కరెంట్‌ అఫైర్స్‌

21 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కోచ్‌గా ఎంపికైన తెలంగాణ యువతి ఎవరు? (తెలంగాణ నుంచి ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారిణి ఈమె.

Published : 09 Mar 2023 02:17 IST

మాదిరి ప్రశ్నలు

* 21 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కోచ్‌గా ఎంపికైన తెలంగాణ యువతి ఎవరు? (తెలంగాణ నుంచి ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారిణి ఈమె.)

జ: బుర్రా లాస్య

* 2023, జనవరి 3 నుంచి 7 వరకు 108వ భారత సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలను ఎక్కడ నిర్వహించారు? (సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫర్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ విత్‌ ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ అనే థీమ్‌తో 108వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ను నిర్వహించారు)

జ: ఆర్‌టీఎమ్‌ విశ్వవిద్యాలయం, నాగ్‌పుర్‌

* కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) - 2022లో ఓవరాల్‌ కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచిన విద్యాసంస్థ ఏది? (ఈ విద్యాసంస్థ ఈ ఘనత సాధించడం ఇది వరుసగా నాలుగోసారి. ఇంజినీరింగ్‌ విభాగంలో కూడా వరుసగా ఏడోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది)

జ: ఐఐటీ మద్రాస్‌

* అడ్వాన్సింగ్‌ ఎర్త్‌ స్పేస్‌ సైన్సెస్‌ జర్నల్‌లో ప్రచురితమైన    పరిశోధనల ప్రకారం 2023లో ఏ సముద్ర తీర ప్రాంతంలో సముద్ర మట్టాలు మరీ ప్రమాదకర స్థాయిలో పెరగనున్నాయి? (పరిశోధకులు 1989 తర్వాత నుంచి ఇతర సముద్ర మట్టాల కంటే ఈ సముద్ర మట్టం శరవేగంగా పెరుగుతున్నట్లు గుర్తించారు)    

జ: మధ్యదరా సముద్రం

* ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఏ రోజున మొదలైంది?

జ: 2022, ఫిబ్రవరి 24


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు