ఇండియా-మయన్మార్ మధ్య కొకో!
భారతదేశం ప్రపంచ భూభాగంలో రెండు శాతం వైశాల్యంతో అతిపెద్ద దేశాల జాబితాలో ఏడో స్థానంలో ఉంది. ఉనికి పరంగా భూమధ్యరేఖకు ఎగువన ఉత్తరార్ధ గోళంలో, ఆసియా ఖండంలో దక్షిణ భాగంలో ఉంది.
భారత భౌగోళిక అమరిక - ఉనికి
ఇండియన్ జాగ్రఫీ
భారతదేశం ప్రపంచ భూభాగంలో రెండు శాతం వైశాల్యంతో అతిపెద్ద దేశాల జాబితాలో ఏడో స్థానంలో ఉంది. ఉనికి పరంగా భూమధ్యరేఖకు ఎగువన ఉత్తరార్ధ గోళంలో, ఆసియా ఖండంలో దక్షిణ భాగంలో ఉంది. ఏడు దేశాలతో భూ సరిహద్దును, శ్రీలంకతో సముద్ర జలాల సరిహద్దును పంచుకుంటోంది. పలు ప్రామాణిక అక్షాంశ, రేఖాంశాలు ఎన్నో రాష్ట్రాలు, నగరాలు, పట్టణాల మీదుగా వెళుతున్నాయి. భూగోళ శాస్త్ర అధ్యయనంలో భాగంగా భారతదేశ భౌగోళిక అమరిక, సరిహద్దులు, సరిహద్దు దేశాలు, రాష్ట్రాల హద్దులపై పోటీ పరీక్షార్థులు పూర్తి అవగాహన పెంచుకోవాలి. ఇటీవల కాలంలో దేశ రాజకీయ పటంలో జరిగిన మార్పులను, అలాగే ఏపీ పునర్విభజనతో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సర్దుబాట్లను సమగ్రంగా తెలుసుకోవాలి.
1. భారతీయ భూగోళశాస్త్ర పితామహుడిగా పేరొందినవారు?
1) జార్జ్ ఎవరెస్ట్ 2) జేమ్స్ రన్నెల్
3) లాంటన్ 4) హెకాటియస్
2. కిందివాటిని జతపరచండి. పేరు ఆధారం
1. రత్నకర ఎ) జంబుద్వీప
2. భరతవర్ష బి) హిందూ మహాసముద్రం
3. నభివర్ష సి) గ్రీకులు
4. ఇండోయి డి) జైనమతం
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
3. భారతదేశంతో భూసరిహద్ద్దు ఉన్న పొరుగు దేశాల్లో అత్యధిక, అత్యల్ప సరిహద్దున్న వాటిని గుర్తించండి.
1) పాకిస్థాన్ - అఫ్గానిస్థాన్
2) బంగ్లాదేశ్ - అఫ్గానిస్థాన్
3) చైనా - భూటాన్
4) మయన్మార్ - నేపాల్
4. కిందివాటిని జతపరచండి. ఉనికి అక్షాంశాలు
1. ఆంధ్రప్రదేశ్ ఎ) 12°41' n- 19-°07'
అక్షాంశాల విస్తరణ ఉత్తరం
2. తెలంగాణ అక్షాంశాల బి) 15-°55' n- 19°56'
విస్తరణ ఉత్తరం
3. ఆంధ్రప్రదేశ్ రేఖాంశాల సి) 76-°50' n- 84-°41'
విస్తరణ తూర్పు
4. తెలంగాణ రేఖాంశాల డి) 77°15' n- 81-°19'
విస్తరణ తూర్పు
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
4) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
5. కిందివాటిని పరిశీలించి సరైన వాటిని గుర్తించండి.
వైశాల్యం స్థానం
ఎ) ఇండియా 7వ స్థానం
బి) తెలంగాణ 11వ స్థానం
సి) ఆంధ్రప్రదేశ్ 7వ స్థానం
డి) అర్జెంటీనా 8వ స్థానం
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
6. కిందివాటిలో కర్కట రేఖ (23 1/-2°ఉత్తరం) వెళ్లని భారతీయ రాష్ట్రం?
ఎ) గుజరాత్ బి) రాజస్థాన్
సి) మధ్యప్రదేశ్ డి) బిహార్
ఇ) పశ్చిమ బెంగాల్ ఎఫ్) మేఘాలయ
జి) ఝార్ఖండ్ హెచ్) త్రిపుర
1) ఎఫ్, బి 2) డి, ఎఫ్ 3) బి, డి 4) ఇ, జి
7. 23 1/-2°ఉత్తర కర్కటరేఖ, 82 1/-2°తూర్పు ప్రామాణిక రేఖ ఖండించుకునే చోట ఉన్న జాతీయపార్కు?
1) కన్హా 2) గురు ఘాసిదాస్
3) భందావఘర్ 4) ఫాజిల్
8. కిందివాటిని పరిగణించి సరైన వాటిని సూచించండి.
ఎ) ఇండియా అక్షాంశాలపరంగా 8ా.4× నుంచి 37ా6× ఉత్తరంగా ఉంది.
బి) ఇండియా మొత్తం 3.28 మి.చ.కి.మీ. భౌగోళిక వైశాల్యం కలిగి 15,106.7 కి.మీ. భూసరిహద్దును కలిగి ఉంది.
సి) ఇండియాకు అరేబియా, హిందూ, బంగాళాఖాతం కలిగి 7516.6 కి.మీ. తీరరేఖ ఉంది.
డి) భారతదేశ ప్రాదేశిక భౌమజలాలు 12 నాటికల్ మైళ్లు విస్తరించి ఉన్నాయి.
1) ఎ, డి 2) బి, సి 3) ఎ, బి, సి 4) పైవన్నీ
9. కిందివాటిలో జాబితా-1తో జాబితా-2 ను జతపరచి సరైన కోడ్ ద్వారా సమాధానం ఎంచుకోండి.
జాబితా - 1 జాబితా - 2
1. 10వ డిగ్రీ ఛానెల్ ఎ) ఇండియా - మయన్మార్
2. 9వ డిగ్రీ ఛానెల్ బి) నికోబార్ - సుమత్రా
3. గ్రాండ్ ఛానెల్ సి) మినికాయ్ - సుహేలి
4. కొకో ఛానెల్ డి) అండమాన్ - నికోబార్
ఇ) లక్షదీవులు - మాల్దీవులు
1) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
10. కిందివాటిలో సాధారణంగా పాకిస్థాన్‌తో సరిహద్దు పంచుకోని ప్రాంతం
ఎ) గుజరాత్ బి) రాజస్థాన్
సి) పంజాబ్ డి) హరియాణా
ఇ) లద్దాఖ్ ఎఫ్) జమ్ము-కశ్మీర్
1) ఎ 2) డి 3) ఇ 4) సి
11. కిందివాటిలో ఉత్తర చివరి అక్షాంశపు నగరం/పట్టణం ఏది?
1) అహ్మదాబాద్ 2) పంచ్‌మర్రి
3) అలహాబాద్ 4) పట్నా
12. కిందివాటిలో 82 1/-2° తూర్పు భారత ప్రామాణిక రేఖాంశం లేని రాష్ట్రం?
1) ఆంధ్రప్రదేశ్ 2) ఒడిశా
3) ఉత్తర్‌ప్రదేశ్ 4) బిహార్
13. ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలు ఏ దేశంతో సాధారణ అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి?
1) మయన్మార్ 2) చైనా
3) నేపాల్ 4) భూటాన్
14. భారతదేశ ఉనికి పరంగా పరిశీలిస్తే భూ, జల భాగాలను విభజిస్తున్న అక్షాంశం?
1) 22°ఉత్తర అక్షాంశం
2) 22°దక్షిణ అక్షాంశం
3) 23 1/-2°ఉత్తర అక్షాంశం
4) 16° ఉత్తర అక్షాంశం
15. కిందివాటిని జతపరచండి.
అంశం - ఖి అంశం - ఖిఖి
1. అతిపెద్ద జిల్లా ఎ) మహే-కేరళ
2. అత్యధిక జిల్లాలున్న రాష్ట్రం బి) గోవా
3. అతిచిన్న జిల్లా సి) కచ్-గుజరాత్
4. అత్యల్ప జిల్లాలు ఉన్న రాష్ట్రం డి) ఉత్తర్‌ప్రదేశ్
1) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
2) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
16. భారత యూనియన్‌లో భాగమై, దక్షిణ చివరి ప్రాంతమైన ఇందిరా పాయింట్ ఏ సంవత్సరంలో సునామీ వల్ల సముద్రంలో మునిగిపోయింది?
1) 2001 2) 2004 3) 2006 4) 2008
17. పాక్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏ రెండు దేశాలను విడదీస్తున్నాయి?
1) ఇండియా - శ్రీలంక 2) ఇండియా - మాల్దీవులు
3) ఇండియా - ఇండొనేసియా
4) ఇండియా - పాకిస్థాన్
18. ఒకవేళ మీరు వేసవిలో కరైకల్‌ను వీక్షించాలనుకున్నప్పుడు, కిందివాటిలో ఏ కేంద్రపాలిత ప్రాంతాన్ని దర్శించాలి?
1) లక్షద్వీప్ 2) పుదుచ్చేరి
3) అండమాన్ నికోబార్ 4) డామన్ డయ్యూ
19. కిందివాటిని జరతపరచండి.
వైశాల్యపరంగా ప్రాంతం/రాష్ట్రం
1. అతిపెద్ద రాష్ట్రం ఎ) లక్షద్వీప్
2. అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం బి) గోవా
3. అతిచిన్న రాష్ట్రం సి) లద్దాక్
4. అతిచిన్న కేంద్రపాలిత ప్రాంతం డి) రాజస్థాన్
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
20. భారతదేశ ఉత్తరాన ఉన్న సరిహద్దు పొరుగు దేశాలు?
1) బంగ్లాదేశ్, మయన్మార్
2) చైనా, నేపాల్, భూటాన్
3) అఫ్గానిస్థాన్, పాకిస్థాన్
4) మాల్దీవులు, శ్రీలంక
21. భారతదేశ మొత్తానికి 82 1/2ా తూర్పు ప్రామాణిక రేఖను ఎక్కడ కొలమానంగా తీసుకుంటున్నారు?
1) ఛత్తీస్‌గఢ్ - బైకుంఠపుర్
2) ఆంధ్రప్రదేశ్ - యానాం
3) ఉత్తర్‌ప్రదేశ్ - మిర్జాపుర్
4) ఉత్తర్‌ప్రదేశ్ - అలహాబాద్
22. భారత ఉపఖండంలో MBBS PAIN (మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, ఇండియా, నేపాల్) దేశాల్లో అతిపెద్ద, అతిచిన్న దేశాలను గుర్తించండి.
1) ఇండియా, నేపాల్
2) బంగ్లాదేశ్, మాల్దీవులు
3) ఇండియా, మాల్దీవులు 4) ఇండియా, భూటాన్
23. 2019, అక్టోబరు 31 తర్వాత భారతదేశంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి?
1) 29, 7 2) 28, 9
3) 28, 8 4) 29, 8
24. భారతదేశానికి మూడువైపులా సముద్రాలతో మొత్తం 7516.6 కి.మీ. తీరరేఖను కలిగి 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి.
అయితే కింది రాష్ట్రాలైన 1) ఆంధ్రప్రదేశ్
2) గుజరాత్ 3) తమిళనాడు 4) పశ్చిమ బెంగాల్
5) గోవాలను అవరోహణ క్రమంలో అమర్చండి.
1) 5 - 4 - 3 - 2 - 1
2) 1 - 2 - 3 - 4 - 5
3) 2 - 1 - 3 - 4 - 5
4) 3 - 2 - 1 - 5 - 4
25. కిందివాటిని జతపరచండి.
భాగం - ఎ భాగం - బి
1. భారతదేశం మధ్య ఎ) ద్వీపకల్పం
నుంచి వెళ్లే రేఖ
2. నలువైపులా నీరుండే బి) సింధూశాఖ
మధ్య భూభాగం
3. రెండు ప్రాంతాల సి) ద్వీపం
మధ్య సన్నని ఇరుకైన జల ప్రాంతం
4. మూడు వైపులా జలం డి) కర్కటకరేఖ మధ్యభాగం
ఇ) భూమధ్యరేఖ
1) 1-డి 2-సి 3-బి 4-ఎ
2) 1-ఎ 2-బి 3-సి 4-డి
3) 1-సి 2-డి 3-బి 4-ఎ
4) 1-బి 2-సి 3-డి 4-ఎ
26. కిందివాటిలో తప్పుగా ఉన్నవాటిని సూచించండి.
ఎ. ఆంధ్రప్రదేశ్‌కు దక్షిణాన చివరన ఉన్న అక్షాంశ ప్రాంతం - కుప్పం (చిత్తూరు)
బి. తెలంగాణకు ఉత్తరాన చివరన ఉన్న అక్షాంశ ప్రాంతం - జైనాథ్ (ఆదిలాబాద్)
సి. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాష్ట్రపక్షి - పాలపిట్ట
డి. తెలంగాణ జిల్లాల పునర్విభజన వల్ల అధిక జిల్లాలుగా విభజితమైంది - వరంగల్
1) డి 2) సి 3) బి 4) ఎ
27. కిందివాటిని పరిగణించండి.
ఎ) ఇండియాకు నైరుతి దిశలో అరేబియా సముద్రంలో లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతం ఉంది.
బి) లక్షదీవుల్లోని పిట్టి వద్ద సముద్ర తాబేళ్ల సంతానోత్పత్తి పరిశోధన కేంద్రం ఉంది.
1) ఎ సరైంది 2) బి సరైంది
3) ఎ, బి, సరైనవి 4) ఎ, బి సరైనవి కావు
సమాధానాలు
1-2, 2-1, 3-2, 4-2, 5-4, 6-2, 7-2, 8-4, 9-4, 10-2, 11-4, 12-4, 13-3, 14-1, 15-3, 16-2, 17-1, 18-2, 19-1, 20-2, 21-3, 22-3, 23-3, 24-3, 25-1, 26-2, 27-3.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
IND vs AUS: ఆసీస్‌పై భారత్ విజయం.. మూడు వన్డేల సిరీస్‌లో ఆధిక్యం
-
Mainampally: భారాసకు మైనంపల్లి హన్మంతరావు రాజీనామా
-
APMDC: ఏపీలో బీచ్‌శాండ్ మైనింగ్‌కు టెండర్లు.. రూ.వెయ్యికోట్ల ఆదాయమే లక్ష్యం
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!