కరెంట్‌ అఫైర్స్‌

ఉత్తరాఖండ్‌లోని హిమాలయ ప్రాంతం ఉత్తర కాశీలో అధునాతనమైన మౌంటెనీరింగ్‌ కోర్సు పూర్తి చేసిన తొలి మహిళా ఎన్‌సీసీ క్యాడెట్‌గా ఎవరు చరిత్ర సృష్టించారు? 

Published : 08 Jun 2023 01:31 IST

మాదిరి ప్రశ్నలు

* ఉత్తరాఖండ్‌లోని హిమాలయ ప్రాంతం ఉత్తర కాశీలో అధునాతనమైన మౌంటెనీరింగ్‌ కోర్సు పూర్తి చేసిన తొలి మహిళా ఎన్‌సీసీ క్యాడెట్‌గా ఎవరు చరిత్ర సృష్టించారు? 
జ:
శాలినీ సింగ్‌, లఖ్‌నవూ

* అల్‌-మొహెద్‌ అల్‌-హిందీ నౌకాదళ విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి?
జ:
భారత్‌, సౌదీ అరేబియా

* ప్రస్తుతం కామన్వెల్త్‌ కూటమిలోని దేశాల సంఖ్య ఎంత? (మే 24 ను కామన్వెల్త్‌ డే గా నిర్వహిస్తారు.)
జ:
56

* అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
జ:
మే 22

* ప్రముఖ అంతర్జాతీయ ఆర్థికవేత్త స్టీవ్‌ హాంకే వార్షిక దయనీయ సూచీ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత దయనీయ దేశం ఏది?
జ:
జింబాబ్వే

* ఇటీవల ప్రవేశపెట్టిన ‘కేరళ పురస్కారంగళ్‌’లో భాగంగా కేరళ అత్యున్నత పౌర పురస్కారం ‘కేరళ జ్యోతి’ని ఎవరికి ప్రదానం చేశారు?
జ:
ఎం.టి.వసుదేవ్‌ నాయర్‌

* ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశంలో ‘హెచ్‌3ఎన్‌8 బర్డ్‌ ఫ్లూ’ వ్యాధి మరణం సంభవించింది?
జ:
చైనా

* ట్విటర్‌లో అత్యధికులు అనుసరించే వ్యక్తిగా ఇటీవల ఎవరు వార్తల్లో నిలిచారు?        
జ:
ఎలన్‌ మస్క్‌

* ‘ముఖ్యమంత్రి సీఖో కమావో యోజన’ను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
జ:
మధ్యప్రదేశ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని