అతడే అద్భుత ఔషధ సృష్టి మాంత్రికుడు!
సౌరకుటుంబ విశేషాలను వెల్లడించిన ఆర్యభట్ట, పదార్థాలు పరమాణువులతో నిర్మితమవుతాయనే పరమ సిద్ధాంతాన్ని ప్రాచీన కాలంలోనే ప్రకటించిన కణాదుడు.
సైన్స్ అండ్ టెక్నాలజీ
సౌరకుటుంబ విశేషాలను వెల్లడించిన ఆర్యభట్ట, పదార్థాలు పరమాణువులతో నిర్మితమవుతాయనే పరమ సిద్ధాంతాన్ని ప్రాచీన కాలంలోనే ప్రకటించిన కణాదుడు, పదో శతాబ్దంలోనే లోహ సంగ్రహణ శాస్త్రాన్ని ప్రవచించిన నాగార్జునుడు, మొదటి శస్త్ర చికిత్స నిపుణుడు శుశ్రుతుడు, ఆయుర్వేద పితామహుడు చరకుడు, ఆధునిక కాలంలో అణుశక్తిని అందించిన హోమీ బాబా, అద్భుత ఔషధ సృష్టికర్త ఎల్లాప్రగడ, బ్లాక్‌హోల్‌ను శోధించిన సుబ్రమణ్యం చంద్రశేఖర్ తదితర ఎందరో ప్రఖ్యాత శాస్త్రవేత్తలకు పుట్టినిల్లు భారతదేశం. ఆ మహామహులు, వారి పరిశోధనలు, ఆవిష్కరణలు, అందుకున్న పురస్కారాల గురించి పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి.
భారతదేశ శాస్త్రవేత్తలు - సాంకేతిక సేవలు
1. భారతదేశ 5వ శతాబ్దం నాటి గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట రచించిన ఆర్యభట్టీయ గ్రంథం దేని గురించి తెలియజేస్తుంది?
1) గణిత శాస్త్రంలోని త్రికోణమితి, బీజగణితం, జామెట్రీ
2) ఖగోళ శాస్త్రంలోని నక్షత్రాలు, వాటి పుట్టుక
3) భౌగోళిక శాస్త్రంలోని విశ్వం పుట్టుక
4) గణిత శాస్త్రంలోని సంఖ్యలు, సున్నా
2. ఆర్యభట్ట సౌరకుటుంబం గురించి ఏ విషయాలను తెలియజేశారు?
1) భూమి గుండ్రంగా ఉండి అది తన అక్షం మీద తాను తిరుగుతుంది
2) చంద్రుడు, గ్రహాలు స్వయంప్రకాశకాలు కావు
3) సూర్య, చంద్ర గ్రహణాల శాస్త్రీయ విశ్లేషణ
4) పైవన్నీ
3. గణితానికి సంబంధించిన ‘సిద్ధాంత శిరోమణి’ అనే గ్రంథాన్ని రచించిన 12వ శతాబ్ద శాస్త్రవేత్త?
1) ఆర్యభట్ట
2) బ్రహ్మగుప్త
3) భాస్కరాచార్య
4) శుక్రాచార్య
4. పదార్థాలు పరమాణువులతో నిర్మితమవుతాయని తెలిపి, పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
1) మహావీరాచార్య
2) కణాదుడు
3) ఆర్యభట్ట
4) పరమాణుభట్టుడు
5. గుప్తుల కాలంలోని ప్రముఖ శాస్త్రవేత్త వరాహమిహిరుడు రచించిన గ్రంథం?
1) బృహత్ సంహిత
2) బీజగణితం
3) గోళాధ్యాయ
4) లీలావతి
6. 10వ శతాబ్దానికి చెందిన ఏ శాస్త్రవేత్త లోహ సంగ్రహణం, రసాయన శాస్త్రంలో అనేక విషయాలను కనుక్కున్నాడు?
1) గణిత సారంగధర
2) లోహ నింబార్కర
3) ఆచార్య నాగార్జున
4) ఆచార్య కణాదుడు
7. లోహ సంగ్రహణ శాస్త్రవేత్త ఆచార్య నాగార్జునిడికి సంబంధించి కిందివాటిలో సరైంది?
1) ఇతడు రసరత్నాకర అనే గ్రంథాన్ని రచించాడు.
2) ఇతర లోహాలను బంగారంలా మార్చే ప్రయత్నం చేశాడు.
3) రాగి, వెండి, బంగారం లాంటి లోహాలను వెలికితీసే పద్ధతులను తెలిపాడు.
4) పైవన్నీ
8. ‘శుశ్రుసంహిత’ గ్రంథ రచయిత శుశ్రుతుడిని ఏ పేరుతో పిలుస్తారు?
1) భారతదేశ ఖగోళ శాస్త్ర పితామహుడు
2) భారతదేశ శస్త్రచికిత్స పితామహుడు
3) భారతదేశ జ్యోతిష్య శాస్త్ర పితామహుడు
4) భారతదేశ రసాయన శాస్త్ర పితామహుడు
9. భారతదేశ మొదటి శస్త్రచికిత్స నిపుణుడు శుశ్రుతుడికి సంబంధించి కిందివాటిలో సరైంది?
1) ఇతడు మొదటిసారిగా శస్త్రచికిత్సల్లో పరికరాలను వినియోగించాడు.
2) మానవ శరీర అంతర్ నిర్మాణం గురించి వివరించిన శాస్త్రవేత్త.
3) ముక్కుకు మొదటిసారిగా ప్లాస్టిక్ సర్జరీ చేసిన వైద్యుడు.
4) పైవన్నీ
10. కనిష్కుడి కాలంలోని ఏ శాస్త్రవేత్తని ఆయుర్వేద శాస్త్ర పితామహుడుగా పిలుస్తారు?
1) వరాహమిహిరుడు 2) కన్హలుడు
3) చరకుడు 4) సారంగధరుడు
11. చరకుడు రచించిన ‘చరకసంహిత’ గ్రంథం దేనికి సంబంధించింది?
1) గణితశాస్త్రం 2) ఆయుర్వేదం
3) రసాయన శాస్త్రం 4) ఖగోళ శాస్త్రం
12. భారతదేశ మొదటి ఆధునిక శాస్త్రవేత్తగా పిలిచే జగదీష్ చంద్రబోస్ అభివృద్ధి చేసిన క్రెస్కోగ్రాఫ్ ఉపయోగం ఏమిటి?
1) మొక్కల పెరుగుదలను కొలవడానికి
2) గుండె వేగం కొలవడానికి
3) మెదడు నుంచి వెలువడే తరంగాలను గుర్తిస్తుంది
4) భూకంప తీవ్రతను గుర్తిస్తుంది.
13. భౌతిక, జీవశాస్త్రవేత్త అయిన జగదీష్ చంద్రబోస్ పరిశోధనలు, కనుక్కున్న విషయాలు?
1) మొక్కలు బాహ్య ప్రేరణలకు ప్రతిస్పందిస్తాయని తెలిపారు.
2) విద్యుత్ అయస్కాంత తరంగాలపై పరిశోధనలు చేశారు.
3) పోలరైజర్‌లు, వేవ్ గైడ్‌లను కనుక్కున్నారు.
4) పైవన్నీ
14. అనేక కర్మాగారాలను నెలకొల్పిన ఏ శాస్త్రవేత్తను భారతదేశ రసాయన శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు?
1) జగదీష్ చంద్రబోస్ 2) ప్రఫుల్ల చంద్ర రే
3) రామానుజన్ 4) అమర్త్యసేన్
15. 1887లో జన్మించిన శ్రీనివాస రామానుజన్ దేనిలో ప్రసిద్ధి చెందారు?
1) గణిత శాస్త్రం 2) భౌతిక శాస్త్రం
3) రసాయన శాస్త్రం 4) భౌగోళిక శాస్త్రం
16. భారతదేశ భౌతిక శాస్త్రవేత్త సి.వి.రామన్‌కు ఏ పరిశోధనకుగానూ నోబెల్ బహుమతి లభించింది?
1) కాంతి పరావర్తనం (లైట్ రిఫ్లెక్షన్)
2) కాంతి శోషణం
3) కాంతి విక్షేపణం (స్కాటరింగ్ ఆఫ్ లైట్)
4) కాంతి ఉత్పత్తి
17. భారతదేశంలో శాస్త్ర సాంకేతికతకు సి.వి.రామన్ చేసిన సేవలు?
1) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరును స్థాపించారు.
2) నేషనల్ సైన్స్ అకాడమీని నెలకొల్పారు.
3) రామన్ ఎఫెక్ట్‌ను కనుక్కున్నారు.
4) పైవన్నీ
18. భారతదేశ ప్రముఖ వృక్షశిలాజ శాస్త్రవేత్త ఏ మొక్కల శిలాజాలను కనుక్కున్నారు?
1) ఏకదళ బీజాలు
2) వివృత బీజాలు
3) బ్రయోఫైటా
4) టెరిడోఫైటా
19. భారతదేశ సాంఖ్యక శాస్త్ర (స్టాటిస్టిక్స్) పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?
1) పి.సి.మహలనోబిస్
2) సి.వి. రామన్
3) బీర్బల్ సాహ్ని
4) ఎవరూకాదు
20. భౌతిక, సాంఖ్యక శాస్త్రవేత్త అయిన పి.సి.మహలనోబిస్ భారతదేశానికి చేసిన సేవలు?
1) ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించారు.
2) సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్‌ను స్థాపించారు.
3) నేషనల్ శాంపుల్ సర్వేను ప్రారంభించారు.
4) పైవన్నీ
21. పి.సి.మహలనోబిస్‌కు సంబంధించి కింది వాక్యాల్లో సరైంది?
1) దేశ అభివృద్ధికి భారీ పరిశ్రమల్లో ఎక్కువ పెట్టుబడి అవసరమని భావించారు.
2) 1949లో నేషనల్ ఇన్‌కమ్ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు.
3) సాంఖ్యక శాస్త్ర సూత్రాలను ఆంత్రోపాలజీ, వాతావరణశాస్త్రం లాంటి వాటికి అనువర్తించారు.
4) పైవన్నీ
22. మేఘనాథ్ సాహా ఏ రంగానికి చెందినవారు?
1) అణు శాస్త్రవేత్త
2) ఖగోళ, భౌతిక శాస్త్రవేత్త
3) రసాయన శాస్త్రవేత్త
4) గణిత శాస్త్రవేత్త
23. సత్యేంద్రనాథ్ బోస్ పేరు మీదుగా పెట్టిన బోసాన్‌లు అనేవి?
1) ఉప పరమాణు కణాలు
2) విశ్వంలోని కాస్మిక్ కిరణాలు
3) భూమిలోని ఖనిజాలు
4) సూర్యుడిలోని కణాలు
24. సత్యేంద్రనాథ్ బోస్, ఐన్‌స్టీన్ కలిసి ప్రతిపాదించిన బోస్‌ఐన్‌స్టీన్ కండెన్సేట్ అనేది
1) గ్రహాల్లోని ఘన పదార్థం
2) పదార్థ ఐదో రూపం
3) వేడివస్తువుల నుంచి జనించే ఉష్ణం
4) వస్తువులను చల్లార్చడానికి వాడే పదార్థం
25. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) కు మొదటి డైరెక్టర్ ఎవరు?
1) పి.సి.రాయ్
2) బి.వి.రావు
3) శాంతి స్వరూప్ భట్నాగర్
4) మహలనోబిస్
26. శాంతిస్వరూప్ భట్నాగర్‌కు సంబంధించి సరైంది?
1) ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్‌ను స్థాపించారు.
2) దేశ ఆర్థిక వ్యవస్థకు సైన్స్ అనువర్తనం తప్పనిసరి అని చెప్పారు.
3) కొల్లాయిడల్, మాగ్నటో కెమిస్ట్రీలలో ప్రసిద్ధ శాస్త్రవేత్త.
4) పైవన్నీ
27. ఎల్లాప్రగడ సుబ్బారావును ఏమని పిలుస్తారు?
1) అద్భుత ఔషధ సృష్టి మాంత్రికుడు
2) భారత వైద్య శాస్త్ర పితామహుడు
3) భారత భూగర్భ శాస్త్ర పితామహుడు
4) భారత ఖనిజ శాస్త్ర మాంత్రికుడు
28. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు తయారు చేసి, అభివృద్ధి చేసిన ఔషధాలు, రసాయనాలకు సంబంధించిన వాక్యాల్లో సరైనవి?
1) ఫోలిక్ ఆమ్లం తయారు చేశారు.
2) కాలేయం నుంచి విటమిన్ బి12ను సంగ్రహించడం.
3) రక్తంలో ఫాస్ఫరస్‌ను లెక్కగట్టే పద్ధతిని అభివృద్ధి చేశారు.
4) పైవన్నీ
29. కిందివాటిలో మొదటి క్యాన్సర్ నిరోధక ఔషధమైన దేన్ని కనుక్కున్నందుకు ఎల్లాప్రగడ సుబ్బారావును కీమోథెరపి పితామహుడు అంటారు?
1) టెట్రాసైక్లిన్
2) పెన్సిల్లిన్
3) మెథోట్రెక్సేట్
4) అడినోసైన్ ట్రైఫాస్ఫేట్
30. సలీమ్ అలీ ఏ శాస్త్ర విభాగానికి చెందినవారు?
1) ఆర్నిథాలజీ
2) హైడ్రాలజీ
3) టాక్సికాలజీ
4) కీమోథెరపీ
31. హోమీ జహంగీర్ బాబా భారతదేశంలో ఏ సాంకేతికత అభివృద్ధికి విశేష కృషి చేశారు?
1) అంతరిక్ష సాంకేతికత
2) అణు సాంకేతికత
3) రక్షణ రంగ సాంకేతికత
4) కంప్యూటర్ సాంకేతికత
32. భారతదేశ అణుశక్తి పితామహుడు హోమీ జహంగీర్ బాబా అణు సాంకేతికతకు చేసిన కృషి?
1) భారతదేశంలో మూడు దశల అణు విద్యుచ్ఛక్తి ఉత్పత్తిని ప్రతిపాదించారు.
2) అటామిక్ ఎనర్జీ కమిషన్‌కు మొదటి ఛైర్మన్‌గా వ్యవహరించారు.
3) అప్సర రిసెర్చ్ రియాక్టర్ ఏర్పాటుకు కృషిచేశారు.
4) పైవన్నీ
33. భారతదేశ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సుబ్రమణ్యం చంద్రశేఖర్ ప్రతిపాదించిన చంద్రశేఖర్ లిమిట్ సిద్ధాంతం దేనికి సంబంధించింది?
1) నక్షత్రాల నిర్మాణం, వాటి పరిణామం, బ్లాక్‌హోల్స్
2) భూమి పుట్టుక, పరిణామం
3) సౌర కుటుంబ పరిణామం
4) గ్రహాంతర జీవుల ఉనికి
సమాధానాలు
1-1, 2-4, 3-3, 4-2, 5-1, 6-3, 7-4, 8-2, 9-4, 10-3, 11-2, 12-1, 13-4, 14-2, 15-1, 16-3, 17-4, 18-2, 19-1, 20-4, 21-4, 22-2, 23-1, 24-2, 25-3, 26-4, 27-1, 28-4, 29-3, 30-1, 31-2, 32-4, 33-1.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Parvathipuram Manyam: లోయలో పడిన ద్విచక్ర వాహనం.. ముగ్గురి మృతి
-
CBI: అమిత్ షా భరోసా ఇచ్చారు.. సీబీఐ దర్యాప్తు షురూ: సీఎం బీరెన్ సింగ్
-
Hyderabad Metro: గణేశ్ నిమజ్జనం.. మెట్రో రైలు ప్రత్యేక ఏర్పాట్లు
-
Dengue: దేశవ్యాప్తంగా డెంగీ కలవరం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
-
Chandrababu Arrest: ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేముంది: రేవంత్‌రెడ్డి
-
Social Look: ఫ్యాషన్ షోలో ఖుషి.. దివి స్టైలిష్ అవతార్