కరెంట్‌ అఫైర్స్‌

‘ఫాదర్‌ ఆఫ్‌ ల్యాప్రోస్కోపిక్‌ సర్జరీ ఇన్‌ ఇండియా’గా పేరుగాంచిన ఏ ప్రముఖ వైద్యుడు ఇటీవల మరణించారు? (ఈయన ప్రముఖ సర్జన్‌, గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య నిపుణుడిగా ప్రసిద్ధి చెందారు.

Published : 21 Mar 2023 03:19 IST

మాదిరి ప్రశ్నలు

* ‘ఫాదర్‌ ఆఫ్‌ ల్యాప్రోస్కోపిక్‌ సర్జరీ ఇన్‌ ఇండియా’గా పేరుగాంచిన ఏ ప్రముఖ వైద్యుడు ఇటీవల మరణించారు? (ఈయన ప్రముఖ సర్జన్‌, గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య నిపుణుడిగా ప్రసిద్ధి చెందారు. 2006లో పద్మశ్రీ, 2017లో పద్మభూషణ్‌ పురస్కారాలు అందుకున్నారు.)

జ: డాక్టర్‌ తెహెమ్టన్‌ ఎరక్‌ ఉడ్వాడియా

* 2023, జనవరి 15న దేశంలో ఎన్నో సైనిక దినోత్సవాన్ని నిర్వహించారు? (1949, జనవరి 15న చిట్టచివరి బ్రిటిష్‌ భారత సైనిక కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ జనరల్‌ ఫ్రాన్సిస్‌ బుచర్‌ నుంచి భారత తొలి సైనిక కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా ఫీల్డ్‌ మార్షల్‌ కె.ఎమ్‌. కరియప్ప పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏటా జనవరి 15న దేశంలో సైనిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.)

జ: 75వ

భారత్‌ను ప్రపంచ చిరుధాన్యాల కేంద్రంగా మార్చాలని లక్షించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఏ నగరంలోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రిసెర్చ్‌’ (ఐఐఎంఆర్‌)ను ఉత్కృష్ట కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది? (చిరుధాన్యాలను కేంద్రం ‘శ్రీ అన్న’గా అభివర్ణించింది. భారత్‌ పిలుపు మేరకు ఐరాస 2023ను ‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం’గా ప్రకటించింది. దేశంలో చిరుధాన్యాల ఉత్పత్తిలో రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా రాష్ట్రాల వాటా 81 శాతం పైగానే ఉంది.)

జ: హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు