కరెంట్‌ అఫైర్స్‌

19 ఏళ్లకే ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితాలో చోటు పొంది ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన బిలియనీర్‌గా చరిత్ర సృష్టించిన లివియా వోయిట్‌ ఏ దేశస్థురాలు?

Published : 14 Jun 2024 00:32 IST

మాదిరి ప్రశ్నలు

19 ఏళ్లకే ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితాలో చోటు పొంది ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన బిలియనీర్‌గా చరిత్ర సృష్టించిన లివియా వోయిట్‌ ఏ దేశస్థురాలు? (అత్యంత సంపన్నుడైన ఈమె తాత, డబ్ల్యూఈజీ కంపెనీ స్థాపకుడు వెర్నెర్‌ రికార్డో నుంచి వారసత్వంగా కోట్ల షేర్లు దక్కడంతో ఈమె ఒక్కసారిగా రూ.వేల కోట్ల అధిపతి అయ్యారు. ఫోర్బ్స్‌ సంస్థ 2024, ఏప్రిల్‌లో 33 ఏళ్ల లోపు ఉన్న 25 మంది యువ బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. దాదాపు రూ.9165 కోట్ల (1.1 బిలియన్‌ డాలర్లు) సంపదతో ఈమె ప్రపంచంలో బిలియనీర్‌ అయిన అత్యంత చిన్న వయస్కురాలిగా జాబితాలో చోటు పొందారు.)

జ: బ్రెజిల్‌


2023లో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఎన్ని అంకురాలు యూనికార్న్‌ (ఒక బిలియన్‌ డాలర్లు - రూ.8300 కోట్ల విలువ) హోదా సాధించినట్లు హురున్‌ గ్లోబల్‌ యూనికార్న్‌ ఇండెక్స్‌ - 2024 ఇటీవల వెల్లడించింది?

జ: 171 అంకురాలు 

(వీటిలో అమెరికాలో 70, చైనాలో 56 సంస్థలు యూనికార్న్‌ స్థాయికి చేరాయి. మిగతా దేశాల నుంచి 45 ఆవిర్భవించాయి. 2000 సంవత్సరం తర్వాత కార్యకలాపాలు ప్రారంభించి, ఇప్పటికీ స్టాక్‌ మార్కెట్లలో నమోదు కాని సంస్థలను హురున్‌ ఈ జాబితాలో చేర్చింది. 2024, జనవరి 1 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి అంకురాలు 1453 ఉన్నాయి. మొత్తం 703 యూనికార్న్‌లతో అమెరికా తొలి స్థానంలో ఉండగా, చైనాలో వీటి సంఖ్య 340గా ఉంది. భారత్‌ 67, యూకే 53 యూనికార్న్‌లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.)


బిజినెస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ విద్యను అందించే విద్యాసంస్థల్లో ఐఐఎం అహ్మదాబాద్‌ ప్రపంచంలో ఎన్నో స్థానంలో నిలిచింది? (లండన్‌కు చెందిన ఉన్నత విద్య   విశ్లేషణల సంస్థ క్యూఎస్‌ వరల్డ్‌  యూనివర్సిటీ ర్యాంకుల జాబితాలో ఐఐఎం అహ్మదాబాద్‌ ఈ స్థానంలో నిలిచింది.)                       

జ: 25వ Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని