కరెంట్‌ అఫైర్స్‌

‘ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డ్‌  ఫర్‌ ది సార్క్‌ రీజియన్‌’ పురస్కారం గెలుచుకున్న భారతీయ మహిళా వ్యాపారవేత్త ఎవరు?

Updated : 10 Mar 2023 00:54 IST

మాదిరి ప్రశ్నలు

* ‘ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డ్‌  ఫర్‌ ది సార్క్‌ రీజియన్‌’ పురస్కారం గెలుచుకున్న భారతీయ మహిళా వ్యాపారవేత్త ఎవరు? (శ్రీలంక కేంద్రంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఏర్పాటైన ‘ఉమెన్స్‌ ఛాంబర్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ కామర్స్‌’ (డబ్ల్యూసీఐసీ) ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది.)  

జ: డాక్టర్‌ సుజాత శేషాద్రినాథ్‌


* ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా వరుసగా రెండో ఏడాది ఘనత సాధించిన భారతీయ అమెరికన్‌ విద్యార్థిని ఎవరు? (అమెరికాకు చెందిన జాన్స్‌ హాప్కిన్స్‌ సెంటర్‌ ఫర్‌ టాలెంటెడ్‌ యూత్‌  నిర్వహించిన పలు రకాల  పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచి  వరుసగా రెండో సంవత్సరం ఈ 13 ఏళ్ల బాలిక ఈ ఘనత సాధించింది)

జ: నటాషా పెరియనాయగమ్‌


* 31 మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో ఏర్పాటైన నదుల అనుసంధానంపై  పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి ఏ బీజేపీ ఎంపీ అధ్యక్షత వహిస్తున్నారు? (కేంద్రం ప్రాధాన్యతగా ప్రకటించిన గోదావరి - కృష్ణా - పెన్నా - కావేరి, దామన్‌ గంగా - పింజాల్‌, పర్‌ - తాపి - నర్మదా నదుల అనుసంధానానికి ప్రధానంగా రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించకపోవడం,  ఏకాభిప్రాయ సాధనకు సంప్రదింపులు జరపకపోవడం, నిధుల కొరత, అటవీ పర్యావరణ అనుమతులు, భూ సేకరణ నిర్వాసితులకు పునరావసం కల్పన అనే అయిదు ప్రధాన అంశాలు అడ్డంకిగా మారినట్లు ఈ స్టాండింగ్‌ కమిటీ తన  నివేదికలో పేర్కొంది.)

జ: పర్‌బత్‌భాయ్‌ సవాభాయ్‌ పటేల్‌



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు