కరెంట్‌ అఫైర్స్‌

2024, ఏప్రిల్‌ 17న శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య బాలరాముడి నుదుటిన ఎంత పరిమాణం మేర సూర్య     కిరణాలు తాకాయి?

Published : 18 Jun 2024 00:46 IST

మాదిరి ప్రశ్నలు

  • 2024, ఏప్రిల్‌ 17న శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య బాలరాముడి నుదుటిన ఎంత పరిమాణం మేర సూర్య     కిరణాలు తాకాయి? (ఏటా శ్రీరామనవమి సందర్భంగా రాముడికి ఇంత పరిమాణంలో సూర్యతిలకం దిద్దేలా ఆలయంలో దర్పణాలు, కటకాల సాయంతో ప్రత్యేక ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత సూర్యతిలకం ఘట్టం ఆవిష్కృతమయ్యేలా ఏర్పాటు చేశారు.)

జ: 58 మిల్లీ మీటర్లు

  • ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024 జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ఒలింపిక్స్‌ పుట్టిల్లు గ్రీస్‌లో ఏ రోజున నిర్వహించారు? (తొలి ఒలింపిక్స్‌ను ప్రారంభించిన ప్రాచీన ఒలింపియా పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రీక్‌ నటి మారియా మెనా జ్యోతిని వెలిగించారు. తొలి టార్చ్‌ను రోయింగ్‌లో ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత అయిన గ్రీస్‌ ఆటగాడు స్టెఫనోస్‌ డూస్కెస్‌ అందుకోగా, రెండో టార్చ్‌ బేరర్‌గా ఆతిథ్య ఫ్రాన్స్‌కు చెందిన మాజీ ఒలింపిక్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌ లారా మనాడూ నిలిచింది.)

జ: 2024, ఏప్రిల్‌ 16

ప్రస్తుత 2024 సంవత్సరానికి భారత వృద్ధిరేటు అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) ఎంత శాతంగా ఉండవచ్చని తాజాగా అంచనా వేసింది? (ఈ ఏడాది జనవరి అంచనాల్లో వృద్ధిరేటు 6.5 శాతంగా ఉండొచ్చని సంస్థ అంచనా వేసింది.)               

జ: 6.8 శాతం


ప్రాక్టీస్‌ టెస్ట్‌

ఇండియన్‌ పాలిటీ
నీతి ఆయోగ్‌

1. కేంద్రమంత్రి మండలి తీర్మానం ద్వారా ప్రణాళికా సంఘాన్ని ఏ రోజున రద్దు చేశారు?

1) 2014, ఆగస్టు 17 2) 2014, ఆగస్టు 18

3) 2014, ఆగస్టు 19 4్శ 2014, ఆగస్టు 20

2. నీతి ఆయోగ్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 2015, జనవరి 1 2) 2015, జనవరి 2

3) 2015, జనవరి 3 4) 2015, జనవరి 4

3. నీతి ఆయోగ్‌ అధ్యక్షులు ఎవరు?

1)రాష్ట్రపతి 2) ఉపరాష్ట్రపతి  3) ప్రధానమంత్రి  4) కేంద్ర ఆర్థిక మంత్రి

4. నీతి ఆయోగ్‌కు ఉపాధ్యక్షులు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)లను ఎవరు నియమిస్తారు?

1)రాష్ట్రపతి 2) ఉపరాష్ట్రపతి  3) కేంద్ర ఆర్థిక మంత్రి  4) ప్రధానమంత్రి

5. నీతి ఆయోగ్‌ ప్రస్తుత ఉపాధ్యక్షుడు?

1)  ప్రొఫెసర్‌ అరవింద్‌ పనగరియా 2)డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌

3) డాక్టర్‌ సి.రంగరాజన్‌ 4)సుమన్‌ బెరీ

6. నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షులు కింది ఎవరితో సమాన హోదాను కలిగి ఉంటారు?

1) కేంద్ర కేబినెట్‌ మంత్రి 2) ప్రధానమంత్రి               

3) రాష్ట్రపతి 4) ఉపరాష్ట్రపతి

సమాధానాలు, మరిన్ని ప్రాక్టీస్‌ టెస్ట్‌ బిట్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని