మాదిరి ప్రశ్నలు
1. అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?
1) హైదరాబాద్
2) బెంగళూరు
3) ఇందౌర్
4) కోల్‌కతా
2. ఝలరా, బోలిస్ అనే సంప్రదాయ నీటి సంరక్షణ విధానాలు కింది వాటిలో దేనికి చెందుతాయి?
1) చెరువులు
2) మెట్ల బావులు
3) ఆనకట్టలు
4) నీటి కాలువలు
3. ఇంటి పైకప్పు నుంచి జారే వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం దేనికి ఉదాహరణ?
1) వాటర్‌షెడ్ విధానం
2) రెయిన్ షాడో విధానం
3) రెయిన్ ప్రెసిపిటేషన్ విధానం
4) వాటర్ హార్వెస్టింగ్ విధానం
4. భారతదేశ వ్యవసాయ భూమిలో కరవు భూమి ఎంత?
1) 38%
2) 68%
3) 48%
4) 28%
5. భూగర్భ జలాలను 50% కంటే ఎక్కువగా వాడేసే ప్రాంతాలను ఏ జోన్‌గా నిర్ణయించారు?
1) డార్క్ జోన్
2) గ్రే జోన్
3) ఎల్లో జోన్
4) రెడ్ జోన్
6. సాధారణ వర్షపాతంలో ఎంత శాతం తగ్గితే కరవుగా భావిస్తారు?
1) 25% వరకు
2) 50% వరకు
3) 75% వరకు
4) 10% వరకు
7. ప్రపంచ సహజ విపత్తుల్లో కరవు విపత్తు వాటా ఎంత?
1) 50%
2) 19%
3) 5%
4) 80%
8. మహారాష్ట్రలో రాలెగావ్ సిద్ధి గ్రామంలో కరవు నివారణ అనుసంధానకర్త, సామాజిక కార్యకర్త ఎవరు?
1) అన్నాహజారే 2) రాజేంద్రసింగ్
3) మేధాపాట్కర్ 4) పాలేకర్
9. దేశంలో కరవు తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం?
1) మధ్య భారతదేశం
2) ఈశాన్య భారతదేశం
3) వాయవ్య భారతదేశం
4) హిమాలయ ప్రాంతం
10. భారత వ్యవసాయ పరిశోధనా మండలి కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
1) దిల్లీ 2) ముంబయి
3) బెంగళూరు 4) కోల్‌కతా
జవాబులు: 1-1, 2-2, 3-4, 4-2, 5-1, 6-2, 7-2, 8-1, 9-3, 10-1.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Arvind Kejriwal: కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
Crime News
Fake Currency: నకిలీ నోట్ల అడ్డా.. చేనేతపురి!
-
Ts-top-news News
Salarjung Museum: సాలార్జంగ్ మ్యూజియం.. ఆన్‌లైన్‌లోనూ వీక్షించొచ్చు..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
‘విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టు కోసం.. ఏపీ నుంచి ప్రతిపాదనలు రాలేదు’
-
Politics News
Vitapu-Botsa: విఠపు పరీక్షలో.. బొత్సకు 2 మార్కులే!