నోటిఫికేషన్స్‌

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్‌ విడుదల చేసింది.

Published : 21 Jun 2024 00:44 IST

అగ్నివీర్‌ వాయు ఉద్యోగాలు 

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్‌ విడుదల చేసింది. అగ్నివీర్‌ వాయు (02/ 2025) ఖాళీల భర్తీకి ఐఏఎఫ్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. పరీక్ష ఫీజు రూ.550. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌లు 8 జులై 2024 నుంచి ప్రారంభమవుతాయి. అర్హులైన అభ్యర్థులు 28 జులై 2024 లోపు దరఖాస్తు చేసుకోవాలి.


బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఖాళీలు 

గుజరాత్, వడోదరలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) ప్రధాన కార్యాలయం రెగ్యులర్‌ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా బీవోబీ శాఖల్లో కార్పొరేట్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ క్రెడిట్, ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఫారెక్స్‌ అక్విజిషన్‌ అండ్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్, ఫారెక్స్‌ అక్విజిషన్‌ అండ్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్, క్రెడిట్‌ అనలిస్ట్, రిలేషన్‌షిప్‌ మేనేజర్, సీనియర్‌ మేనేజర్‌ బిజినెస్‌ ఫైనాన్స్, చీఫ్‌ మేనేజర్‌ ఇంటర్నల్‌ కంట్రోల్స్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య 168. అప్లికేషన్‌ ఫీజు రూ.600. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ 2 జులై 2024.

పూర్తి వివరాలు, మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని