ఎల్లప్పుడూ.. ఉల్లాసంగా!
కొంతమంది విద్యార్థులను చూస్తే భలే ముచ్చటేస్తుంది. వాళ్లు ఎప్పుడు చూసినా ఉప్పొంగే ఉత్సాహంతో కనిపిస్తుంటారు.
కొంతమంది విద్యార్థులను చూస్తే భలే ముచ్చటేస్తుంది. వాళ్లు ఎప్పుడు చూసినా ఉప్పొంగే ఉత్సాహంతో కనిపిస్తుంటారు. ఉదయం కాలేజీకి వచ్చినప్పుడు ఉన్న ఉత్సాహం సాయంత్రం వరకూ కొనసాగుతుంది. చదువే కాకుండా ఆటపాటలూ, ఇతర వ్యాపకాల్లోనూ ముందుంటారు. మరికొందరు దీనికి పూర్తి విరుద్ధంగా.. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టుగా కనిపిస్తుంటారు. మరి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే...
* ఉత్సాహంగా ఉండలేకపోవడానికి అసలు కారణం వర్తమానంలో ఉండకపోవడమే అంటారు నిపుణులు. చాలామంది గతంలోని వైఫల్యాల గురించే ఈరోజుకీ ఆలోచిస్తూ విచారంగా ఉండిపోతారు. లేదా భవిష్యత్తులో చేయబోయే పనుల గురించి ఆలోచిస్తూ ఒత్తిడికి గురవుతుంటారు. దాంతో ఎక్కడలేని నీరసం ఆవరిస్తుంది. ఉత్సాహంగా ఉండాలంటే.. నిన్నా, రేపటి గురించి ఆలోచించడం మానేసి ఈరోజు.. ఇప్పుడు చేస్తున పని మీదే దృష్టిని కేంద్రీకరించాలి. అలాగే ఎప్పుడూ పనిలో మునిగిపోవడమే కాకుండా ఎంతో అందమైన, ఆహ్లాదకరమైన ప్రకృతినీ మధ్యలో గమనిస్తుండాలి. నీలాకాశం, పచ్చని చెట్లు, పక్షుల కువకువలు..ఇవన్నీ మీలో సహజమైన ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ప్రకృతికి దగ్గరగా ఉండేవాళ్లు ఉల్లాసంగా ఉండగలుగుతారంటారు పెద్దలు. మీరూ ప్రయత్నించి చూడటంతో తప్పులేదుగా.
* ప్రతికూల ఆలోచనల వల్ల ఒత్తిడి పెరిగిపోతుంది. పరీక్షలో మంచి ర్యాంకు రాదేమో.. అనుకున్న కాలేజీలో సీటు దక్కదేమో.. ఇలా.. కాదు, రాదు అనే ప్రతికూల ఆలోచనలుచేయడం వల్ల ఒత్తిడి పెరిగి.. ఉత్సాహం ఆవిరైపోతుంది. ధ్యానం, శ్వాస సంబంధ వ్యాయామాలతో ఈ ఒత్తిడిని నియంత్రించవచ్చు. ప్రతి విషయాన్నీ ప్రతికూలంగా కాకుండా సానుకూలంగా ఆలోచించడం వల్ల ఉత్సాహంగా ఉండగలుగుతాం.
* భారీ లక్ష్యాలను పెట్టుకుంటాం. వాటిని అందుకోలేనప్పుడు నిరాశకు గురవుతుంటాం. మన అంచనాలు వాస్తవానికి దగ్గరగా ఉంటే నిరాశపడాల్సిన అవసరం ఉండదు.
* ఉత్సాహంగా ఉండలేకపోవడానికి అసూయ కూడా కారణం అవుతుంది. ఒక్కోసారి సహ విద్యార్థులకు మంచి ర్యాంకులు రావడం కూడా మీ విచారానికి కారణం అవుతుంటుంది. అలాంటప్పుడు పోల్చుకుని బాధపడకుండా ఉండటానికి ప్రయత్నించాలి. మీ శక్తిసామర్థ్యాలు ఏమిటో మీకు బాగా తెలుసు కదా. మీరు ఏయే సబ్జెక్టుల్లో వెనకబడి ఉన్నారో తెలుసుకుని.. ఆయా అంశాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. అందుకోసం తెలివైన విద్యార్థుల సహాయం కూడా తీసుకోవచ్చు. పోల్చుకుని బాధపడటం వల్ల విచారం రెట్టింపు అవుతుంది అని తెలుసుకోవాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్
-
Asian Games: భారత్కు మరో రెండు పతకాలు.. ఫైనల్కు కిదాంబి శ్రీకాంత్
-
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Social Look: సమంత సైకిల్ రైడ్.. దేవకన్యలా ప్రియాంక.. రెడ్ డ్రెస్లో అనన్య