కరెంట్‌ అఫైర్స్‌

స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రి) 2024, జూన్‌ 17న తన వార్షిక నివేదిక ‘సిప్రి ఇయర్‌ బుక్‌ 2024’ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు తమ రక్షణ కోసం పూర్తిగా అణ్వస్త్రాలనే నమ్ముకున్నాయని నివేదికలో వెల్లడించింది.

Published : 19 Jun 2024 01:38 IST

స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రి) 2024, జూన్‌ 17న తన వార్షిక నివేదిక ‘సిప్రి ఇయర్‌ బుక్‌ 2024’ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు తమ రక్షణ కోసం పూర్తిగా అణ్వస్త్రాలనే నమ్ముకున్నాయని నివేదికలో వెల్లడించింది. భారత్, పాకిస్థాన్‌ సహా 9 అణ్వస్త్ర దేశాలు 2023లో తమ అణ్వాయుధాగారాలను ఆధునికీ కరించాయని వివరించింది.

వివిధ దేశాల్లో అణ్వస్త్రాల సంఖ్య: రష్యా - 5,580, అమెరికా - 5,044, చైనా - 500, ఫ్రాన్స్‌ - 290, బ్రిటన్‌ - 225, భారత్‌ - 172, పాకిస్థాన్‌ - 170,  ఇజ్రాయెల్‌ - 90, ఉత్తర కొరియా - 50.


సోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) 2024, జూన్‌ 18న ర్యాంకింగ్స్‌ ప్రకటించింది. ఈ జాబితాలో భారత టెన్నిస్‌ అగ్రశ్రేణి సింగిల్స్‌ ఆటగాడు సుమిత్‌ నగాల్‌ (26) తన కెరీర్‌లో అత్యుత్తమంగా 71వ స్థానంలో నిలిచాడు. గతంలో సుమిత్‌ 77వ ర్యాంకులో ఉన్నాడు.


ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఎస్‌ఈజడ్‌ల) నుంచి గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 163.39 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.13.5 లక్షల కోట్లు) విలువైన ఎగుమతులు నమోదయ్యాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. మన దేశం నుంచి మొత్తం ఎగుమతుల విలువ 2022-23తో పోలిస్తే 2023-24లో 3 శాతానికి పైగా తగ్గినా, ఎస్‌ఈజడ్‌ల ఎగుమతులు మాత్రం 4 శాతం పెరిగినట్లు పేర్కొన్నాయి.

కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


మాదిరి ప్రశ్నలు

భారత నావికా దళం నూతన అధిపతిగా 2024, ఏప్రిల్‌ 30న ఎవరు బాధ్యతలు స్వీకరించారు? (అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ స్థానంలో ఈయన బాధ్యతలు చేపట్టారు.)

జ: దినేష్‌ కుమార్‌ త్రిపాఠి


ఐక్యరాజ్య సమితి పాపులేషన్‌ ఫండ్‌ (యూఎన్‌ఎఫ్‌పీఏ - యునైటెడ్‌ నేషన్స్‌ ఫండ్‌ ఫర్‌ పాపులేషన్‌ యాక్టివిటీస్‌) విడుదల చేసిన స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ - 2024 నివేదిక ప్రకారం భారతదేశ జనాభా ఎంత మొత్తానికి చేరింది? (ఇండియాలోని మొత్తం జనాభాలో 24 శాతం మంది 14 ఏళ్ల లోపు వారే ఉన్నారని వెల్లడించింది. 10 నుంచి 19 ఏళ్ల లోపు వారు 17 శాతం, 10 నుంచి 24 ఏళ్ల లోపు వారు 26 శాతం, 15 నుంచి 64 ఏళ్ల లోపు వారు 68 శాతం మంది ఉన్నారని నివేదిక పేర్కొంది. 65 ఏళ్లు దాటిన వారు దేశ జనాభాలో 7 శాతం ఉన్నట్లు తెలిపింది. దేశంలో పురుషుల్లో సగటు జీవన కాలం 71 ఏళ్లుగా, మహిళల్లో 74 ఏళ్లుగా ఉన్నట్లు పేర్కొంది.)

జ: 144.17 కోట్లు 


ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) 2024 ఏప్రిల్‌లో ఏ ప్రముఖ శాస్త్రవేత్తను ఆర్యభట్ట పురస్కారంతో సత్కరించింది? (మన దేశంలో ఆస్ట్రో నాటిక్స్‌ రంగంలో విశేష సేవలు అందించినందుకు ఈయనకు ఈ పురస్కారం దక్కింది. గతంలో ఈయనకు భాస్కర అవార్డు కూడా లభించింది. ఈ రెండు అవార్డులు అందుకున్న అరుదైన శాస్త్రవేత్తగా గుర్తింపు సాధించారు. ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేసిన ఈయన 1992లో అనంత్‌ టెక్నాలజీస్‌ను ఏర్పాటు చేశారు. ఇస్రోతో పాటు మన దేశ రక్షణ అవసరాలకు అనువైన అత్యాధునిక ఏవియానిక్స్‌ పరిశోధన - అభివృద్ధిలో ఈ సంస్థ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ఈ సంస్థకు హైదరాబాద్, బెంగళూరు, తిరువనంతపురంలలో పరిశోధన - అభివృద్ధి తయారీ కేంద్రాలున్నాయి.)

జ: డాక్టర్‌ పావులూరి సుబ్బారావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు