కరెంట్‌ అఫైర్స్‌

2023 జనవరిలో ఏ రాష్ట్ర రాజధాని నగరమైన ఇంఫాల్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా 120 అడుగుల ఎత్తయిన పోలో క్రీడాకారుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు? (గుర్రంపై పోలో ఆడుతున్న ఓ క్రీడాకారుడి విగ్రహం ఇది. ఈ రాష్ట్రం పోలో క్రీడకు పుట్టినిల్లుగా పేరుగాంచింది.)

Updated : 18 Mar 2023 05:38 IST

మాదిరి ప్రశ్నలు

*  2023 జనవరిలో ఏ రాష్ట్ర రాజధాని నగరమైన ఇంఫాల్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా 120 అడుగుల ఎత్తయిన పోలో క్రీడాకారుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు? (గుర్రంపై పోలో ఆడుతున్న ఓ క్రీడాకారుడి విగ్రహం ఇది. ఈ రాష్ట్రం పోలో క్రీడకు పుట్టినిల్లుగా పేరుగాంచింది.)

జ: మణిపుర్‌

* 2023 జనవరి 8, 9, 10 తేదీల్లో మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో నిర్వహించిన 17వ ప్రవాసీ భారతీయ దివస్‌లో మొత్తం ఎంతమంది ప్రవాస భారతీయులకు ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డు (పీబీఎస్‌ఏ) లను ప్రదానం చేశారు? (ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ నేతృత్వంలోని జ్యూరీ వీరిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. ‘డయాస్పోరా : రిలైబుల్‌ పార్ట్‌నర్స్‌ ఫర్‌ ఇండియాస్‌ ప్రోగ్రెస్‌ ఇన్‌ అమృత్‌ కాల్‌’ అనే థీమ్‌తో 17వ పీబీడీని నిర్వహించారు.)    

జ: 27

* అంకురాలకు మార్గదర్శకత్వం వహించేందుకు ఉపయుక్తంగా ఉండే మార్గ్‌ (లీతితిళిబి) పోర్టల్‌ను 2023 జనవరిలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ న్యూదిల్లీలో ఆవిష్కరించారు. ‘మార్గ్‌’ పూర్తి రూపం ఏమిటి?

జ: మెంటార్‌షిప్‌, అడ్వైజరీ, అసిస్టెన్స్‌, రిసిలియన్స్‌ అండ్‌ గ్రోత్‌

* ఈశాన్య భారత మొదటి ‘కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌’ను 2023, ఫిబ్రవరి 25న ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అక్కడి కామ్‌రూప్‌ జిల్లాలోని దమోరా పతర్‌లో ప్రారంభించారు?

జ: అస్సాం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని