కరెంట్‌ అఫైర్స్‌

దేశ ఉగ్రవాద వ్యతిరేక దళం నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ (ఎన్‌ఎస్‌జీ) అధిపతిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? (1992 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌ ఐపీఎస్‌ అయిన ఈయన సీఆర్‌పీఎఫ్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వహించారు.

Published : 16 Jun 2024 01:41 IST

మాదిరి ప్రశ్నలు

  • దేశ ఉగ్రవాద వ్యతిరేక దళం నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ (ఎన్‌ఎస్‌జీ) అధిపతిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? (1992 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌ ఐపీఎస్‌ అయిన ఈయన సీఆర్‌పీఎఫ్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వహించారు. ఎన్‌ఎస్‌జీ అధిపతిగా 2028, ఆగస్టు 31 వరకు కొనసాగుతారు.)

జ: నళిన్‌ ప్రభాత్‌

  • ‘ఆపరేషన్‌ మేఘ్‌దూత్‌’ కు 2024, ఏప్రిల్‌ 13 నాటికి ఎన్నేళ్లు  పూర్తయ్యాయి?

జ: 40 ఏళ్లు (భారత్‌కు కీలక స్థానంగా ఉండే సియాచిన్‌ ప్రాంతం ఆక్రమణకు పాకిస్థాన్‌ చేసిన యత్నాన్ని భారత్‌ సైన్యం దీటుగా ఎదుర్కొంది. 1984, ఏప్రిల్‌ 13న ‘ఆపరేషన్‌ మేఘ్‌దూత్‌’ పేరిట సైనిక చర్య చేపట్టి పాకిస్థాన్‌ పన్నాగాన్ని తిప్పి కొట్టింది. హిమాలయాల్లోని ఉత్తర లద్దాఖ్‌ చేరువలో 20 వేల అడుగుల ఎత్తులో ఉన్న హిమనదం సియాచిన్‌.)

  • సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై జరిగిన  గగనతల దాడి ఇజ్రాయెల్‌ పనేనని భావించిన ఇరాన్‌ ఏ  ఆపరేషన్‌ పేరుతో ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది?

జ: ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌

  • ఇరాన్‌ తమ దేశంపై జరిపిన దాడిని ఇజ్రాయెల్‌ ఏ ఆపరేషన్‌ను చేపట్టి విజయవంతంగా ఎదుర్కొన్నట్లు ప్రకటించింది? (ఈ ఆపరేషన్‌ ద్వారా ఇరాన్‌ ప్రయోగించిన వందలాది డ్రోన్లు, క్షిపణులను ఇజ్రాయెల్‌ ధ్వంసం చేసింది. దీంతోపాటు ఇరాన్‌ అణు, సైనిక స్థావరాలకు ప్రధాన కేంద్రం, ఇరాన్‌లోని మూడో అతిపెద్ద నగరమైన ఇస్ఫహాన్‌పై ఇజ్రాయెల్‌ డ్రోన్లు, క్వాడ్‌ కాప్టర్లు, క్షిపణులతో దాడి చేసింది.) 

జ: ఆపరేషన్‌ ఐరన్‌ షీల్డ్‌  Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని