అదో అతిపెద్ద జీవరసాయన కర్మాగారం!

జీవులు తినే ఆహారాన్ని సాధారణ రసాయన పదార్థాలుగా విచ్ఛిన్నం చేసేదే జీర్ణవ్యవస్థ. ఆహారంలోని పోషకాలను గ్రహించి, వ్యర్థాలను విసర్జిస్తుంది. తద్వారా శరీరానికి కావాల్సిన శక్తి సమకూరుతుంది.

Published : 27 May 2023 04:57 IST

జనరల్‌ స్టడీస్‌ బయాలజీ
జీర్ణవ్యవస్థ, విసర్జక వ్యవస్థ

జీవులు తినే ఆహారాన్ని సాధారణ రసాయన పదార్థాలుగా విచ్ఛిన్నం చేసేదే జీర్ణవ్యవస్థ. ఆహారంలోని పోషకాలను గ్రహించి, వ్యర్థాలను విసర్జిస్తుంది. తద్వారా శరీరానికి కావాల్సిన శక్తి సమకూరుతుంది. కీటకాలు, పక్షులు, జలచరాలు, జంతువుల వంటి అన్ని జీవుల్లోనూ ఈ వ్యవస్థ ఉంటుంది. శాకాహార, మాంసాహార జంతువుల్లో వేర్వేరుగా ఉంటుంది. శరీరంలో సహజ భాగమైన జీర్ణవ్యవస్థ గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ముఖ్యంగా మానవ జీర్ణాశయం నిర్మాణం, దాని పనితీరు, ఇందులోని ప్రధాన అవయవాలు, అవి చేసే పనుల గురించి వారు తెలుసుకోవాలి.

1. జీర్ణవ్యవస్థ ప్రాథమిక విధులు?

1) జీర్ణక్రియ       2) శోషణం
3) జీర్ణం కాని పదార్థాల విసర్జన     4) అన్నీ

2. ఆహార పదార్థాలు జీర్ణమైన తర్వాత ఏర్పడే పదార్థాలకు సంబంధించి సరైన జత?

1) పిండి పదార్థం - గ్లూకోజ్‌
2) ప్రొటీన్‌లు - అమైనో ఆమ్లాలు
3) కొవ్వులు - కొవ్వుఆమ్లాలు
4) పైవన్నీ

3. ఆరు నెలల నుంచి రెండేళ్ల మధ్య వచ్చే పాలదంతాల సంఖ్య?

1) 20     2) 36     3) 24     4) 30

4. ఏ దంతాలను అవశేష అవయవాలుగా పరిగణిస్తారు?

1) కుంతకాలు   2) రదనికలు  
3) జ్ఞానదంతాలు   4) అగ్రచర్వణకాలు


5. రదనికలు కింది ఏ జంతువుల్లో పూర్తిగా లోపించి ఉంటాయి?

1) మాంసాహార జంతువులు
2) శాకాహార జంతువులు
3) సర్వభక్షకాలు         4) అన్నీ

6. మన శరీరంలో అత్యంత గట్టి పదార్థం?

1) ఎముక 2) దంతం  3) ఎనామిల్‌ 4) డెంటిన్‌

7. అగ్రచర్వణకాల ముఖ్యమైన విధి?

1) ఆహారాన్ని కొరకడం    2) ఆహారాన్ని చీల్చడం  
3) ఆహారాన్ని చిన్నముక్కలుగా చేయడం  
4) పైవన్నీ

8. జింజివైటిస్‌ అనే వ్యాధిలో ఏ అవయవం ప్రభావితమవుతుంది?

1) దంతం  2) ముక్కు  3) నాలుక  4) కళ్లు

9. నాలుక కింది భాగంలో ఉండే లాలాజల గ్రంథులు?

1) పెరోటిడ్‌ గ్రంథులు  
2) అథోజిహ్వికా గ్రంథులు
3) అథోజంబికా గ్రంథులు  
4) ఆర్బిటాల్‌ గ్రంథులు

10. లాలాజలంలో ఉండే లాలాజల అమైలేజ్‌ అనే ఎంజైమ్‌ ఏ ఆహార పదార్థాలను జీర్ణం చేస్తుంది?

1) కొవ్వులు 2) పిండిపదార్థాలు  
3) ప్రొటీన్‌లు 4) అమైనోఆమ్లాలు

11. జీర్ణాశయంలో ఉత్పత్తయ్యే జఠర రసంలో ఉండే ఎంజైమ్‌లు?

1) పెప్సిన్‌   2) రెనిన్‌   3) లైపేజ్‌   4) అన్నీ

12. జీర్ణాశయంలో ఉండే ఏ గ్రంథులు ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తాయి?

1) పైలోరిక్‌   2) ఫండిక్‌  
3) ఆక్సిన్‌టిక్‌   4) కార్డియాక్‌

13. జీర్ణాశయంలో ఉత్పత్తయ్యే హైడ్రోక్లోరిక్‌  ఆమ్లం విధి?

1) బ్యాక్టీరియాను చంపుతుంది.    
2) ఎంజైమ్‌లను ఉత్తేజితం చేస్తుంది.
3) ఆహారాన్ని మెత్తగా చేస్తుంది.     4) అన్నీ

14. పాలలోని కెసిన్‌ అనే ప్రొటీన్‌ను పారాకెసిన్‌గా మార్చే ఎంజైమ్‌?

1) అమైలేజ్‌  2) జైమేజ్‌  3) రెనిన్‌  4) లైపేజ్‌

15. 6.7 మీటర్ల పొడవు ఉండే చిన్నపేగులో ఉండే భాగాలు?  

1) ఆంత్రమూలం   2) మధ్యాంత్రం  
3) శేషాంత్రికం   4) అన్నీ

16. చిన్నపేగులో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఏమంటారు?

1) ఖైల్‌   2) కైమ్‌    3) బోలస్‌    4) మాలస్‌

17. కిందివాటిలో కాలేయం ప్రత్యేకతలు?

1) అతిపెద్ద గ్రంథి
2) అతిపెద్ద జీవరసాయన కర్మాగారం
3) అధిక పునరుత్పత్తి కలిగింది       4) అన్నీ

18. కిందివాటిలో కాలేయం విధులు?

1) విటమిన్‌ - ఎ, డి, బి12 లను నిల్వ చేస్తుంది.
2) ఇనుము, కొవ్వు, రాగిని నిల్వ చేస్తుంది.
3) ఉష్ణం, హెపారిన్‌ను ఉత్పత్తి చేస్తుంది.
4) పైవన్నీ

19. అధికంగా ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల కాలేయానికి కలిగే వ్యాధి?

1) సిర్రోసిస్‌   2) జింజివైటిస్‌  
3) పయోరియా 4) స్ల్కీరోసిస్‌

20. జీర్ణవ్యవస్థలోని పైత్యరసం ఉపయోగం?

1) ప్రొటీన్‌ల జీర్ణక్రియ  
2) పిండిపదార్థాల జీర్ణక్రియ
3) కొవ్వుల ఎమల్సిఫీకరణం  4) కొవ్వుల జీర్ణక్రియ

21. కాలేయం ఉత్పత్తి చేసే పైత్యరసంలో ఉండే వర్ణకాలు?

1) హీమోగ్లోబిన్‌      2) బైలిరూబిన్‌, బైలివర్డిన్‌
3) మయోగ్లోబిన్‌      4) కెరోటిన్‌

22. ప్రోటోజోవా నుంచి క్షీరదాల వరకు ఉండే ఏ ఎంజైమ్‌ను యూనివర్సల్‌ ఎంజైమ్‌ అంటారు?

1) ట్రిప్సిన్‌ 2) అమైలేజ్‌  
3) కెటలేజ్‌ 4) మాల్టేజ్‌

23. రక్తంలో అధిక మొత్తంలో పైత్యరస వర్ణకాలు జమకూడటం ఏ వ్యాధిలో కనిపిస్తుంది?  

1) రక్తహీనత 2) సిర్రోసిస్‌
3) కామెర్లు   4) డయేరియా

24. క్లోమరసంలో ఉండే ఎంజైమ్‌ల జీర్ణక్రియకు సంబంధించి సరైంది?  

1) అమైలేజ్‌ - పిండి పదార్థం - మాల్టోజ్‌ చక్కెర
2) ట్రిప్సిన్‌ - ప్రొటీన్‌లు - పాలిపెప్టైడ్‌ గొలుసు
3) లైపేజ్‌ - లిపిడ్‌లు - కొవ్వుఆమ్లాలు
4) పైవన్నీ

25. చిన్నపేగులో స్రావితమయ్యే ఆంత్రరసంలోని ఏ ఎంజైమ్‌లు కార్బోహైడ్రేట్‌లను జీర్ణం చేస్తాయి?  

1) సుక్రేజ్‌  2) మాల్టేజ్‌  3) లాక్టేజ్‌  4) అన్నీ

26. ఆంత్రమూలం స్రవించే ఏ ఎంజైమ్‌ నిష్క్రియా రూపమైన ట్రిప్సినోజెన్‌ను క్రియావంతమైన ట్రిప్సిన్‌గా మారుస్తుంది?  

1) ఎలాస్టేజ్‌   2) లెసిథినేజ్‌  
3) ఎంటిరోకైనేజ్‌   4) కొల్లాజినేజ్‌

27. జీర్ణవ్యవస్థలోని ఏ భాగాన్ని అవశేష అవయవంగా పరిగణిస్తున్నారు?

1) ఆంత్రమూలం   2) ఉండూకం  
3) శేషాంత్రికం 4) పెద్దపేగు

28. 1.5 మీటర్ల పొడవు ఉండే పెద్దపేగులో ఏ భాగాలు ఉంటాయి?  

1) అంధనాళం   2) పురీషనాళం  
3) పాయువు   4) అన్నీ

29. ఉండూకం శాకాహార జంతువుల్లో దేనికి ఉపయోగపడుతుంది?  

1) సెల్యులోజ్‌ జీర్ణక్రియ  2) కొవ్వుల జీర్ణక్రియ
3) ప్రొటీన్‌ల జీర్ణక్రియ 4) పిండిపదార్థాల జీర్ణక్రియ

30. ఆంత్రరసంలోని మాల్టేజ్‌ ఎంజైమ్‌ మాల్టోజ్‌ చక్కెరను ఏ విధంగా మారుస్తుంది?

1) గ్లూకోజ్‌   2) లాక్టోజ్‌  
3) రైబోజ్‌   4) సుక్రోజ్‌

31. జంతువుల విసర్జన క్రియలో ఏ నత్రజని సంబంధ వ్యర్థాలు విసర్జితమవుతాయి?

1) అమ్మోనియా   2) యూరియా  
3) యూరికామ్లం   4) అన్నీ

32. క్షీరదాలు ప్రధానంగా ఏ నత్రజని సంబంధ వ్యర్థాలను విసర్జిస్తాయి?

1) గ్వానైన్‌   2) ఇన్సులిన్‌  
3) యూరియా   4) అమ్మోనియా

33. యూరిక్‌ ఆమ్లాన్ని ముఖ్య విసర్జక పదార్థంగా  విసర్జించే జీవులు?

1) పక్షులు, సరీసృపాలు   2) క్షీరదాలు, కప్ప
3) కప్ప టాడ్‌పోల్‌ లార్వా, నత్త  
4) కీటకాలు, సాలీడు

34. కీటకాల్లో విసర్జక అవయవాలుగా పనిచేసేవి?

1) జ్వాలాకణాలు   2) హరితగ్రంథులు
3) మాల్ఫీజియన్‌ నాళికలు 4) మూత్రపిండాలు

35. మానవుడిలో మూత్రపిండాలు కాకుండా అనుబంధ విసర్జక అవయవాలు

1) చర్మం 2) ఊపిరితిత్తులు
3) కాలేయం 4) అన్నీ

36. నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాల్లో అత్యంత విషపూరితమైంది?

1) అమ్మోనియా   2) యూరియా  
3) యూరికామ్లం   4) శాఖరిన్‌

37. జీవులు-విసర్జక అవయవాల గురించి కింది జతల్లో సరికానిది ఏది?

1) జ్వాలాకణాలు - ప్లాటీహెల్మింథిస్‌
2) నెఫ్రీడియా - అనెలిడా
3) మూత్రపిండాలు - మొలస్కా జీవులు
4) మాల్ఫీజియన్‌ నాళికలు - కీటకాలు

38. మానవుడి మూత్రపిండాలకు సంబంధించిన వాక్యాల్లో సరికానిది?  

1) మూత్రపిండాలు చిక్కుడు గింజల ఆకారంలో ముదురు ఎరుపు రంగులో ఉంటాయి.
2) మూత్రపిండాల సరాసరి బరువు 150 గ్రాములు.
3) ఎడమ మూత్రపిండం కంటే కుడి మూత్రపిండం చిన్నది.
4) మూత్రపిండాలు రక్తాన్ని ఉత్పత్తి చేస్తాయి.

39. మూత్రపిండాల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు?

1) నెఫ్రాన్‌లు   2) మూత్రనాళాలు  
3) మూత్రనాళికలు   4) రక్తనాళాలు

40. మూత్రపిండాల విధులకు సంబంధించి కింది   వాక్యాల్లో సరికానిది?

1) నత్రజని సంబంధ వ్యర్థాలను విసర్జిస్తాయి.
2) శరీరంలో నీరు, లవణాల క్రమత నియంత్రణ.
3) విటమిన్‌-సి ను ఉత్పత్తి చేస్తాయి.
4) ఎరిథ్రోపాయిటిన్‌ ప్రొటీన్‌ను విడుదల చేసి
ఎర్రరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడతాయి.

41. నెఫ్రాన్‌లో రక్తం వడపోత ఏ భాగంలో జరుగుతుంది?

1) బౌమన్స్‌ గుళిక   2) గ్లోమెరులస్‌  
3) సంగ్రహణ నాళం   4) హెన్లీ శిఖ్యం

42. మూత్రపిండాలు, వాటి వ్యాధుల అధ్యయనాన్ని ఏమంటారు?

1) యూరాలజీ   2) ఆండ్రాలజీ  
3) నెఫ్రాలజీ   4) ఆంత్రోపాలజీ

43. మానవుడిలో సరాసరి ఒక రోజుకు ఉత్పత్తి అయ్యే మూత్రం పరిమాణం? (లీటర్లలో)    

1) 1.5 - 1.8    2) 5    3) 3    4) 10

44. మనం విసర్జించే మూత్ర పరిమాణం వేటిపై ఆధారపడి ఉంటుంది?

1) తీసుకునే నీటి పరిమాణం  2) శారీరక శ్రమ
3) ఉష్ణోగ్రత   4) అన్నీ

45. కింది ఏ పదార్థాలు మన శరీరంలో ఎక్కువ మూత్రం ఉత్పత్తికి తోడ్పడతాయి?

1) ఆల్కహాల్‌   2) టీ   3) కాఫీ   4) అన్నీ

46. ఏ జీవుల్లో మూత్రాశయం ఉండదు?

1) పాములు  2) పక్షులు  3) మొసలి 4) అన్నీ  

47. రక్తాన్ని కృత్రిమంగా వడపోసి దానిలోని నత్రజని సంబంధ వ్యర్థాలను తగ్గించడాన్ని ఏమంటారు?

1) పెరిటోనియల్‌ డయాలసిస్‌ 2) హీమోడయాలిసిస్‌
3) పెరిస్టాలిసిస్‌   4) కీమో అనాలిసిస్‌


సమాధానాలు

1-4; 2-4; 3-1; 4-3; 5-2; 6-3; 7-3; 8-1; 9-1; 10-2; 11-4; 12-2; 13-4; 14-3; 15-4; 16-1; 17-4; 18-4; 19-1; 20-3; 21-2; 22-1; 23-3; 24-4; 25-4; 26-3; 27-2; 28-4; 29-1; 30-1; 31-4; 32-2; 33-1; 34-3; 35-4; 36-1; 37-3; 38-4; 39-1; 40-3; 41-2; 42-3; 43-1; 44-4; 45-4; 46-4; 47-2.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని