అత్యున్నత సభకే అవశిష్ట అధికారాలు!
ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే ప్రజాస్వామ్యం, సంక్షేమపాలన, వ్యక్తిగత హక్కుల భద్రత వంటి విశిష్ట లక్షణాలతో భారత రాజ్యాంగాన్ని రూపొందించారు.
ఇండియన్ పాలిటీ
ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే ప్రజాస్వామ్యం, సంక్షేమపాలన, వ్యక్తిగత హక్కుల భద్రత వంటి విశిష్ట లక్షణాలతో భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇందులో ప్రవేశిక మొదలు వివిధ ప్రభుత్వ సంస్థలు, విధానాల గురించి వివరించారు. పరిమాణంలో అతి పెద్దది. కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార వికేంద్రీకరణను స్పష్టంగా పేర్కొంటోంది. ఇంకా స్వేచ్ఛను, రక్షణను ప్రసాదించే ప్రాథమిక హక్కులు, సంక్షేమ పాలనకు మూలమైన ఆదేశిక సూత్రాలు, చట్టబద్ధ పాలన సమున్నతంగా సాగే విధంగా చూసే స్వతంత్ర న్యాయవ్యవస్థ తదితర ప్రత్యేకతలన్నీ ఈ అత్యున్నత అధికార పత్రానికి ఉన్నాయి. ఇండియన్ పాలిటీ అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు ఆ వివరాలను ఆర్టికల్స్‌తో సహా తెలుసుకోవాలి.
భారత రాజ్యాంగం - విశిష్ట లక్షణాలు
1. ఉమ్మడి జాబితాలోని అంశాలకు సంబంధించి సరికానిది?
1) దస్తావేజులు, డాక్యుమెంట్లపై స్టాంపు డ్యూటీ
2) వివాహం, విడాకులు, క్రిమినల్ చట్టాలు
3) ధార్మిక సంఘాలు, ధర్మకర్తలు, తూనికలు, కొలతలు
4) విద్య, కర్మాగారాలు, విద్యుచ్ఛక్తి
2. కింది అంశాల్లో సరైన దాన్ని గుర్తించండి.
1) కేంద్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనాలను రూపొందించగలదు.
2) రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనసభ శాసనాలను రూపొందించగలదు.
3) ఉమ్మడి జాబితాలోని అంశాలపై పార్లమెంటు, శాసనసభలు శాసనాలు రూపొందించగలవు.
4) పైవన్నీ
3. రాజ్యాంగంలోని ఆర్టికల్ 248 ప్రకారం అవశిష్టాంశాలపై (Residuary powers) శాసనాలు రూపొందించే అధికారం ఎవరికి ఉంటుంది?
1) పార్లమెంటు 2) శాసనసభ
3) గ్రామసభ 4) న్యాయ వ్యవస్థ
4. మన దేశంలో ఒక అంశం అవశిష్టాంశమా, కాదా అని ఎవరు ధ్రువీకరిస్తారు?
1) రాష్ట్ట్ర్రపతి 2) కేంద్ర మంత్రిమండలి
3) సుప్రీంకోర్టు 4) లోక్‌సభ స్పీకర్
5. కిందివాటిలో అవశిష్టాంశం కానిది?
1) అంతరిక్ష ప్రయోగాలు
2) పురావస్తు ప్రదేశాలు, చిహ్నాలు
3) సంపదపై పన్ను
4) బహుమతులపై పన్ను
6. కింద పేర్కొన్న అంశాల్లో సరైంది?
1) రాజ్యాంగం గుర్తించిన భాషలను 8వ షెడ్యూల్‌లో పేర్కొన్నారు.
2) రాజ్యాంగం ప్రారంభంలో గుర్తించిన భాషల సంఖ్య 14.
3) ప్రస్తుతం రాజ్యాంగంలో గుర్తించిన భాషల సంఖ్య 22.
4) పైవన్నీ
7. 1950, జనవరి 26న రాజ్యాంగంలో గుర్తించిన భాషల్లో లేనివి?
1) తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం
2) హిందీ, ఉర్దూ, సంస్కృతం, అస్సామీ
3) త్రిపురి, కొంకణి, నాగా
4) బెంగాలీ, గుజరాతీ, పంజాబీ, కశ్మీరీ, ఒడియా, మరాఠీ
8. ఇందిరా గాంధీ ప్రభుత్వ కాలంలో 15వ భాషగా ‘సింధీ భాష’ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా గుర్తించారు?
1) 21వ రాజ్యాంగ సవరణ చట్టం, 1967
2) 22వ రాజ్యాంగ సవరణ చట్టం, 1968
3) 23వ రాజ్యాంగ సవరణ చట్టం, 1968
4) 24వ రాజ్యాంగ సవరణ చట్టం, 1971
9. పి.వి.నరసింహారావు ప్రభుత్వ కాలంలో 71వ రాజ్యాంగ సవరణ చట్టం - 1992 ద్వారా రాజ్యాంగం గుర్తించిన భాషల్లో లేనిది?
1) కొంకణి 2) మిజో
3) మణిపురి 4) నేపాలి
10. అటల్‌బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వ కాలంలో 92వ రాజ్యాంగ సవరణ చట్టం - 2003 ద్వారా రాజ్యాంగం గుర్తించిన భాషల్లో లేనిది?
1) బిహారి 2) బోడో, డోగ్రి
3) మైథిలి 4) సంతాలి
11. జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ కాలంలో రాజ్యాంగానికి 9వ షెడ్యూల్‌ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?
1) ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం, 1951
2) రెండో రాజ్యాంగ సవరణ చట్టం, 1952
3) మూడో రాజ్యాంగ సవరణ చట్టం, 1954
4) నాలుగో రాజ్యాంగ సవరణ చట్టం, 1955
12. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌కు సంబంధించి సరికానిది?
1) దీనిలో భూ సంస్కరణల అమలు, జమిందారీ విధానం రద్దు గురించి పేర్కొన్నారు.
2) ఈ షెడ్యూల్‌లోని అంశాలపై న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం లేకుండా చేశారు.
3) ఈ షెడ్యూల్‌లో ప్రస్తుతం 284 అంశాలు ఉన్నాయి.
4) ఈ షెడ్యూల్ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది.
13. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారికి 69% రిజర్వేషన్‌లు కల్పిస్తూ చేసిన చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?
1) 75వ రాజ్యాంగ సవరణ చట్టం, 1994
2) 76వ రాజ్యాంగ సవరణ చట్టం, 1995
3) 77వ రాజ్యాంగ సవరణ చట్టం, 1996
4) 78వ రాజ్యాంగ సవరణ చట్టం, 1997
14. 1973, ఏప్రిల్ 24 తర్వాత 9వ షెడ్యూల్‌లో చేర్చిన అంశాలు న్యాయ సమీక్ష (Judicial Review) పరిధిలోకి వస్తాయని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పు వెలువరించింది?
1) కేశవానంద భారతి Vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు, 1973
2) మినర్వామిల్స్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, 1980
3) ఐ.ఆర్.కొల్హాయ్ Vs స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు, 2007
4) మేనకా గాంధీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, 1978
15. 9వ షెడ్యూల్‌లోని అంశానికి సంబంధించి సరైంది?
1) రాజస్థాన్ కౌలుదారీ సవరణ చట్టం - 1987
2) తమిళనాడు భూసంస్కరణల భూగరిష్ఠ పరిమితి చట్టం - 1979
3) పశ్చిమ బెంగాల్ భూకమతాల రెవెన్యూ సవరణ చట్టం - 1982
4) పైవన్నీ
16. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ‘ఒరియా’ అనే పదాన్ని ‘ఒడియా’గా మార్పు చేశారు?
1) 95వ రాజ్యాంగ సవరణ చట్టం, 2009
2) 96వ రాజ్యాంగ సవరణ చట్టం, 2011
3) 97వ రాజ్యాంగ సవరణ చట్టం, 2011
4) 98వ రాజ్యాంగ సవరణ చట్టం, 2012
17. రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి 10వ షెడ్యూల్‌ను చేర్చారు?
1) 52వ రాజ్యాంగ సవరణ చట్టం, 1985
2) 53వ రాజ్యాంగ సవరణ చట్టం, 1986
3) 54వ రాజ్యాంగ సవరణ చట్టం, 1986
4) 55వ రాజ్యాంగ సవరణ చట్టం, 1987
18. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో ఏ అంశాన్ని పేర్కొన్నారు?
1) సహకార సంఘాలకు రాజ్యాంగ భద్రతను కల్పించడం
2) పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం
3) రాజభరణాల రద్దు సవరణ చట్టాలు
4) భారత్, పాకిస్థాన్‌ల మధ్య భూ బదిలీ విధానాలు
19. 10వ షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాలకు సంబంధించి సరికానిది?
1) పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన చట్ట సభల సభ్యుల అనర్హతలు
2) జాతీయ స్థాయిలో సభ అంటే లోక్‌సభ లేదా రాజ్యసభ
3) రాష్ట్రస్థాయిలో సభ అంటే శాసన సభ లేదా విధానమండలి అని అర్థం
4) గ్రామస్థాయిలో సభ అంటే గ్రామసభ అని అర్థం
20. ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం’ ప్రకారం చట్ట సభల సభ్యుల అనర్హతలను ప్రకటించే వారికి సంబంధించి సరికానిది?
1) లోక్‌సభ సభ్యుల అనర్హతలు - లోక్‌సభ స్పీకర్
2) రాజ్యసభ సభ్యుల అనర్హతలు - రాజ్యసభ ఛైర్మన్
3) శాసన మండలి సభ్యుల అనర్హతలు - విధాన సభ స్పీకర్
4) శాసనసభ సభ్యుల అనర్హతలు - శాసనసభ స్పీకర్
21. రాష్ట్ట్ర్రపతి ద్వారా పార్లమెంటుకు నామినేట్ అయిన సభ్యుడు ఆర్టికల్ 99 ప్రకారం చట్ట సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎన్ని నెలల తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే అతడు తన పదవిని కోల్పోతాడు?
1) 6 2) 7 3) 9 4) 12
22. మన దేశంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 1985, ఫిబ్రవరి 1 2) 1985, మార్చి 1
3) 1985, ఏప్రిల్ 1 4) 1985, మే 1
23. పి.వి.నరసింహారావు ప్రభుత్వ కాలంలో రాజ్యాంగానికి 11వ షెడ్యూల్‌ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?
1) 70వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992
2) 71వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992
3) 72వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992
4) 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992
24. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లో పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేయాల్సిన ఎన్ని రకాల అధికార, విధులను నిర్దేశించారు?
1) 21 2) 29 3) 32 4) 41
25. పి.వి.నరసింహారావు ప్రభుత్వ కాలంలో రాజ్యాంగానికి 12వ షెడ్యూల్‌ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?
1) 74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992
2) 75వ రాజ్యాంగ సవరణ చట్టం, 1993
3) 76వ రాజ్యాంగ సవరణ చట్టం, 1994
4) 77వ రాజ్యాంగ సవరణ చట్టం, 1995
26. రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్‌లో పట్టణ, నగర పాలక సంస్థలకు బదిలీ చేయాల్సిన ఎన్ని రకాల అధికార విధులను నిర్దేశించారు?
1) 18 2) 22 3) 27 4) 33
27. రాజ్యాంగంలోని ఖివ భాగంలో భారతదేశ భూభాగ పరిధి గురించి ఏ ఆర్టికల్స్‌లో వివరించారు?
1) ఆర్టికల్స్ 1 - 4 2) ఆర్టికల్స్ 1 - 3
3) ఆర్టికల్స్ 1 - 5 4) ఆర్టికల్స్ 1 - 6
28. రాజ్యాంగంలోని ఖిఖివ భాగంలో ఆర్టికల్స్ 5 నుంచి 11 మధ్య ఏ అంశాన్ని వివరించారు?
1) రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ
2) పౌరసత్వం
3) రాష్ట్రాల పేర్లు - సరిహద్దులు
4) కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు - సరిహద్దులు
29. రాజ్యాంగంలోని ఖిఖిఖివ భాగంలో ప్రాథమిక హక్కుల వివరణ గురించి ఏ ఆర్టికల్స్ మధ్య పేర్కొన్నారు?
1) ఆర్టికల్స్ 12 - 35
2) ఆర్టికల్స్ 13 - 35
3) ఆర్టికల్స్ 14 - 35
4) ఆర్టికల్స్ 14 - 36
30. రాజ్యాంగంలోని ఖిజువ భాగంలో ఆర్టికల్స్ 36 నుంచి 51 మధ్య వేటి గురించి వివరించారు?
1) పార్ట్ - బి రాష్ట్రాలు
2) ప్రాథమిక విధులు
3) ఆదేశిక సూత్రాలు/నిర్దేశిక నియమాలు
4) రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ
31. రాజ్యాంగానికి ఖిజు - తి భాగాన్ని ఇందిరా గాంధీ ప్రభుత్వ కాలంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?
1) 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976
2) 41వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976
3) 40వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975
4) 39వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975
సమాధానాలు
1-1; 2-4; 3-1; 4-3; 5-2; 6-4; 7-3; 8-1; 9-2; 10-1; 11-1; 12-4; 13-2; 14-3; 15-4; 16-2; 17-1; 18-2; 19-4; 20-3; 21-1; 22-2; 23-4; 24-2; 25-1; 26-1; 27-1; 28-2; 29-1; 30-3; 31-1.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: భారత్‌కు మరో రెండు పతకాలు.. ఫైనల్‌కు కిదాంబి శ్రీకాంత్
-
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Social Look: సమంత సైకిల్ రైడ్.. దేవకన్యలా ప్రియాంక.. రెడ్ డ్రెస్‌లో అనన్య
-
ISRO: భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసి..! ‘ఆదిత్య ఎల్1’పై ఇస్రో కీలక అప్డేట్
-
Hyderabad: మర్రిగూడ తహసీల్దార్ అరెస్ట్.. అక్రమాస్తులు రూ.4.75 కోట్లు