కరెంట్ అఫైర్స్
వలస కార్మికుల స్థితిగతులు, ఆదాయ పరిస్థితులపై ‘ప్రపంచ అభివృద్ధి నివేదిక - 2023’ పేరిట ఏ సంస్థ ఓ నివేదికను తాజాగా విడుదల చేసింది? (భారత్-అమెరికా, భారత్-గల్ఫ్ సహకార సమాఖ్య, భారత్-బంగ్లాదేశ్‌లను ప్రపంచంలోనే అత్యధికంగా వలసదారులు నివసిస్తున్న వలస కారిడార్లుగా నివేదిక గుర్తించింది.
మాదిరి ప్రశ్నలు
* వలస కార్మికుల స్థితిగతులు, ఆదాయ పరిస్థితులపై ‘ప్రపంచ అభివృద్ధి నివేదిక - 2023’ పేరిట ఏ సంస్థ ఓ నివేదికను తాజాగా విడుదల చేసింది? (భారత్-అమెరికా, భారత్-గల్ఫ్ సహకార సమాఖ్య, భారత్-బంగ్లాదేశ్‌లను ప్రపంచంలోనే అత్యధికంగా వలసదారులు నివసిస్తున్న వలస కారిడార్లుగా నివేదిక గుర్తించింది. అదే సమయంలో అమెరికా- మెక్సికో, అమెరికా-చైనా, అమెరికా-ఫిలిప్పీన్స్, కజకిస్థాన్ -రష్యాలను అత్యధికంగా వలసలు కొనసాగే కారిడార్లుగా గుర్తించింది.)
జ: ప్రపంచ బ్యాంకు
* దిల్లీలో నూతనంగా నిర్మించిన భారత జనగణన కమిషనర్ కార్యాలయాన్ని 2023, మే 22న ఎవరు ప్రారంభించారు? (దేశ జనన, మరణాల రిజిస్టర్‌ను ఓటర్ల జాబితాతో అనుసంధానించేలా త్వరలోనే పార్లమెంటులో ఒక బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దేశ పౌరులు ఎవరికైనా సరే 18 ఏళ్లు నిండగానే వారి పేరు ఓటర్ల జాబితాలో చేరిపోయేలా ఆ బిల్లుతో వీలు కల్పించాలని భావిస్తోంది.)
జ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
* గ్రామీణ ప్రాంతాల్లో వర్షపు నీటిని పెద్ద ఎత్తున నిల్వచేసుకునే ప్రక్రియలో భాగంగా అమృత్ సరోవర్ కార్యక్రమం అమలుకు గానూ 2023 సంవత్సరానికి ఏ పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది? (దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఒక్కో జిల్లాలో 75 వంతున రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మొత్తం 1950 చెరువులను ఈ కార్యక్రమంలో ఉపాధి పథకం ద్వారా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 1810 చెరువుల నిర్మాణం పూర్తయ్యింది.)
జ: స్కోచ్ సిల్వర్ అవార్డు
* భారత్ - ఆస్ట్రేలియాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చింది? (భారత్‌కు ఆస్ట్రేలియా 13వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2000 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబరు వరకు ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు 1.07 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.)
జ: 2022, డిసెంబరు 29
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
యూపీలో రోడ్డుపై మహిళను ఈడ్చుకెళ్లిన లేడీ కానిస్టేబుళ్లు
-
భారత్‌కు తిరిగి రానున్న శివాజీ ‘పులి గోళ్లు’!
-
‘సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం’
-
కన్నవారి నడుమ కుదరని ఏకాభిప్రాయం.. మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టిన హైకోర్టు
-
Chandrababu: జైలులో నేడు చంద్రబాబు దీక్ష
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!