కరెంట్‌ అఫైర్స్‌

మాన్యుయేలా రోకా బోటీ ఇటీవల ఏ దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు? (ఈమె ఈ పదవికి ఎంపిక కాకముందు అక్కడి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.

Published : 23 Mar 2023 01:20 IST

మాదిరి ప్రశ్నలు

మాన్యుయేలా రోకా బోటీ ఇటీవల ఏ దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు? (ఈమె ఈ పదవికి ఎంపిక కాకముందు అక్కడి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఫ్రాన్సిస్కో పాస్కల్‌ ఒబామా ఎసూ స్థానంలో ఈమె ప్రధానిగా ఎంపికయ్యారు.)

జ: ఈక్వటోరియల్‌ గినియా


దేశంలోనే తొలి మొబిలిటీ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం 2023 ఫిబ్రవరిలో ప్రకటించింది?

జ: తెలంగాణ (రానున్న అయిదేళ్లలో తెలంగాణలోకి రూ.50 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు 4 లక్షల ఉద్యోగాలను సృష్టించాలనే లక్ష్యంతో తెలంగాణ మొబిలిటీ వ్యాలీ (టీఎంవీ) పేరుతో 1200 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.)


ప్రపంచంలో పూర్తిగా కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన మొదటి మందుపై క్లినికల్‌ ట్రయల్స్‌ మొదలయ్యాయి. ఇన్‌సిలికో మెడిసిన్‌ అనే అమెరికన్‌ - హాంకాంగ్‌ కంపెనీ ఏ వ్యాధికి ఈ ఔషధాన్ని రూపొందించింది? (ఈ వ్యాధి ఎందుకు వస్తుందో కారణాలు తెలియవు. ఈ వ్యాధి వృద్ధుల ఊపిరితిత్తుల కణజాలాన్ని గట్టిపడేలా చేసి చివరికి మరణానికి దారితీస్తుంది.)

జ: ఇడియోపతిక్‌ పల్మనరీ ఫైబ్రోసిస్‌ (ఐపీఎఫ్‌)


2025 మాడ్రిడ్‌ అంతర్జాతీయ బుక్‌ ఫెయిర్‌కు ముఖ్య అతిథిగా ఏ దేశం ఎంపికైంది? (స్పెయిన్‌లో ఏటా ఈ ప్రఖ్యాత అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తారు.)

జ: భారతదేశం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు