కరెంట్ అఫైర్స్
2023 సంవత్సరానికి గానూ ప్రతిష్ఠాత్మక లీప్‌జిగ్ బుక్ ప్రైజ్‌ను గెలుచుకున్న ప్రముఖ రష్యన్ రచయిత్రి ఎవరు? (ప్రస్తుతం ఈమె బెర్లిన్‌లో నివసిస్తున్నారు.
నమూనా ప్రశ్నలు
2023 సంవత్సరానికి గానూ ప్రతిష్ఠాత్మక లీప్‌జిగ్ బుక్ ప్రైజ్‌ను గెలుచుకున్న ప్రముఖ రష్యన్ రచయిత్రి ఎవరు? (ప్రస్తుతం ఈమె బెర్లిన్‌లో నివసిస్తున్నారు. ఈమె రాసిన ప్రముఖ పుస్తకం ‘ఇన్ మెమొరీ ఆఫ్ మెమొరీ’.)
జ: మరియా స్టెపనోవా
కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఏ రాష్ట్రాల్లో పది అణు రియాక్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల వెల్లడించింది? (ఈ పదిలో అత్యధికంగా నాలుగింటిని రాజస్థాన్‌లోని మాహి బన్స్వారా అణు విద్యుత్ కేంద్రంలో ఏర్పాటు చేయనున్నారు.)
జ: రాజస్థాన్, కర్ణాటక, హరియాణా, మధ్యప్రదేశ్
కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ గణాంకాల ప్రకారం ప్రసవాల్లో సిజేరియన్ శస్త్ర చికిత్సల జాతీయ సగటు ఎంత శాతంగా ఉంది? (ఈ సగటు కంటే అధికంగా దేశంలోని 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రసవ కోతలు జోరుగా సాగుతున్నాయి. ఆ జాబితాలో తెలంగాణ (54.09%), ఏపీ (42.15%) సైతం ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు 10-15 శాతానికి మించకూడదు.)
జ: 23.29 శాతం
సూక్ష్మ సేద్యం అమల్లో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? (రెండు, మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.)
జ: రాజస్థాన్
ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాకారులను గుర్తించడంతో పాటు యువతకు ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన కల్పించేలా ఏ కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? (ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా, మరో 13 మంది మెంబర్లుగా రాష్ట్రస్థాయి అపెక్స్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ కమిటీ ద్వారా 17 ఏళ్లు పైబడిన క్రీడాకారులను గుర్తించి ప్రతిభను వెలికితీసేలా రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా టోర్నీలు నిర్వహిస్తారు.)
జ: ఆడుదాం ఆంధ్ర 2023 - 24
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Chiru 157: చిరంజీవిని అలా చూపించాలనుకుంటున్నా: దర్శకుడు వశిష్ఠ