కరెంట్‌ అఫైర్స్‌

2023 ఏప్రిల్‌లో బెర్లిన్‌లో జరిగిన ‘వరల్డ్‌ చెస్‌ ఆర్మగెడాన్‌ ఆసియా అండ్‌ ఓషినియా’ పోటీల్లో విజేతగా నిలిచిన భారత చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌ ఎవరు?

Published : 25 May 2023 03:42 IST

నమూనా ప్రశ్నలు

2023 ఏప్రిల్‌లో బెర్లిన్‌లో జరిగిన ‘వరల్డ్‌ చెస్‌ ఆర్మగెడాన్‌ ఆసియా అండ్‌ ఓషినియా’ పోటీల్లో విజేతగా నిలిచిన భారత చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌ ఎవరు? (ఫైనల్లో మాజీ ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌ నోడిర్బెక్‌ అబ్దుసత్తోరోవ్‌ (ఉజ్బెకిస్థాన్‌) పై ఈ భారత గ్రాండ్‌ మాస్టర్‌ విజయం సాధించాడు.)

జ: డి.గుకేష్‌


ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌ జెండర్లకు ఓబీసీ కేటగిరి కింద రిజర్వేషన్లు కల్పించింది? (సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ రిజర్వేషన్ల కింద వీరు ప్రభుత్వ నియామకాల్లో లబ్ధి పొందుతారు.) 

జ: మధ్యప్రదేశ్‌


‘డిఫెన్స్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌’ అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును ఇటీవల ఏ నగరంలో నిర్వహించారు? (భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ సదస్సును ప్రారంభించారు.) 

జ: న్యూదిల్లీ


2023, ఏప్రిల్‌ 10న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఏ రాష్ట్రంలోని కిబితు గ్రామంలో ‘వైబ్రంట్‌ విలేజస్‌ ప్రోగ్రామ్‌ (వీవీపీ)’ను ప్రారంభించారు? (ఇండియా - చైనా సరిహద్దులో ఉన్న భారత గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రూ.4800 కోట్లతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మొత్తంలో రూ.2500 కోట్లను పూర్తిగా రోడ్ల అనుసంధానం కోసం 2022-23 నుంచి 2025-26 వరకు ఉపయోగించనున్నారు.)

జ: అరుణాచల్‌ ప్రదేశ్‌


మహాత్మా జ్యోతిబాపులే జయంతి (ఏప్రిల్‌ 11) ని 2023లో ఏ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది? 

జ: రాజస్థాన్‌


ఏ దేశంలో భారత్‌ సహకారంతో నిర్మించిన బుజి బ్రిడ్జ్‌ను ఇటీవల ఆ దేశ పర్యటనలో భాగంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ప్రారంభించారు? (132 కిలోమీటర్ల టికా-బుజి-నోవా-సోఫియా రోడ్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా దీన్ని నిర్మించారు.)

జ: మొజాంబిక్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని