కరెంట్‌ అఫైర్స్‌

ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో మొదటిసారిగా ఏ మహిళా క్రికెటర్‌ కాంస్య విగ్రహాన్ని ఇటీవల ఏర్పాటు చేశారు?

Published : 17 Mar 2023 01:21 IST

మాదిరి ప్రశ్నలు

ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో మొదటిసారిగా ఏ మహిళా క్రికెటర్‌ కాంస్య విగ్రహాన్ని ఇటీవల ఏర్పాటు చేశారు? (దీంతో ఇప్పటికే సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ వద్ద ఉన్న రిచీ బెనాడ్‌, ఫ్రెడ్‌ స్పాఫ్ఫోర్త్‌, స్టాన్‌ మెక్‌కాబ్‌, స్టీవ్‌వాల విగ్రహాల సరసన ఈమె విగ్రహం చేరింది.)

జ: బెలిండా క్లార్క్‌, ఆస్ట్రేలియా (ఈమె మహిళల క్రికెట్‌ అంతర్జాతీయ వన్డేల్లో తొలి డబుల్‌ సెంచరీ నమోదు చేశారు.)


ఏ రాష్ట్రంలోని మోపాలో ఉన్న గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును ‘మనోహర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌’గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? (కేంద్ర మాజీ రక్షణ మంత్రి, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత మనోహర్‌ పారికర్‌ పేరిట విమానాశ్రయం పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.)

జ: గోవా


ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘జాగా మిషన్‌’ ప్రతిష్ఠాత్మక యూఎన్‌ - హేబిటాట్స్‌ వరల్డ్‌ హేబిటాట్‌ అవార్డును సొంతం చేసుకుంది? (ప్రపంచవ్యాప్తంగా గృహ నిర్మాణ పథకాలు, కార్యక్రమాలు, వినూత్న ఆలోచనలకు సంబంధించి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ఇస్తారు.)

జ: ఒడిశా


2023 జనవరి 5, 6 తేదీల్లో మొదటి అఖిల భారత నీటి మంత్రుల సదస్సును ఎక్కడ నిర్వహించారు? (‘వాటర్‌ విజన్‌ జీ 2047’ అనే థీమ్‌తో ఈ సదస్సును నిర్వహించారు.) 

జ: భోపాల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని