కరెంట్‌ అఫైర్స్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఏ ఆలయం వద్ద విధులు నిర్వర్తించే పోలీసులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త డ్రెస్‌ కోడ్‌ ప్రకటించడం వివాదాస్పదమైంది?

Published : 17 Jun 2024 00:12 IST

మాదిరి ప్రశ్నలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఏ ఆలయం వద్ద విధులు నిర్వర్తించే పోలీసులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త డ్రెస్‌ కోడ్‌ ప్రకటించడం వివాదాస్పదమైంది? (ఇక నుంచి వారు ఖాకీ దుస్తుల్లో కాకుండా ధోతీ - కుర్తా, మెడలో రుద్రాక్షమాలతో అర్చకుల వస్త్రధారణలో సంప్రదాయబద్ధంగా విధుల్లో ఉంటారని ప్రభుత్వం ప్రకటించింది.)

జ: కాశీ విశ్వనాథ ఆలయం

మార్కెట్‌ విలువ పరంగా ప్రపంచ విమానయాన సంస్థల్లో మూడో అగ్రగామి సంస్థగా ఏ భారత విమానయాన సంస్థ నిలిచింది? (ఇది ఇప్పటికే భారత్‌లో అతిపెద్ద విమానయాన సంస్థగా ఉంది. అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్‌ లైన్స్‌ 30.4 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2.52 లక్షల కోట్లు) మార్కెట్‌ విలువతో ప్రపంచ విమానయాన సంస్థల్లో అగ్రగామిగా ఉంది. ఐర్లాండ్‌కు చెందిన చౌక ధరల విమానయాన సంస్థ ర్యానైర్‌ హోల్డింగ్స్‌ సంస్థ 26.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్లు)తో రెండో స్థానంలో ఉంది. 17.6 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1.46 లక్షల కోట్లు) మార్కెట్‌ విలువతో భారత సంస్థ మూడో స్థానాన్ని ఆక్రమించింది.)

జ: ఇండిగో

ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) 2024, ఏప్రిల్‌లో ఎన్ని బేసిస్‌ పాయింట్లు పెంచింది?

జ: 30 బేసిస్‌ పాయింట్లు (2023, డిసెంబరు నాటి అంచనాల ప్రకారం ఇది 6.7%కాగా, తాజాగా 7%కి పెంచింది.)

ప్రపంచవ్యాప్తంగా 2040 నాటికి ఏడాదికి ఎన్ని లక్షల మరణాలు రొమ్ము క్యాన్సర్‌ వ్యాధి కారణంగా సంభవించే అవకాశం ఉందని లాన్సెట్‌ కమిషన్‌ తాజాగా వెల్లడించింది? (ప్రపంచవ్యాప్తంగా 75 ఏళ్ల వయసు వచ్చేసరికి ప్రతి 12 మంది మహిళల్లో ఒకరు సగటున ఈ క్యాన్సర్‌ బారిన పడుతున్నట్లు లాన్సెట్‌ వెల్లడించింది.)

జ: 10 లక్షలు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని