కరెంట్‌ అఫైర్స్‌

జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ)గా విశ్రాంత ఐపీఎస్‌ అధికారి అజీత్‌ డోభాల్‌ను కేంద్రప్రభుత్వం 2024, జూన్‌ 13న మరోసారి నియమించింది. పదవీకాలంలో ఆయన క్యాబినెట్‌ మంత్రి హోదాతో వ్యవహరిస్తారు.

Updated : 15 Jun 2024 00:52 IST

  • జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ)గా విశ్రాంత ఐపీఎస్‌ అధికారి అజీత్‌ డోభాల్‌ను కేంద్రప్రభుత్వం 2024, జూన్‌ 13న మరోసారి నియమించింది. పదవీకాలంలో ఆయన క్యాబినెట్‌ మంత్రి హోదాతో వ్యవహరిస్తారు. 2014 మే 30న డోభాల్‌ తొలిసారి ఎన్‌ఎస్‌ఏగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌గా పనిచేశారు.
  • అలాగే విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పి.కె.మిశ్రాను ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పదవిలో కొనసాగిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయనకు క్యాబినెట్‌ మంత్రి హోదాను కేటాయించారు.

  • భారత యువ చెస్‌ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్‌ ప్రపంచ జూనియర్‌ చెస్‌ టోర్నమెంట్‌ మహిళల విభాగంలో విజేతగా నిలిచింది. 2024, జూన్‌ 12న గాంధీనగర్‌ (గుజరాత్‌)లో జరిగిన ఆఖరి రౌండ్లో బెలోస్లావా (బల్గేరియా)ను ఆమె ఓడించింది. మొత్తం 11 రౌండ్లలో 10 పాయింట్లు సాధించి దివ్య అగ్రస్థానంలో నిలిచింది. 
  • మరో భారత ప్లేయర్‌ రక్షిత రవి (7.5) అయిదో స్థానంలో నిలిచింది.

  • పీఎల్‌ విలువ 2024లో 6.5 శాతం పెరిగి సుమారు రూ.1,34,858 కోట్లకు చేరిందని అమెరికా పెట్టుబడి బ్యాంకు హాలిహన్‌ లోకీ నివేదిక తెలిపింది. అంతేకాకుండా బ్రాండ్‌ విలువ ఏడాదికి 6.3 శాతం పెరిగి దాదాపు రూ.28 వేల కోట్లకు చేరిందని ఆ నివేదిక పేర్కొంది. 
  • ఒలింపిక్స్, ఫిఫా ప్రపంచకప్, క్రికెట్‌ ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలు కాకుండా లక్ష కోట్ల రూపాయల విలువను అందుకుంది ఐపీఎల్‌ మాత్రమే.

కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని