AP EAPCET: ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగం కీ విడుదల

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఇంజినీరింగ్‌ పరీక్షల ప్రాథమిక కీని విడుదల చేశామని, దీనిపై అభ్యంతరాలుంటే 26వ తేదీ ఉదయం 9 లోపు తెలపొచ్చని ఈఏపీసెట్‌ ఛైర్మన్‌ రంగజనార్ధన, కన్వీనర్‌ శోభాబిందు తెలిపారు.

Updated : 24 May 2023 07:00 IST

అనంతపురం (జేఎన్‌టీయూ), న్యూస్‌టుడే: ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఇంజినీరింగ్‌ పరీక్షల ప్రాథమిక కీని విడుదల చేశామని, దీనిపై అభ్యంతరాలుంటే 26వ తేదీ ఉదయం 9 లోపు తెలపొచ్చని ఈఏపీసెట్‌ ఛైర్మన్‌ రంగజనార్ధన, కన్వీనర్‌ శోభాబిందు తెలిపారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షల కీ 24వ తేదీ ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ప్రాథమిక కీ ఈఏపీసెట్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ నెల 15న మొదలైన ఈఏపీసెట్‌ పరీక్షలకు 93.38 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 2,24,724 మంది, ఫార్మసీ, అగ్రికల్చర్‌ విభాగాల్లో 90,573 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

ఇంజినీరింగ్‌ పరీక్షల ‘కీ’ కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని