కరెంట్‌ అఫైర్స్‌

ప్రతిష్ఠాత్మక స్లోన్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌కు ఎంపికైన హైదరాబాద్‌కు చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఎవరు? (మానవాళిపై ప్రభావం చూపిస్తున్న సృజనాత్మక పరిశోధకులకు ఈ ఫెలోషిప్‌ ఇస్తారు.

Published : 20 Mar 2023 00:47 IST

మాదిరి ప్రశ్నలు

* ప్రతిష్ఠాత్మక స్లోన్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌కు ఎంపికైన హైదరాబాద్‌కు చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఎవరు? (మానవాళిపై ప్రభావం చూపిస్తున్న సృజనాత్మక పరిశోధకులకు ఈ ఫెలోషిప్‌ ఇస్తారు. ఎంపికైన వారికి రెండేళ్లపాటు సంవత్సరానికి రూ.62 లక్షల చొప్పున అందిస్తారు.)
జ:
నేరెళ్ల తేజస్వి వేణుమాధవ్‌

* ఆర్యసమాజ్‌ వ్యవస్థాపకుడు స్వామి దయానంద సరస్వతి ఎన్నో జయంతి ఉత్సవాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023, ఫిబ్రవరి 12న ప్రారంభించారు?
జ:
200

* 2023 - 24 ఆర్థిక సంవత్సరానికి ఎంత మొత్తంతో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది? (పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.31,426 కోట్లు ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏడాదికి రూ. 5 కోట్లు అభివృద్ధి నిధులను కేటాయిస్తూనే సీఎం విచక్షణ మేరకు నిధులు మంజూరు చేసేందుకు రూ.10 వేల కోట్లకు పైగా నిధులను ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్‌) కింద చూపారు.)
జ:
రూ.2,90,396 కోట్లు

* భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో 1901 తర్వాత సంభవించిన అత్యుష్ణ సంవత్సరాల్లో 2022 ఎన్నో స్థానంలో ఉంది? (19వ శతాబ్దపు సగటు ఉష్ణోగ్రత కంటే 2022లో భూ ఉష్ణోగ్రత 1.1 డిగ్రీల సెల్సియస్‌ అధికమని అమెరికాకు చెందిన నాసా వెల్లడించింది.)
జ:
అయిదో స్థానం

* 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే రక్షణ ఉపకరణాల విలువ ఎంత మొత్తంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది? (2016-17లో భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లిన రక్షణ ఉప కరణాల విలువ కేవలం రూ.1251 కోట్లు. 2021-22 వచ్చేసరికి అది రూ.12,815 కోట్లకు ఎగబాకింది. 2020-21లో దేశీయ రక్షణ ఉత్పత్తుల విలువ రూ.84,643 కోట్లు. 2021-22లో పదకొండు శాతానికి పైగా వృద్ధితో అది రూ.94,846 కోట్లకు చేరింది.)
జ:
రూ.17 వేల కోట్లు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని