కరెంట్‌ అఫైర్స్‌

భారత టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ ఆకుల శ్రీజ డబ్ల్యూటీటీ కంటెండర్‌ సింగిల్స్‌ టైటిల్‌ గెలిచిన మొట్టమొదటి భారత టీటీ ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది.

Published : 26 Jun 2024 00:12 IST

భారత టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ ఆకుల శ్రీజ డబ్ల్యూటీటీ కంటెండర్‌ సింగిల్స్‌ టైటిల్‌ గెలిచిన మొట్టమొదటి భారత టీటీ ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. 2024, జూన్‌ 23న లాగోస్, నైజీరియాలో జరిగిన టోర్నీలో శ్రీజ డింగ్‌ యిజీ (చైనా)ని ఓడించింది.

  • మహిళల డబుల్స్‌లోనూ పసిడి నెగ్గిన శ్రీజ ఒకే టోర్నీలో రెండు స్వర్ణాలు గెలిచిన తొలి భారత ప్లేయర్‌గానూ ఘనత సాధించింది. డబుల్స్‌ ఫైనల్లో శ్రీజ - అర్చన జోడీ సహచరులైన దియా - యశస్విని జంటపై గెలిచింది.

న దేశ కరెంట్‌ ఖాతా మిగులు 2023-24 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో 5.7 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.47,000 కోట్లు)గా నమోదైంది. ఇది జీడీపీలో 0.6 శాతానికి సమానమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 2024, జూన్‌ 24న వెల్లడించింది.

  • 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో దేశ కరెంట్‌ ఖాతా లోటు 23.2 బి.డాలర్లకు (సుమారు రూ.1.93 లక్షల కోట్లు) లేదా జీడీపీలో 0.7 శాతానికి తగ్గింది. 2022-23లో ఇది 67 బి.డాలర్లు (సుమారు రూ.5.56 లక్షల కోట్లు) లేదా జీడీపీలో 2 శాతంగా ఉంది.

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్‌ శర్మ వార్తల్లో నిలిచాడు. ఇతడు చేసిన పరుగులు 4165. 2024, జూన్‌ 24న గ్రాస్‌ ఐలెట్‌లో జరిగిన భారత్, ఆస్ట్రేలియా సూపర్‌-8 చివరి మ్యాచ్‌లో రోహిత్‌ 92 స్కోర్‌ చేసి ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకు పాకిస్థాన్‌ బ్యాటర్‌ బాబర్‌ అజామ్‌ (4145) పేరిట ఈ రికార్డు ఉంది.

కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


కరెంట్‌ అఫైర్స్‌

మాదిరి ప్రశ్నలు

ఏ భారత క్యూ స్పోర్ట్స్‌ (స్నూకర్, బిలియర్డ్స్‌) దిగ్గజం ఇటీవల ప్రపంచ బిలియర్డ్స్‌లో విశిష్ట క్రీడాకారుల జాబితా ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో చోటు దక్కించుకున్నాడు? (చైనాలోని షాంగ్రొవొ నగరంలోని ప్రపంచ బిలియర్డ్స్‌ మ్యూజియంలో ఈ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ జాబితాను పొందుపరిచారు.)

జ: పంకజ్‌ అద్వానీ


రష్యా అధ్యక్షుడిగా తిరిగి వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇటీవల ఎన్నికయ్యారు. రష్యా అధ్యక్షుడి పదవీ కాలం ఎంత? (తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌ పోలైన ఓట్లలో 87.29 శాతం (7.6 కోట్లు) ఓట్లు సాధించినట్లు సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ ప్రకటించింది. పుతిన్‌కు ఇన్ని ఓట్లు రావడం ఇదే తొలిసారి. పుతిన్‌ రష్యా అధ్యక్షుడిగా గెలవడం అయిదోసారి.)

జ: 6 సంవత్సరాలు


2024, మార్చి 18 నుంచి 31 వరకు భారత్, యూఎస్‌ మధ్య రక్షణ బంధం మరింత బలోపేతమే లక్ష్యంగా ‘టైగర్‌ ట్రయంఫ్‌-2024’ పేరిట త్రివిధ దళాల సంయుక్త యుద్ధ విన్యాసాలను ఎక్కడ నిర్వహించారు?

జ: విశాఖపట్నం 


2023 ఏడాదికి గానూ ప్రతిష్ఠాత్మక సరస్వతీ సమ్మాన్‌ పురస్కారాన్ని ఏ ప్రముఖ కేరళ కవి, సాహితీవేత్తకు ప్రకటించారు? (మలయాళంలో ఈయన రచించిన ‘రౌద్ర సాత్వికం’ నవలకు ఈ పురస్కారం దక్కింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే సిక్రీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ 22 భాషల్లోని రచనలను పరిశీలించిన తర్వాత ఈయన నవలను పురస్కారానికి ఎంపిక చేసింది.)

జ: ప్రభావర్మగమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని