కరెంట్‌ అఫైర్స్‌

త్రీడీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీని ఉపయోగించి దేశంలోనే తొలిసారిగా ఏ నగరంలో 3డీ-ప్రింటెడ్‌   పోస్టాఫీస్‌ నిర్మాణాన్ని పూర్తిచేశారు?        

Published : 21 May 2023 03:28 IST

నమూనా ప్రశ్నలు

 

* త్రీడీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీని ఉపయోగించి దేశంలోనే తొలిసారిగా ఏ నగరంలో 3డీ-ప్రింటెడ్‌   పోస్టాఫీస్‌ నిర్మాణాన్ని పూర్తిచేశారు?              

జ: బెంగళూరు


* అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఏటా ఏప్రిల్‌ 29న నిర్వహిస్తారు. ఏ దేశానికి చెందిన ప్రముఖ నృత్య కళాకారుడు జీన్‌-జార్జెస్‌ నోవెర్‌ జయంతిని అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా నిర్వహిస్తారు?      

జ: ఫ్రాన్స్‌  


* డీఆర్‌డీఓకు చెందిన ఇండస్ట్రీ అకాడమియా సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ఏ నగరంలోని ఐఐటీలో ఇటీవల ప్రారంభించారు?    

జ: హైదరాబాద్‌


* సౌరశక్తితో నడిచే భారతదేశపు తొలి ప్రయాణికుల నౌకను ఏ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ‘సూర్యాంషు’ పేరిట రూపొందించారు?
జ: కేరళ  


* భారతదేశపు తొలి క్లోనింగ్‌ ఆవు దూడ పేరు ఏమిటి?                

జ: గంగ    


* ప్రఖ్యాత ఫైనాన్షియల్‌ అడ్వైజరీ సంస్థ ఆర్టన్‌ క్యాపిటల్‌ రూపొందించిన ‘పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ 2023’లో భారత్‌ ఏ ర్యాంకులో   నిలిచింది?              

జ: 144



* ప్రపంచంలో అత్యుత్తమ ప్రజా రవాణా వ్యవస్థ కలిగిన దేశాల జాబితాలో 19వ స్థానంలో నిలిచిన ఏకైక     భారతీయ నగరం ఏది?              

జ: ముంబయి 


 * భారత పురుషులు, మహిళల ఖోఖో జట్లు ఏ రాష్ట్రంలో నిర్వహించిన నాలుగో ఆసియా ఖోఖో ఛాంపియన్‌షిప్స్‌ పోటీల్లో టైటిల్స్‌ విజేతలుగా నిలిచాయి?  

  జ: అస్సాం


* దేశంలో రెండో అతిపెద్ద క్రికెట్‌ స్టేడియాన్ని ఏ నగరంలో నిర్మిస్తున్నారు?                

జ: జైపుర్‌  


* ఏ రాష్ట్రానికి చెందిన కుంబం ద్రాక్ష రకం ఇటీవల భౌగోళిక గుర్తింపును పొందింది?          

జ: తమిళనాడు



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు