కరెంట్‌ అఫైర్స్‌

ముంబయిలోని చర్చ్‌గేట్‌ రైల్వేస్టేషన్‌కు ఇటీవల ఎవరి పేరు పెట్టారు?

Published : 16 Mar 2023 01:51 IST

మాదిరి ప్రశ్నలు

* ముంబయిలోని చర్చ్‌గేట్‌ రైల్వేస్టేషన్‌కు ఇటీవల ఎవరి పేరు పెట్టారు?

జ: చింతామణ్‌ రావు ద్వారకానాథ్‌ దేశ్‌ముఖ్‌ (సీడీ దేశ్‌ముఖ్‌), ఆర్‌బీఐ తొలి గవర్నర్‌

* మహారాష్ట్రలోని ఏ నగరం పేరును ఇటీవల ఛత్రపతి శంభాజీనగర్‌గా మార్చారు?

జ: ఔరంగాబాద్‌

* యూఎస్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ సంస్థ ప్రపంచంలోని 55 ప్రముఖ ఆర్థిక వ్యవస్థలతో విడుదల చేసిన ‘ఇంటర్నేషనల్‌ ఐపీ ఇండెక్స్‌’లో భారత్‌ ఎన్నో స్థానంలో నిలిచింది?

జ: 42

* 2023 జనవరి 31న జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) ఎన్నో వ్యవస్థాపక దినోత్సవాన్ని దిల్లీలో నిర్వహించారు? (రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. ‘సశక్త్‌ నారి, సశక్త్‌ భారత్‌’ అనే థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.)

జ: 31వ వ్యవస్థాపక దినోత్సవం

* ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఐఐఆర్‌ఎఫ్‌) - 2023’ ర్యాంకింగ్‌ ప్రకారం ఎంబీఏ కోర్సులకు సంబంధించి దేశంలోనే అగ్రగామిగా నిలిచిన విద్యాసంస్థ ఏది? (రెండు, మూడు స్థానాల్లో వరుసగా ఐఐఎం-బెంగళూరు, ఐఐఎం -కోల్‌కతా నిలిచాయి)

జ: ఐఐఎం-అహ్మదాబాద్‌



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని