నోటిఫికేషన్స్‌

ముంబయిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ - న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌) హెచ్‌ఆర్, ఎఫ్‌ & ఎ, సి & ఎంఎం విభాగాల్లో 58 అసిస్టెంట్‌ గ్రేడ్‌-ఖి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Published : 14 Jun 2024 00:33 IST

అసిస్టెంట్‌ గ్రేడ్‌-ఖి పోస్టులు

ముంబయిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ - న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌) హెచ్‌ఆర్, ఎఫ్‌ & ఎ, సి & ఎంఎం విభాగాల్లో 58 అసిస్టెంట్‌ గ్రేడ్‌-ఖి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తు రుసుము రూ.100. అర్హులైన అభ్యర్థులు జూన్‌ 25వ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు

కోల్‌కతాలోని దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ (డీడీసీ) 176 ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గేట్‌-2023 స్కోరు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఫీజు రూ.300. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ 7 జులై 2024.


ఆఫీసర్‌ గ్రేడ్‌-ఎ పోస్టులు

ముంబయిలోని సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) జనరల్, లీగల్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్, రిసెర్చ్, అఫీషియల్‌ లాంగ్వేజ్‌ స్ట్రీమ్‌ల్లో 97 ఆఫీసర్‌ గ్రేడ్‌-ఎ (అసిస్టెంట్‌ మేనేజర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తు రుసుము రూ.1000. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 30 జూన్‌ 2024 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని