కరెంట్‌ అఫైర్స్‌

ఇటీవల ఏ సంస్థ కార్పొరేట్‌ డెట్‌ మార్కెట్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (సీడీఎమ్‌డీఎఫ్‌) ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది?

Published : 05 Jun 2023 01:24 IST

మాదిరి ప్రశ్నలు

* ఇటీవల ఏ సంస్థ కార్పొరేట్‌ డెట్‌ మార్కెట్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (సీడీఎమ్‌డీఎఫ్‌) ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది? 

 జ: సెబీ


* ప్రపంచ వ్యాప్తంగా గతేడాది సాయుధ సంఘర్షణలు, ప్రకృతి విపత్తుల మూలంగా ఆయా దేశాల నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ప్రజల సంఖ్య సుమారు ఎంతగా ఉంది? (నార్వే శరణార్థుల మండలికి చెందిన అంతర్గత నిర్వాసితుల పర్యవేక్షణ కేంద్రం ఈ గణాంకాలను వెల్లడించింది. వీరిలో సాయుధ సంఘర్షణ వల్ల నిర్వాసితులైనవారే 6.2 కోట్ల మంది ఉన్నారు.) 

జ: 7.1 కోట్లు


* కొలరాడో బౌల్డర్‌ విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకుల అధ్యయనం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 1992 నుంచి 2020 మధ్య ఎంత మొత్తం విస్తీర్ణం మేర నీటి వనరులు క్షీణించాయి?

జ: 90 వేల చదరపు కిలోమీటర్లు


*ఎన్నో నంబరు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న 705 మర్రి చెట్లను నరికి వేయకుండా ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించాలని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఇటీవల జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ)ను ఆదేశించింది? (ఈ జాతీయ రహదారిని గతంలో 202వ నంబరు జాతీయ రహదారిగా పిలిచేవారు. ఇది తెలంగాణలోని కొడంగల్‌ నుంచి చత్తీస్‌గఢ్‌లోని భూపాలపట్నం వరకు విస్తరించి ఉంది.)

 జ: 163వ జాతీయ రహదారి


*ఇండియా - పసిఫిక్‌ దీవుల సహకార వేదిక (ఎఫ్‌ఐపీఐసీ - ఫోరమ్‌ ఫర్‌ ఇండియా - పసిఫిక్‌ ఐలాండ్స్‌ కోఆపరేషన్‌) ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? (భారత్‌ చొరవతో 14 పసిఫిక్‌ ద్వీప దేశాలతో ఈ వేదిక ఏర్పడింది.)               

జ: 2014



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని