అతడే ఎమ్మండలం గొండ రుళియ!

అద్భుతమైన దేవాలయాలు, విశిష్ట శిల్పాలు, విశేష సాహిత్య రచనలతో  సాంస్కృతిక వారసత్వాన్ని సమున్నత స్థాయిలో నిలిపిన ఆ మూడు రాజవంశాలకు దక్షిణ భారతదేశ చరిత్రలో ప్రత్యేకస్థానం ఉంది.

Updated : 28 May 2023 03:23 IST

భారతదేశ చరిత్ర

అద్భుతమైన దేవాలయాలు, విశిష్ట శిల్పాలు, విశేష సాహిత్య రచనలతో  సాంస్కృతిక వారసత్వాన్ని సమున్నత స్థాయిలో నిలిపిన ఆ మూడు రాజవంశాలకు దక్షిణ భారతదేశ చరిత్రలో ప్రత్యేకస్థానం ఉంది. ఎన్నో పట్టణాలను నిర్మించి, వివిధ దేశాలతో విస్తృత వాణిజ్యం నిర్వహించి, పటిష్ఠ పాలన అందించి సమర్థ పాలకులుగా  అనేక రకాల బిరుదులతో ప్రసిద్ధి చెందిన చోళ, పాండ్య, హోయసాల వంశాల రాజులు, రాజ్యాల గురించి అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి.


చోళులు, హోయసాలులు - పాండ్యులు

1. చోళ రాజ్య స్థాపకుడు ఎవరు?
1) మొదటి రాజరాజు   2) విజయాలయుడు    
3) ఆదిత్య చోళుడు     4) రాజేంద్ర చోళుడు
2. మధురైకొండ అనే బిరుదు గలవారు?
1) విజయాలయుడు   2) ఆదిత్య చోళుడు  
3) మొదటి పరాంతకుడు   4) రెండో పరాంతకుడు
3. తంజావూరులో రాజరాజేశ్వర బృహదీశ్వరాలయాన్ని నిర్మించినవారు?
1) మొదటి పరాంతకుడు 2) రాజేంద్రుడు      
3) ఆదిత్య చోళుడు     4) మొదటి రాజరాజు
4. చోళ రాజరాజు అనుమతితో నాగ పట్టణంలో బౌద్ధ విహారం నిర్మించిన శైలేంద్ర రాజు ఎవరు?
1) కుమార వర్మ    
2) మేఘవర్మ    
3) శ్రీమార విజయోత్తుంగ వర్మ      
4) రాజవర్మ
5. కిందివారిలో శివపాద శేఖర బిరుదు గలవారు?
1) మొదటి రాజరాజు 2) రెండో రాజరాజు    
3) మొదటి పరాంతకుడు   4) ఆదిత్య చోళుడు
6. గంగైకొండ చోళ అనే బిరుదు ఎవరిది?
1) రాజేంద్రుడు     2) పరాంతకుడు      
3) విజయాలయుడు     4) మొదటి రాజరాజు
7. ఉత్తరమేరూర్‌ శాసనం వేయించినవారు?
1) పరాంతకుడు       2) రాజాధిరాజు    
3) రాజేంద్రుడు       4) విజయాలయుడు
8. గొప్ప స్థానిక పరిపాలనను ప్రవేశపెట్టినవారు?
1) పల్లవులు       2) చాళుక్యులు    
3) చోళులు     4) రాష్ట్రకూటులు
9. గంగైకొండ చోళపురాన్ని నిర్మించి రాజధానిగా చేసుకున్నవారు?
1) మొదటి రాజరాజు       2) రాజేంద్రుడు      
3) రాజాధిరాజు       4) ఆదిత్య చోళుడు
10. రామానుజాచార్యుడిని హింసించి క్రిమికంఠ చోళుడిగా, వైష్ణవ వాజ్ఞ్మయంలో నీచంగా పిలిపించుకున్న చోళరాజు ఎవరు?
1) వీర రాజేంద్రుడు     2) ఆది రాజేంద్రుడు    
3) రాజరాజు       4) పరాంతకుడు
11. త్రిభువని కళాశాల ఎక్కడ ఉండేది?
1) పుదుచ్చేరి         2) తంజావూరు        
3) కుంభకోణం       4) దళవానూరు
12. ‘యాప్పరుంగళం’ను రచించినవారు?
1) తిరువళ్లువర్‌       2) రాజేంద్రుడు      
3) రాజరాజు       4) అమిత సాగరుడు
13. ఎన్నాయిరం ప్రాంతంలో గొప్ప కళాశాలను ఏర్పాటు చేసిన చోళ పాలకుడు?
1) పరాంతకుడు     2) ఆదిత్య చోళుడు      
3) రాజేంద్ర చోళుడు     4) రాజరాజు
14. జీవక చింతామణిని రచించినవారు?
1) తిరుత్తక్కదేవర       2) పెరియార్‌      
3) నక్కిరన్‌     4) ఇలంగో అడిగళ్‌
15. పెరియ పురాణాన్ని రచించినవారు?
1) ఇలంగో అడిగళ్‌     2) శెక్కిలార్‌      
3) అండార్‌ నంబి       4) జయగొండార్‌
16. కంప హరేశ్వర ఆలయం ఎక్కడ ఉండేది?
1) తంజావూరు         2) తిరునల్వేలి      
3) త్రిభువనం     4) కుంభకోణం
17. రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురంలోని శివాలయాన్ని దేన్ని అనుకరిస్తూ నిర్మించాడు?

1) ఐరావతేశ్వరాలయం 2) బృహదీశ్వరాలయం    
3) కంప హరేశ్వరాలయం  4) చోళేశ్వరాలయం
18. ఐరావతేశ్వరాలయం ఎక్కడ ఉండేది?
1) త్రిభువనం       2) కన్ననూరు      
3) దారాసురం         4) తిరునల్వేలి
19. నానార్థనవ సంక్షేమం అనే సంస్కృత నిఘంటువును రచించినవారు?
1) కేశవస్వామి     2) జయగొండార్‌      
3) అండార్‌ నంబి       4) రామానుజుడు
20. శ్రీలంక పాలకుడిని ఓడించి అనురాధపురాన్ని ఆక్రమించిన చోళ పాలకుడు ఎవరు?
1) రాజేంద్ర చోళుడు     2) రాజరాజు      
3) కులోత్తుంగ చోళుడు     4) పరాంతకుడు
21. శ్రీవిజయ పాలకుడిని ఓడించి కడ్తారంగొండ బిరుదును ధరించినవారు?
1) సింహ విష్ణువు     2) రాజేంద్ర చోళుడు      
3) రాజరాజు         4) పరాంతకుడు
22. పులోర్నవ నగరాన్ని నిర్మించి శ్రీలంక రాజధానిగా చేసిన చోళ పాలకుడు?
1) రాజరాజు     2) ఆదిత్య చోళుడు  
3) రాజేంద్ర చోళుడు     4) కులోత్తుంగ చోళుడు
23. కళింగట్టు పరని గ్రంథ రచయిత ఎవరు?
1) ముడిగొండై     2) కులోత్తుంగ      
3) జయగొండార్‌     4) మార్తాండ
24. ఏ చోళ పాలకుడి కాలంలో బంగాఖాతానికి చోళసముద్రం అనే పేరు వచ్చింది?
1) రాజరాజు     2) పరాంతకుడు        
3) ఆదిత్య చోళుడు       4) రాజేంద్రుడు
25. స్వతంత్ర పాండ్య రాజ్యాన్ని స్థాపించినవారు?
1) మారవర్మ   2) సుందర పాండ్యుడు  
3) జటావర్మ కులశేఖరుడు  4) వీర పాండ్యుడు
26. హేమాచ్చధనరాజు అనే బిరుదు గలవారు?
1) మారవర్మ     2) జటావర్మ సుందరపాండ్యుడు
3) కులశేఖరుడు   4) జటావర్మ కులశేఖరుడు
27. మార్కోపోలో పాండ్యరాజ్యాన్ని ఎప్పుడు దర్శించాడు?
1) 1262  2) 1274  3) 1287  4) 1293
28. అరబ్బీ రచనల్లో పాండ్యరాజ్యంగా ప్రసిద్ధి చెందింది?
1) మధురై 2) కుంభకోణం
3) కావేరి పట్టణం 4) మాబార్‌
29. మార్కోపోలో వివరించిన తామ్రపర్ణి ముఖద్వారంలో ఉన్న ఓడరేవు ఏది?
1) మధురై   2) కయాల్‌  
3) సువర్ణరేవు   4) తంజావూరు
30. మార్కోపోలో పాండ్యరాజ్యంలో ఏ పట్టణాన్ని దర్శించాడు?
1) తంజావూరు 2) ఉదయూరు
3) మాబార్‌ 4) మధురై
31. ‘ఎమ్మండలం గొండ రుళియ’ అనే బిరుదు ఎవరిది?
1) జటావర్మ సుందరపాండ్యుడు  2) కులశేఖరుడు
3) వీర పాండ్యుడు      4) మారవర్మ
32. కింది ఏ పాండ్య పాలకుడు సింహళ దేశం నుంచి బుద్ధ ధాతువును తీసుకువచ్చాడు?
1) వీర పాండ్యుడు    2) సుందర పాండ్యుడు
3) నెడుంజెలియన్‌   4) కులశేఖర పాండ్యుడు
33. శ్రీరంగం, చిదంబరం, రామేశ్వరం దేవాలయ విమానాలకు బంగారు తొడుగు వేయించినవారు?          
1) జటావర్మ సుందరపాండ్యుడు 2) నెడుంజెలియన్‌  
3) సింహవర్మ      4) మారవర్మ
34. పాండ్యుల ఆస్థానంలో ఉద్యోగాలు పొందిన విదేశీయులు?
1) ఇటలీవారు   2) అరబ్బులు  
3) పోర్చుగీసువారు     4) శ్రీలంకవారు
35. ‘మాబార్‌ హింద్‌’కు కీలక స్థానంలో ఉందని పేర్కొన్నవారు?
1) మార్కోపోలో 2) డామింగోపేస్‌  
3) అబ్దుల్లావాసఫ్‌   4) తారీఖ్‌ షా
36. హోయసాల రాజ్యస్థాపకుడు ఎవరు?
1) బిత్తిదేవ విష్ణువర్ధనుడు 2) రాజ్యవర్ధనుడు
3) ప్రభాకర వర్ధనుడు 4) మూడో బల్లాలుడు
37. చివరి హోయసాల రాజు ఎవరు?
1) మొదటి బల్లాలుడు  2) రెండో బల్లాలుడు
4) మూడో బల్లాలుడు  4) మూడో నరసింహుడు
38. బిత్తిదేవుడు మొదట జైన మతస్థుడిగా ఉండి ఎవరి ప్రభావం వల్ల వైష్ణవుడిగా మారాడు?
1) మద్వాచార్యులు 2) రామానుజాచార్యులు
3) నమ్మాళ్వారు   4) పెరుంగురు
39. జైనరామాయణంను ఎవరు రాశారు?
1) నక్కీరుడు 2) నాగచంద్రుడు
3) నాగసేనుడు 4) కృష్ణసేనుడు
40. కన్నడ భాషలో మొదటి నవల ఏది?
1) జైన కల్యాణం 2) రాజసింహం
3) లీలావతి 4) జైనగీతం
41. బేలూరులోని చెన్నకేశవాలయాన్ని ఎవరు నిర్మించారు?
1) నరసింహుడు   2) మూడో బల్లాలుడు
3) రెండో బల్లాలుడు   4) బిత్తిదేవుడు
42. ‘అభినవ పంప’గా ఏ కవిని కీర్తించారు?
1) నాగచంద్రుడు   2) నేమిచంద్రుడు  
3) నాగసేనుడు   4) ధ్రువసేనుడు
43. ద్వారసముద్రంలో హోయసలేశ్వరాలయాన్ని నిర్మించినవారు?
1) బిత్తిదేవుడు   2) మూడో బల్లాలుడు  
3) రెండో బల్లాలుడు   4) నరసింహుడు
44. ‘లీలావతి’ గ్రంథ రచయిత ఎవరు?
1) వసుబంధుడు 2) జ్ఞానచంద్రుడు
3) నాగచంద్రుడు 4) నేమిచంద్రుడు
45. వీరశైవ వచనాలు ఎవరి కాలంలో తయారయ్యాయి?
1) హోయసాలులు 2) యాదవరాజులు
3) పాండ్యులు   4) చోళులు
46. చోళుల గురించి ప్రస్తావించిన గ్రంథాలు?
ఎ) ది గైడ్‌ టు జాగ్రఫీ   బి) మహాభారతం
సి) పెరిప్లస్‌ ఆఫ్‌ ది ఎరిత్రియన్‌ సీ  
డి) మహావంశ
1) ఎ, బి   2) ఎ, బి, సి    
3) ఎ, బి, సి, డి   4) బి, డి
47. ప్రాచీన చోళ వంశంలో గొప్పవాడు అయిన కరికాలుడికి సమకాలీనుడైన గజబాహుడు ఏ ప్రాంత రాజు?
1) శ్రీలంక   2) మలయ  
3) బెంగాల్‌   4) చేరరాజ్య రాజు
48. మొదటి పరాంతకుడు ఎవరి కుమారుడు?
1) విజయాలుడు   2) ఆదిత్య చోళుడు  
3) కన్నర దేవుడు   4) రాజరాజ చోళ
49. రాజేంద్ర చోళుడు ఇతర రాజ్యాలపై దాడి చేసి తెచ్చిన విగ్రహాల్లో తప్పుగా ఉన్నది?
1) బెంగాల్‌ రాజులు - కాళిమాత విగ్రహం
2) కళింగ రాజులు - భైరవుడి విగ్రహం
3) పశ్చిమ చాళుక్యులు - సుబ్రమణ్య స్వామి విగ్రహం
4) తూర్పు చాళుక్యులు - నంది, గణేశ్‌, దుర్గా మాత విగ్రహాలు
50. చైనాకు రాయబారులను పంపిన చోళ రాజు?
1) రాజేంద్ర చోళ     2) ఆద్యిత చోళ  
3) అరుమెళి వర్మన్‌    4) మొదటి పరాంతకుడు
51. చోళుల కాలంనాటి అతిచిన్న పరిపాలన విభాగం
1) నాడు  2) ఉర్‌  3) వలనాడు  4) మండలం
52. చోళుల కాలంనాటి భూముల రకాలకు సంబంధించి కిందివాటిలో సరికానిది?
1) బ్రహ్మదీయ - బ్రాహ్మణుల భూమి
2) శాలభోగ - పాఠశాల భూమి
3) వెల్లన్‌వాగై - జైన మతస్థుల భూమి
4) దేవదాన - దేవాలయాల భూమి


సమాధానాలు

1-2; 2-3; 3-4; 4-3; 5-1; 6-1; 7-1; 8-3; 9-2; 10-2; 11-1; 12-4; 13-3; 14-1; 15-2; 16-3; 17-2; 18-3; 19-1; 20-2; 21-2; 22-1; 23-3; 24-4; 25-3; 26-2; 27-4; 28-4; 29-3; 30-3; 31-1; 32-4; 33-1; 34-2; 35-3; 36-1; 37-3; 38-2; 39-2; 40-3; 41-4. 42-1; 43-4; 44-4; 45-1; 46-3; 47-1; 48-2; 49-3; 50-1; 51-2; 52-3.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని