కరెంట్‌ అఫైర్స్‌

భారత్‌లోని ఏ బీచ్‌ వరుసగా మూడో ఏడాది అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన ‘బ్లూఫ్లాగ్‌’ సర్టిఫికెట్‌ను పొందింది? (1987 నుంచి డెన్మార్క్‌లోని ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ (ఎఫ్‌ఈఈ) సంస్థ ఈ సర్టిఫికెట్‌లను ఇస్తోôది.

Published : 26 May 2023 01:12 IST

మాదిరి ప్రశ్నలు

* భారత్‌లోని ఏ బీచ్‌ వరుసగా మూడో ఏడాది అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన ‘బ్లూఫ్లాగ్‌’ సర్టిఫికెట్‌ను పొందింది? (1987 నుంచి డెన్మార్క్‌లోని ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ (ఎఫ్‌ఈఈ) సంస్థ ఈ సర్టిఫికెట్‌లను ఇస్తోôది. స్వచ్ఛత, ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి పర్యావరణహితంగా, పర్యాటక స్వర్గధామంగా ఉన్న బీచ్‌లకు ఈ గుర్తింపు లభిస్తుంది. దేశంలో ఇప్పటి వరకు 12 బీచ్‌లకు ‘బ్లూఫ్లాగ్‌’ సర్టిఫికెట్‌ లభించింది.)

జ: రుషికొండ, విశాఖపట్టణం

* 2023 ఏప్రిల్‌లో ఏ దేశం ‘ఒఫెక్‌-13’ నిఘా ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది? (పల్మాచిమ్‌ ఎయిర్‌ బేస్‌ స్పేస్‌ పోర్ట్‌ నుంచి షవిట్‌ రాకెట్‌ ద్వారా ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించారు.)

జ: ఇజ్రాయెల్‌

* 2023, మార్చి 29న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ రెండు దేశాలను మలేరియా రహిత దేశాలుగా ప్రకటించింది?

జ: అజర్‌ బైజాన్‌, తజికిస్థాన్‌

* అమెరికా రక్షణశాఖ ఏ దేశంలో కొత్తగా నాలుగు సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది?

జ: ఫిలిప్పీన్స్‌

* భారత ప్రభుత్వం ఏ సంవత్సరం నాటికి ఒక ట్రిలియన్‌ డాలర్ల (లక్ష కోట్ల డాలర్లు) పర్యాటక ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకుంది?

జ: 2047


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని