కరెంట్‌ అఫైర్స్‌

బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ నుంచి ‘మహిళా పారా బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2022’ పురస్కారం గెలుచుకున్న భారతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి ఎవరు?

Published : 11 Mar 2023 00:41 IST

మాదిరి ప్రశ్నలు

* బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ నుంచి ‘మహిళా పారా బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2022’ పురస్కారం గెలుచుకున్న భారతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి ఎవరు? (2022 నవంబరులో టోక్యోలో జరిగిన పారా బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌ పోటీల్లో ఈమె  ఎస్‌యూ5 కేటగిరీలో మహిళల సింగిల్స్‌లో స్వర్ణం నెగ్గింది.)                  

జ: మనీషా రామ్‌దాస్‌


* ఇటీవల జమ్ము-కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం కొలువైన కొండల దిగువన సలాల్‌ హైమన గ్రామం వద్ద 59 లక్షల టన్నుల నాణ్యమైన లిథియం నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) గుర్తించింది. దీంతో ప్రపంచంలో లిథియం నిల్వల్లో భారత్‌ ఎన్నో స్థానానికి చేరుకుంది? (బొలీవియాలో అత్యధికంగా 3,90,00,000 టన్నుల లిథియం నిల్వలు ఉన్నాయి. రెండో స్థానంలో చిలీ (1,99,03,332 టన్నులు), మూడో స్థానంలో ఆస్ట్రేలియా (77,17,776 టన్నులు) ఉన్నాయి.)
జ: ఐదో స్థానం


* ఏ రాష్ట్రంలోని శ్రీసిటీలో ఉన్న బీఎఫ్‌జీ ఇండియా   పరిశ్రమలో దేశంలో ప్రాచుర్యం పొందిన వందేభారత్‌  సెమీ హైస్పీడ్‌ రైలు విడిభాగాలు తయారవుతున్నాయి? (వందేభారత్‌ రైలులోని ఇంటీరియర్‌, టాయిలెట్‌ క్యాబిన్‌, ఇంజిన్‌ ముందు భాగాన్ని బీఎఫ్‌జీ సంస్థ రూపొందిస్తుంది.)  

జ: ఆంధ్రప్రదేశ్‌Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు