‌నైట్‌ ఇన్‌ భోపాల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని