కరెంట్‌ అఫైర్స్‌

టైమ్‌ మ్యాగజైన్‌ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైౖన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు పొందిన ప్రముఖ భారత మహిళా రెజ్లర్‌ ఎవరు?

Published : 24 Jun 2024 00:49 IST

మాదిరి ప్రశ్నలు

  • టైమ్‌ మ్యాగజైన్‌ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైౖన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు పొందిన ప్రముఖ భారత మహిళా రెజ్లర్‌ ఎవరు? (మహిళా  రెజ్లర్లను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) గత అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌పై పోరాటానికి గాను ఈమెకు ఈ గౌరవం లభించింది. ఫలితంగా అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పించారు. 2016 ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన ఈమె ఈ ఘనత సాధించిన ఏకైక మహిళా బాక్సర్‌గా కొనసాగుతోంది. ఈమెతోపాటు మరో ఏడుగురు భారతీయులు/భారత సంతతి వ్యక్తులు టైమ్‌ జాబితాలో చోటు పొందారు. వారిలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్‌ బంగా, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్‌ నటి ఆలియా భట్, నటుడు, డైరెక్టర్‌ దేవ్‌ పటేల్, అమెరికా ఇంధన శాఖ రుణ కార్యక్రమాలు కార్యాలయ డైరెక్టర్‌ జిగర్‌ షా, యేల్‌ విశ్వవిద్యాలయంలో ఖగోళ, భౌతిక శాస్త్రాల ప్రొఫెసర్‌ ప్రియంవదా నటరాజన్, భారత సంతతికి చెందిన రెస్టారెంట్‌ యజమాని అస్మాఖాన్‌ ఉన్నారు.)

జ: సాక్షి మాలిక్‌

  • 2024 ఏడాదికి ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా ఏది నిలిచింది? (స్కైట్రాక్స్‌ విడుదల చేసిన జాబితాలో సింగపూర్‌కు చెందిన ఛాంగి విమానాశ్రయం రెండో స్థానంలో ఉంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ఇంఛియన్‌ విమానాశ్రయం మూడో స్థానం లో నిలిచింది. భారత్‌లోని నాలుగు విమానాశ్రయాలు తొలి వంద స్థానాల్లో చోటు పొందాయి.)

జ: హమద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, దోహా (ఖతార్‌)
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని