ఆ రెండు రాష్ట్రాల మధ్య సంకోష్!
నాగరికత పుట్టుక, ప్రజల అభివృద్ధికి నదులు, నదీ తీరాలే కేంద్రాలు. భారతదేశంలో ప్రజల ప్రగతిలో, జీవనోపాధి కల్పనలో వాటిది కీలకపాత్ర.
ఇండియన్ జాగ్రఫీ
నాగరికత పుట్టుక, ప్రజల అభివృద్ధికి నదులు, నదీ తీరాలే కేంద్రాలు. భారతదేశంలో ప్రజల ప్రగతిలో, జీవనోపాధి కల్పనలో వాటిది కీలకపాత్ర. తాగునీరు, నీటిపారుదల, జల విద్యుత్తు వంటి వాటికి అవే కీలక ఆధారాలు. ప్రధానంగా హిమాలయ, ద్వీపకల్ప నదీ వ్యవస్థలు ఉన్న మన దేశంలో ముఖ్యమైన నదులు, ప్రవహించే రాష్ట్రాలు, ప్రవాహ మార్గాలు, వాటిపై నిర్మించిన ప్రాజెక్టులు, ప్రయోజనాలను పంచుకుంటున్న రాష్ట్రాలు, వివాదాలు, సంబంధిత వివరాలను పరీక్షార్థులు తెలుసుకోవాలి.
నదీవ్యవస్థ - హైడల్ ప్రాజెక్టులు
1. కింది ఏ నదికి అత్యధిక రాష్ట్రాల పరీవాహక ప్రాంతం ఉంది?
1) మహానది 2) గోదావరి 3) కృష్ణా 4) కావేరి
2. కిందివాటిని జతపరచండి.
నదులు జలపాతాలు
1) తమిర భరణి ఎ) చిత్రకూట్
2) మాచ్‌కండ్ బి) కుంటాల
3) కడెం సి) డుడుమా
4) ఇంద్రావతి డి) భానతీర్థం
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
3. కిందివాటిలో గంగానది ఉపనది కానిది?
1) కోసి 2) చంబల్ 3) గండక్ 4) గోమతి
4. చంబల్ నది దక్షిణం నుంచి ఉత్తరానికి ఏ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తోంది?
1) మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్
2) మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్
3) మధ్యప్రదేశ్, పంజాబ్, హరియాణా
4) మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్
5. కిందివాటిని పరిగణించండి.
1) వైగై నది కార్డమమ్ కొండల్లో జన్మించి తమిళనాడు మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంది.
2) తూర్పు వైపునకు ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నదుల్లో వైగై నది అత్యంత దక్షిణాన ఉంది.
3) 1, 2 సరైనవి. 4) 2 మాత్రమే సరైంది.
6. ద్వీపకల్ప ప్రాంతంలో పశ్చిమానికి ప్రవహించే విదీర్ణ ధరి నదులు?
1) కావేరి, నేత్రావతి 2) మండావి, వైగై
3) నర్మద, తపతి 4) నర్మద, సోన్
7. తమిళనాడులో అగస్తయర్ జలపాతం ఎక్కడ ఉంది?
1) పాపనాశం 2) కుమార కోవిల్
3) కలక్కడ్ 4) కుట్రాలమ్
8. కిందివాటిలో హిమాచల్ ప్రదేశ్ మీదుగా ప్రవహించని నది?
1) బియాస్ 2) జీలం 3) రావి 4) సట్లెజ్
9. హిమాలయ నదులు జీవ నదులుగా
ప్రవహించడానికి కారణం?
1) నైరుతి రుతుపవన వర్షపాతం పొందడం
2) ఈశాన్య రుతుపవన వర్షపాతం పొందడం
3) మంచు కరగడం వల్ల నిరంతరంగా
ప్రవహించడం
4) సంవత్సరం పొడవునా వర్షపాతం పొందడం
10. కిందివాటిలో సరైన జతను గుర్తించండి.
1) విజయవాడ - కృష్ణానది
2) కోల్‌కతా - గంగానది
3) కటక్ - బ్రహ్మణి నది
4) అలంపుర్ - భీమా నది
11. బ్రహ్మపుత్ర ఉపనది అయిన ‘సంకోష్’ ఏ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దుగా ఉంది?
1) అస్సాం, అరుణాచల్ ప్రదేశ్
2) అస్సాం, పశ్చిమ బెంగాల్
3) అస్సాం, మేఘాలయ
4) సిక్కిం, పశ్చిమ బెంగాల్
12. కిందివాటిని పరిగణించండి.
1) లూనీ నది ఆరావళి శ్రేణుల్లో పుష్కర్ లోయ వద్ద జన్మిస్తుంది.
2) లూనీ నది థార్ ఎడారి ద్వారా ప్రవహించి రాణ్ ఆఫ్ కచ్ వద్ద అంతరిస్తుంది.
3) హంపి చారిత్రక ప్రాంతం తుంగభద్ర నదీ తీరంలో ఉంది.
4) పైవన్నీ సరైనవి.
13. కిందివాటిలో ఏ ప్రాంతం గంగానది తీరంలో లేదు?
1) ఉత్తర కాశీ 2) కాన్పుర్
3) ఫతేపుర్ 4) భగల్‌పుర్
14. మైకాల పీఠభూమి/కొండల్లో అమర కంటక్ వద్ద జన్మించిన నదులు?
1) నర్మదా నది 2) సోన్ నది
3) 1, 2 4) 1 మాత్రమే
15. కిందివాటిలో గంగానది ఏ రాష్ట్రంలో ప్రవహించదు?
1) ఉత్తరాఖండ్ 2) హిమాచల్ ప్రదేశ్
3) ఉత్తర్‌ప్రదేశ్ 4) పశ్చిమ బెంగాల్
16. కిందివాటిని పరిగణించి, సరైన వాటిని సూచించండి.
1) మూసి, డిండి, మున్నేరు నదులు తెలంగాణ నుంచి ప్రవహించే కృష్ణా నది ఉపనదులు.
2) జంఝావతి, వేగావతి నదులు నాగావళికి
ఉపనదులు.
3) 1, 2 సరైనవి. 4) 2 మాత్రమే సరైంది.
17. ద్వీపకల్ప భారత్‌లో తూర్పు వైపునకు ప్రవహించే నదులను ఉత్తరం నుంచి దక్షిణానికి వరుస
క్రమంలో అమర్చండి.
1) గోదావరి 2) మహానది 3) కృష్ణా
4) సుబర్ణరేఖ 5) పెన్నా 6) కావేరి
1) 4, 1, 3, 6, 5, 2
2) 4, 2, 1, 3, 5, 6
3) 1, 2, 3, 4, 5, 6
4) 6, 5, 4, 3, 2, 1
18. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అంతర్రాష్ట్ర నదులున్నాయి?
1) 40 2) 20 3) 15 4) 30
19. తెలివాహన, ఇండియన్ రైన్ అని ఏ నదికి పేరు?
1) ప్రాణహిత 2) వార్ధా
3) గోదావరి 4) కృష్ణా
20. కిందివాటిని జతపరచండి.
నదులు ఉపనదులు
1) గోదావరి ఎ) గండక్, ఘాగ్రా
2) పెన్నా బి) లోహిత్, మానస
3) బ్రహ్మపుత్ర సి) పాపాఘ్ని, చిత్రావతి
4) గంగానది డి) మంజీర, ప్రాణహిత
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
3) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
21. కిందివాటిలో ఆంధ్రప్రదేశ్‌ను రెండుసార్లు ఖండిస్తూ ప్రవహించే నది?
1) కృష్ణా 2) తుంగభద్ర
3) పెన్నా 4) నాగావళి
22. కిందివాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి.
1) భారతదేశంలో అత్యంత పొడవైన నది - గంగా
2) ప్రపంచంలో అత్యంత పొడవైన నది - నైలు
3) ద్వీపకల్ప భారత్‌లో అత్యంత పొడవైన నది - గోదావరి
4) ఆంధ్రప్రదేశ్‌లో పొడవైన నది - గోదావరి
23. 2018 నేషనల్ రిజిస్టర్ ఆఫ్ లార్జ్ డ్యామ్స్ నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధిక సంఖ్యలో డ్యామ్‌లు ఉన్న రాష్ట్రం?
1) మహారాష్ట్ర 2) మధ్యప్రదేశ్
3) గుజరాత్ 4) చత్తీస్‌గఢ్
24. కిందివాటిని జతపరచండి.
నీటి వనరులు శాతం
1) బావులు ఎ) 56 శాతం
2) కాలువలు బి) 32 శాతం
3) చెరువులు సి) 6 శాతం
4) ఇతరాలు డి) 6 శాతం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
25. కిందివాటిలో సరైంది?
ఎ) తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో చెరువుల నీటిపారుదల వినియోగం అత్యధికం.
బి) కాలువల నీటిపారుదల వినియోగం అత్యధికంగా జమ్ముకశ్మీర్, అస్సాం రాష్ట్రాల్లో ఉంది.
సి) బావుల నీటిపారుదల వినియోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్.
డి) ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధిక సంఖ్యలో గొట్టపు బావులు ఉన్నాయి.
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి 4) డి మాత్రమే
26. కిందివాటిని జతపరచండి.
కాలువ నది
1) సర్‌హింద్ ఎ) ఎల్‌వాందీ (మహారాష్ట్ర)
2) నీరా బి) సట్లెజ్ (హిమాచల్ ప్రదేశ్)
3) దంతివాడ సి) బానస్ (గుజరాత్)
4) కాకతీయ డి) గోదావరి (తెలంగాణ)
1) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
2) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
27. దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని ఏ నదిపై నిర్మించారు?
1) కిన్నెరసాని 2) మానేరు
3) ప్రాణహిత 4) గోదావరి
28. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.
1) పిచ్చునా కాలువ - బానస్ నది (రాజస్థాన్)
2) గాజులదిన్నె - హంద్రీ నది (ఆంధ్రప్రదేశ్)
3) ఉస్మాన్‌సాగర్ - మూసీ నది (తెలంగాణ)
4) మెట్టూరు - కావేరి నది (కర్ణాటక)
29. కిందివాటిని జతపరచండి.
వివాదాస్పద ప్రాజెక్టులు ప్రాంతాలు/దేశాలు
1) బాగ్లీహార్ ఎ) కర్ణాటక, ఆంధ్రప్రదేశ్
2) ముళ్లపెరియార్ బి) మహారాష్ట్ర, తెలంగాణ
3) బాబ్లీ సి) కేరళ, తమిళనాడు
4) తుంగభద్ర డి) భారత్, పాకిస్థాన్
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
4) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
30. కిందివాటిలో ‘త్రిడామ్’ ప్రాజెక్టు పరిధిలో లేని నది?
1) బియాస్ 2) రావి 3) సట్లెజ్ 4) చీనాబ్
31. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.
హైడ్రో ప్రాజెక్టు రాష్ట్రం
i) రంగిత్ సిక్కిం
ii) సింగోలి ఉత్తరాఖండ్
iii) షాంగ్‌తాంగ్ హిమాచల్ ప్రదేశ్
iv) కమెంగ్ అరుణాచల్ ప్రదేశ్
v)తపోవన్ విష్ణుగఢ్ జమ్ముకశ్మీర్
vi) కిషన్ గంగా ఉత్తరాఖండ్
vii) జీడిపల్లి-గొల్లపల్లి ఆంధ్రప్రదేశ్
1) i, iv 2)vi,vii
3) v,vi 4) ii, iii, vii
32. కిందివాటిని జతపరచండి.
ప్రాజెక్టు నది
1) గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ ఎ) నాగావళి
2) తోటపల్లి బ్యారేజ్ బి) పెన్నానది
3) తాటిపూడి రిజర్వాయర్ సి) తుంగభద్ర
4) రాజోలిబండ డి) గొస్తానీ
ఇ) పాపాఘ్ని
1) 1-ఇ, 2-ఎ, 3-డి, 4-బి
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
4) 1-బి, 2-ఇ, 3-సి, 4-ఎ
సమాధానాలు
1-2; 2-1; 3-2; 4-1; 5-3; 6-3; 7-1; 8-2; 9-3; 10-1; 11-1; 12-4; 13-3; 14-3; 15-2; 16-3; 17-2; 18-3; 19-3; 20-1; 21-2; 22-4; 23-1; 24-1; 25-1; 26-4; 27-4; 28-4; 29-1; 30-4; 31-3; 32-2.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Social Look: సమంత సైకిల్ రైడ్.. దేవకన్యలా ప్రియాంక.. రెడ్ డ్రెస్‌లో అనన్య
-
ISRO: భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసి..! ‘ఆదిత్య ఎల్1’పై ఇస్రో కీలక అప్డేట్
-
Hyderabad: మర్రిగూడ తహసీల్దార్ అరెస్ట్.. అక్రమాస్తులు రూ.4.75 కోట్లు
-
Alia Bhatt: అప్పుడు మా వద్ద డబ్బుల్లేవు.. నాన్న మద్యానికి బానిసయ్యారు: అలియాభట్
-
Nara Lokesh: జగన్ మాదిరిగా వాయిదాలు కోరను.. సీఐడీ నోటీసుపై స్పందించిన లోకేశ్