కరెంట్‌ అఫైర్స్‌

2023 ఏప్రిల్‌కు గాను ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ పురస్కారాన్ని గెలుచుకున్న క్రికెటర్‌ ఎవరు?

Published : 09 Jun 2023 01:40 IST

మాదిరి ప్రశ్నలు

* 2023 ఏప్రిల్‌కు గాను ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ పురస్కారాన్ని గెలుచుకున్న క్రికెటర్‌ ఎవరు? (మహిళల విభాగంలో ఈ పురస్కారాన్ని థాయ్‌లాండ్‌ మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ నరుమోల్‌ ఛాయ్‌వాయ్‌ గెలుచుకున్నారు.)

జ: ఫకర్‌ జమాన్‌, పాకిస్థాన్‌


* లండన్‌ కేంద్రంగా పనిచేసే కన్సల్టెన్సీ సంస్థ ‘హెన్లీ అండ్‌     పార్ట్‌నర్స్‌’ రూపొందించిన ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల జాబితా-2023లో ఏ నగరం అగ్రస్థానంలో నిలిచింది? (ఈ జాబితాలో టోక్యోది రెండో స్థానం. ముంబయి 21వ స్థానాన్ని దక్కించుకుని, భారత్‌లో అత్యంత సంపన్న నగరంగా నిలిచింది.)  

జ: న్యూయార్క్‌


* స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రి) ‘మిలిటరీ స్పెండింగ్‌ ఎక్రాస్‌ ది గ్లోబ్‌’ అనే థీమ్‌తో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2022లో ప్రపంచ మిలిటరీ వ్యయం ఎంత మొత్తంగా నమోదైంది? (2022లో భారత మిలిటరీ వ్యయం 81.4 బిలియన్‌ డాలర్లుగా నమోదైనట్లు, దీంతో సైనిక వ్యయం విషయంలో భారత్‌ ప్రపంచంలో 4వ స్థానానికి చేరినట్లు నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో అత్యధిక సైనిక వ్యయం కలిగిన తొలి మూడు దేశాలుగా అమెరికా, చైనా, రష్యా నిలిచాయి.)

జ: 2240 బిలియన్‌ డాలర్లు


* 2023 ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాల్లో ఉత్తమ చిత్రం అవార్డును ఏది గెలుచుకుంది? (ఇవి 68వ ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలు. ఉత్తమ నటుడిగా రాజ్‌కుమార్‌ రావు (బధాయి దో), ఉత్తమ నటిగా అలియా భట్‌ (గంగూబాయి కతియావాడి) పురస్కారాలు గెలుచుకున్నారు.) 

జ: గంగూబాయి కతియావాడి



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని