ఆ రాజు ఏనుగులకు నిత్యం నూనె స్నానం!

ఇప్పటికీ అందరూ సందర్శించే ఎన్నో దేవాలయాల్లో కనీసం కొన్నయినా చాళుక్యులు కట్టినవే ఉంటాయి. మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన మహాకవి నన్నయ వారి కాలం నాటి వాడే. ఎందరో ప్రసిద్ధ కవులను, రచయితలను ఈ రాజులు ఆదరించారు.

Updated : 07 Jun 2023 04:04 IST

భారతదేశ చరిత్ర

ఇప్పటికీ అందరూ సందర్శించే ఎన్నో దేవాలయాల్లో కనీసం కొన్నయినా చాళుక్యులు కట్టినవే ఉంటాయి. మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన మహాకవి నన్నయ వారి కాలం నాటి వాడే. ఎందరో ప్రసిద్ధ కవులను, రచయితలను ఈ రాజులు ఆదరించారు. వీరి పరిపాలనకు చెందిన పలు పద్ధతులు ఈనాటికీ అమలులో ఉన్నాయి. కళలు, వాస్తుశిల్పం, పాలన, సైనిక వ్యవహారాలకు సంబంధించి చాళుక్య పాలకులు గణనీయ కృషి చేశారు. అద్భుత  కట్టడాలు, సాంస్కృతిక పోషణ, పాలనా సంస్కరణల రూపంలో శాశ్వత వారసత్వాన్ని భారత దేశ చరిత్రకు అందించారు.

చాళుక్యులు

1. పంచారామాలు ఎవరి కాలంలో శైవ క్షేత్రాలు అయ్యాయి?

1) రెండో పులకేశి 2) చాళుక్య భీముడు
3) అమ్మరాజు 4) సత్యాశ్రయుడు

2. తూర్పు చాళుక్యుల ఇష్ట దైవం?

1) మహాసేనుడు 2) విష్ణువు  
3) ఇంద్రుడు     4) సూర్యుడు

3. అయ్యవోలులో జైనాలయాన్ని నిర్మించిన రవికీర్తి ఎవరి ఆస్థానంలో ఉండేవాడు?

1) సోమేశ్వరుడు 2) సత్యాశ్రయుడు
3) రెండో పులకేశి 4) కుబ్జ విష్ణువర్ధనుడు

4. చాళుక్యుల రాజ భాష ఏది?

1) సంస్కృతం 2) పాళి 3) ప్రాకృతం 4) తెలుగు

5. శబ్దావతార అనే సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని రచించినవారు?

1) రవికీర్తి   2) భారవి  
3) దండి   4) గాంగదుర్వినీతుడు

6. నన్నయ ఎవరి ఆస్థాన కవి?

1) చాళుక్య భీముడు      2) మొదటి అమ్మరాజు
3) రాజరాజ నరేంద్రుడు   4) రెండో అమ్మరాజు

7. వ్యాస మహాభారతాన్ని ఆంధ్రీకరించడానికి పూనుకున్నవారు?

1) నన్నయ  2) రన్న  3) పొన్న  4) పంపకవి

8. నన్నయకు మహాభారత రచనలో సహాయం చేసిన నారాయణ భట్టుకు రాజరాజ నరేంద్రుడు ఇచ్చిన కానుక?

1) నందంపూడి అగ్రహారం 2) పెదగాదెల పఱ్ఱు
3) చిన్నరాజుల పఱ్ఱు    
4) నవఖండవాడ అగ్రహారం

9. గణితశాస్త్ర సమస్యలను పద్య రూపంలో రాసిన కవి?

1) నారాయణ భట్టు   2) పావులూరి మల్లన
3) నన్నయ 4) నన్నెచోడుడు

10. గణితసార సంగ్రహాన్ని రచించినవారు?

1) పావులూరి మల్లన 2) నారాయణ భట్టు  
3) మహావీరాచారి   4) తిక్కన

11. ‘కవిపండిత కామధేనువు’ అనే బిరుదు గలవారు?

1) మూడో విష్ణువర్ధనుడు
2) జయసింహ వల్లభుడు
3) సత్యాశ్రయుడు       4) చాళుక్య భీముడు

12. ‘కవిగాయక కల్పతరువు’ అనే బిరుదు గలవారు?

1) మూడో విష్ణువర్ధనుడు 2) కుబ్జ విష్ణువర్ధనుడు  
3) అమ్మరాజు         4) పులకేశి

13. ద్రాక్షారామంలో భీమేశ్వరాలయాన్ని నిర్మించినవారు?

1) చాళుక్య భీముడు     2) అమ్మరాజు  
3) రాజరాజ నరేంద్రుడు 4) సోమేశ్వరుడు

14. చల్లవ్వ ఎవరి ఆస్థాన నర్తకి?

1) సోమేశ్వరుడు 2) అమ్మరాజు
3) చాళుక్య భీముడు 4) రాజరాజు

15. శ్రేణికి మరో పేరు?

1) శ్రేష్టి   2) సంఘం   3) నకరం   4) దేశీ

16. తెలుగు మధ్యాక్కరలతో నిండి ఉన్న బెజవాడ శాసనాన్ని ఎవరు వేయించారు?

1) యుద్ధమల్లుడు      2) భీముడు  
3) సత్యాశ్రయుడు      4) రాజరాజ నరేంద్రుడు

17. కింది పట్టణాల్లో జైన కేంద్రం కానిది?

1) అత్తిలి   2) బెజవాడ  
3) కొల్లిపాక     4) అసనాపురం

18. చాళుక్య భీముడు తన ఆస్థాన నర్తకి చల్లవ్వకు ఏ గ్రామాన్ని దానంగా ఇచ్చాడు?

1) తుని   2) భీమవరం  
3) అసనాపురం   4) అత్తిలి

19. బిరుదాంకప్రోలు (బిక్కవోలు) పట్టణాన్ని ఎవరు నిర్మించారు?

1) గుణగ విజయాదిత్యుడు 2) అమ్మరాజు
3) చాళుక్య భీముడు        
4) రెండో విజయాదిత్యుడు

20. పాండురంగం అనే పట్టణాన్ని ఎవరు నిర్మించారు?

1) అభీరుడు 2) పాండురంగడు
3) భీమరాజు 4) కటిశర్మ

21. వేములవాడ పూర్వనామం ఏది?

1) వేములాడ   2) లేంబుల వాడ  
3) లింబాడల   4) లేములాడ

22. పోదనపురం అంటే?

1) బోధన్‌   2) ఆర్మూర్‌  
3) బోధపురం   4) బోధులాడ

23. కిందివాటిలో వేములవాడ చాళుక్యుల రాజధాని కానిది?

1) బోధన్‌   2) వేములవాడ  
3) గంగాధర   4) పేరూరు

24. వేములవాడ చాళుక్యులు సూర్యవంశజులని తెలిపే సాక్ష్యం?

1) వేములవాడ శాసనం  
2) పర్భిణీ తామ్ర శాసనం
3) కుర్క్యాల శాసనం    4) కురవగట్టు శాసనం

25. నిత్యం తన ఏనుగులకు నూనె స్నానం చేయించిన రాజు ఎవరు?

1) మొదటి అరికేసరి     2) రెండో అరికేసరి
3) వినయాదిత్య యుద్ధమల్లుడు 4) బద్దెగడు

26. ఏలేశ్వర విద్యాపీఠాన్ని ఎవరు నిర్వహించేవారు?

1) వేదాధ్యయుడు     2) సోమదేవసూరి  
3) ముగ్ధ శివాచార్యుడు 4) మల్లికార్జునుడు

27. సోమేశ్వరాలయం ఎక్కడ ఉంది?

1) బోధన్‌   2) వేములవాడ  
3) గంగాధర   4) పేరూరు

28. సోలదగండడు అనే బిరుదు గలవారు?

1) మొదటి బద్దెగడు   2) మొదటి అరికేసరి  
3) యుద్ధమల్లుడు     4) రెండో నరసింహకుడు

29. బద్దెగేశ్వరాలయాన్ని ఎవరు నిర్మించారు?

1) రెండో బద్దెగడు   2) మొదటి బద్దెగడు
3) మొదటి అరికేసరి 4) రెండో అరికేసరి

30. వేములవాడలో ఆదిత్యాలయాన్ని నిర్మించినవారు?

1) సోమదేవసూరి 2) పంప
3) జినవల్లభుడు 4) పెద్దన

31. పర్భిణి శాసనం పేర్కొన్న పాండవ భీముడు ఎవరు?

1) యుద్ధమల్లుడు   2) రెండో బద్దెగడు
3) మొదటి అరికేసరి 4) మొదటి బద్దెగడు

32. ‘శాద్వాదచలసింహ’ బిరుదు గలవారు?

1) పంప   2) జినవల్లభుడు  
3) పెద్దన 4) సోమదేవసూరి

33. పంపకవి తన ప్రభువైన అరికేసరి నుంచి పొందిన అగ్రహారం ఏది?

1) పెంచికల్లు 2) కుర్క్యాల
3) ధర్మపురం (ధర్మపురి) 4) చెన్నూరు

34. వేములవాడ చాళుక్యుల అధికార భాష?

1) తెలుగు 2) కన్నడం 3) సంస్కృతం 4) ప్రాకృతం

35. జనాశ్రయ  గ్రంథ రచయిత ఎవరు?

1) పంప   2) రన్న  
3) పొన్న   4) మల్లియరేచన

36. కుర్క్యాల శాసనాన్ని ఎవరు వేయించారు?

1) మూడో అరికేసరి   2) పెద్దన
3) జినవల్లభుడు       4) నేమినాథుడు

37. శుభధామ జినాలయాన్ని ఎవరి కోసం నిర్మించారు?

1) పంపకవి   2) మల్లియ రేచన  
3) సోమదేవసూరి   4) పొన్నకవి

38. గ్రన్తి అంటే?

1) నీటి నిల్వల అధికారి  2) భూమి శిస్తు అధికారి
3) న్యాయ నిర్వాహకుడు  4) వర్తక సుంకాధికారి

39. ‘ఉంచాలి’ అంటే?

1) పన్నులు లేని భూమి   2) సాగుభూమి  
3) సేవకురాలు   4) బానిస స్త్రీ

40. వేములవాడ చాళుక్యుల కాలం నాటి ఏ శాసనాన్ని మూడు భాషల్లో వేయించారు?

1) కురవగట్టు శాసనం  2) పర్భిణీ తామ్ర శాసనం
3) కొల్లిపర తామ్ర శాసనం  4) కుర్క్యాల శాసనం

41. ఏ శాసనంలో తెలుగులో మొదటి కంద పద్యాలున్నాయి?

1) కురవగట్టు శాసనం   2) రామడుగు శాసనం
3) కుర్క్యాల శాసనం   4) ఏలేశ్వరం శాసనం

42. కిందివాటిలో సోమదేవసూరి బిరుదు కానిది?

1) కవితాగుణార్ణవ   2) శాద్వాదచలసింహ
3) తార్కిక చక్రవర్తి   4) కవిరాజ

43. కిందివారిలో కన్నడ కవిత్రయంలో లేనివారు?

1) పంప   2) పొన్న   3) రేచన   4) రన్న

44. కిందివాటిలో తెలుగు భాషకు సంబంధించి సరికానిది?

1) అరసున్నా వాడుకలో లేదు.
2) ద్విత్వాక్షరాలు ఉపయోగించారు.
3) పూర్ణానుస్వారమే వాడారు.
4) చంపకమాల కవిత్వం వెలుగులోకి వచ్చింది.

45. వేములవాడ చాళుక్యులో చివరి పాలకుడు ఎవరు?

1) నాగరాజు     2) రెండో బద్దెగడు  
3) కర్కరాజు       4) మూడో అరికేసరి

46. కిందివాటిలో సోమదేవసూరి రచించని గ్రంథం?

1) యశస్తిలక      2) ఆది పురాణం    
3) నీతివాక్యామృత   4) యుక్తిచింతామణి సూత్ర

47. మూడో అరికేసరి శుభధామ జినాలయానికి ‘వనికటువలు’ గ్రామాన్ని దానంగా ఇస్తూ వేసిన శాసనం?

1) కరీంనగర్‌ శాసనం  2) వేములవాడ శాసనం

3) రేపాక శాసనం    4) పర్భిణీ తామ్ర శాసనం

48. తన ఖడ్గాన్ని యమునా నది తీరంలో ఉన్న కాళప్రియం (నేటి కాల్పి) వద్ద కడిగిన వేములవాడ పాలకుడు ఎవరు?

1) మొదటి బద్దెగడు   2) రెండో బద్దెగడు
3) రెండో నరసింహకుడు   4) మొదటి అరికేసరి

49. తూర్పు చాళుక్య రాజ్య స్థాపకుడు?

1) జయసింహ వల్లభుడు   2) విజయాలయుడు  
3) కుబ్జ విష్ణువర్ధనుడు   4) తూర్పు చాళుక్యుడు

50. తూర్పు చాళుక్యుల రాజధాని ఏది?

1) వేంగి  2) బాదామి  3) వాతాపి  4) కళ్యాణి

51. ‘తూర్పు చాళుక్యులు మధ్య ఆసియా ప్రాంతానికి చెందినవారు’ అని ఎవరు అన్నారు?

1) చెలికి రెమ్మణక   2) నేలటూరి  
3) లూయీరైస్‌   4) కాల్డెవెల్‌

52. తూర్పు చాళుక్యులు ఇక్ష్వాకుల సామంతులు అని పేర్కొంటున్న శాసనం?

1) తిమ్మాపురం   2) నాగార్జున కొండ  
3) విప్పర్ల   4) యలమంచిలి

53. విషమసిది బిరుదాంకితుడైన తూర్పు చాళుక్య రాజు?

1) కుబ్జ విష్ణువర్ధనుడు  
2) మొదటి జయసింహ వల్లభుడు  
3) గుణగ విజయాదిత్యుడు
4) ఎవరూ కాదు


సమాధానాలు
1-2; 2-1; 3-3; 4-1; 5-4; 6-3; 7-1; 8-1; 9-2; 10-1; 11-1; 12-3; 13-1; 14-3; 15-3; 16-1; 17-4; 18-4; 19-1; 20-2; 21-2; 22-1; 23-4; 24-2; 25-3; 26-3; 27-4; 28-1; 29-2; 30-4; 31-3; 32-4;  33-3; 34-2; 35-4; 36-3; 37-3; 38-1; 39-1; 40-4; 41-3; 42-1; 43-3; 44-4; 45-4; 46-2; 47-4; 48-3; 49-3; 50-1; 51-3; 52-2; 53-1.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని