కరెంట్ అఫైర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్‌లో అత్యధిక దూరం సిక్సర్ కొట్టి ‘లాంగెస్ట్ సిక్స్ ఆఫ్ ద సీజన్’ (115 మీటర్ల దూరం) పురస్కారం .
మాదిరి ప్రశ్నలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్‌లో అత్యధిక దూరం సిక్సర్ కొట్టి ‘లాంగెస్ట్ సిక్స్ ఆఫ్ ద సీజన్’ (115 మీటర్ల దూరం) పురస్కారం గెలుచుకున్న క్రీడాకారుడు ఎవరు? (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ అయిన ఈ క్రీడాకారుడు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సిక్స్‌ను కొట్టాడు.)
జ: ఫ్యాప్ డూ ప్లెసిస్
‘ద్రౌపది ముర్ము: ఫ్రమ్ ట్రైబల్ హింటర్‌ల్యాండ్స్ టు రైసినా హిల్’ పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారు? (ఒక గిరిజన బాలిక ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని భారత అత్యున్నత రాష్ట్రపతి పదవి చేపట్టిన వైనాన్ని ఈ పుస్తకంలో రచయిత వివరించారు.)
జ: కస్తూరి రే
ప్రఖ్యాత పులిట్జర్ పురస్కారాలు-2023లో ‘బ్రేకింగ్ న్యూస్ రిపోర్టింగ్’ విభాగంలో ఏ పత్రికకు చెందిన సిబ్బంది పురస్కారం గెలుచుకున్నారు?
జ: లాస్ ఏంజెల్స్ టైమ్స్
ఫోర్బ్స్ పత్రిక రూపొందించిన ప్రపంచంలో అత్యధిక సంపాదన కలిగిన 10 మంది క్రీడాకారుల జాబితాలో అగ్రస్థానంలో ఎవరు నిలిచారు? (136 మిలియన్ డాలర్ల సంపాదనతో ఈయన అగ్రస్థానంలో నిలిచారు. లియొనెల్ మెస్సీ (130 మి.డా.), కిలియన్ ఎంబాపే (120 మి.డా.) వరుసగా 2, 3 స్థానాల్లో నిలిచారు.)
జ: ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో, పోర్చుగల్
ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్లను సంబంధిత లబ్ధిదారులకు చెందేలా చేయడమే లక్ష్యంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ కార్యక్రమాన్ని చేపట్టింది? (దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని అతిపెద్ద 100 క్లెయిమ్ చేయని డిపాజిట్లకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని 2023, జూన్ 1 నుంచి ప్రారంభించింది.)
జ: 100 రోజుల ప్రచార కార్యక్రమం (100-డే క్యాంపెయిన్)
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jailer: రజనీకాంత్ ‘జైలర్’ కథను మరోలా చూపించవచ్చు: పరుచూరి విశ్లేషణ
-
Vikarabad: స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. 40 మంది విద్యార్థులు సురక్షితం
-
Madhapur Drugs Case: నటుడు నవదీప్‌ను ప్రశ్నించనున్న నార్కోటిక్ పోలీసులు
-
సముద్ర తీరంలో 144 సెక్షనా?చంద్రబాబు సైకత శిల్పం వద్ద నిరసన తెలిపిన తెదేపా నేతలపై కేసులు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Tirumala : హనుమంత వాహనంపై మలయప్పస్వామి అభయం