కరెంట్‌ అఫైర్స్‌

అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌గా నియమితులైన మొదటి మహిళగా ఇటీవల ఎవరు వార్తల్లో నిలిచారు? (అయిదేళ్ల పాటు ఈమె ఈ పదవిలో ఉంటారు. వందేళ్ల వర్సిటీ చరిత్రలో ఈ అత్యున్నత పదవి చేపట్టిన తొలి మహిళగా ఈమె చరిత్ర సృష్టించారు.)  

Published : 20 Jun 2024 01:08 IST

మాదిరి ప్రశ్నలు

  • అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌గా నియమితులైన మొదటి మహిళగా ఇటీవల ఎవరు వార్తల్లో నిలిచారు? (అయిదేళ్ల పాటు ఈమె ఈ పదవిలో ఉంటారు. వందేళ్ల వర్సిటీ చరిత్రలో ఈ అత్యున్నత పదవి చేపట్టిన తొలి మహిళగా ఈమె చరిత్ర సృష్టించారు.)  

జ:  ప్రొఫెసర్‌ నైమా ఖాతూన్‌

  • వరల్డ్‌ ఇనీక్వాలిటీ ల్యాబ్‌ రూపొందించిన ‘భారతీయుల ఆదాయ సంపదల్లో వ్యత్యాసాలు 1922-2023’ నివేదిక ప్రకారం ప్రస్తుతం భారత జనాభాలో పై    వరుసలో ఉన్న ఒక్క శాతానికి దేశ ఆదాయంలో ఎంత శాతం సమకూరుతోంది? (పై వరుసలో ఉన్న ఒక్క శాతానికి దేశ సంపదలో 40.1 శాతం సమకూరుతోంది. వీరి సగటు తలసరి వార్షికాదాయం రూ.53 లక్షలుగా ఉంది. దేశంలో అట్టడుగున ఉన్న సగం జనాభా కేవలం 15 శాతం ఆదాయం, 6.4 శాతం సంపదతో సరిపెట్టుకుంటోంది. వీరి సగటు తలసరి వార్షికాదాయం రూ.73 వేలుగా నివేదిక వెల్లడించింది. భారత్‌లో ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు అంతకంతకూ పెరుగుతున్నాయని, ఈ అసమానతలు ఆంగ్లేయుల హయాంలో కంటే ఇప్పుడే ఎక్కువగా ఉంటున్నాయని నివేదిక విశ్లేషించింది.)

జ:  22.6 శాతం

  • ‘ది డ్యాన్సింగ్‌ గర్ల్స్‌ ఆఫ్‌ లాహోర్‌’ పుస్తక రచయిత్రి ఎవరు? (ఈమె లండన్‌కు చెందిన ప్రొఫెసర్, సోషియాలజిస్ట్‌. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్న హీరామండీ వేశ్య వాటికపై ఏళ్ల తరబడి పరిశోధనలు చేసి అక్కడి వారి జీవితాలపై ఈ పుస్తకాన్ని రచించారు. మొగలుల కాలంలో ఆస్థానంలో ఉండే కళాకారుల కోసం ఏర్పాటు చేసిందే హీరామండీ. భారతీయ నృత్యాల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన అక్కడి కళాకారిణులు ఆంగ్లేయుల రాకతో పొట్ట పోసుకునేందుకు వేశ్యలుగా మారారు.   బ్రిటిషర్ల రాకతో కోల్‌కతాలోని కళాకారిణులు వేశ్యలుగా మారిన తీరును రచయిత్రి తన మొదటి పుస్తకం ‘ఈడెన్‌ గార్డెన్స్‌’లో వివరించారు. ‘ది డ్యాన్సింగ్‌ గర్ల్స్‌ ఆఫ్‌ లాహోర్‌’ ఈమె రెండో పుస్తకం.)

జ:  లూయిస్‌ బ్రౌన్‌Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని