కరెంట్‌ అఫైర్స్‌

తాజాగా విడుదలైన ‘ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 ఆసియా’ జాబితాలో ‘ఎంటర్‌టైన్‌మెంట్‌’ విభాగంలో చోటు పొందిన దిల్లీకి చెందిన మల్టీ టాలెంట్‌ ఆర్టిస్ట్‌ ఎవరు? (ఈమె ప్లేబ్యాక్‌ సింగర్, సాంగ్‌ రైటర్, వోకలిస్ట్, కంపోజర్‌గా రాణిస్తోంది.

Published : 04 Jul 2024 01:07 IST

మాదిరి ప్రశ్నలు

తాజాగా విడుదలైన ‘ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 ఆసియా’ జాబితాలో ‘ఎంటర్‌టైన్‌మెంట్‌’ విభాగంలో చోటు పొందిన దిల్లీకి చెందిన మల్టీ టాలెంట్‌ ఆర్టిస్ట్‌ ఎవరు? (ఈమె ప్లేబ్యాక్‌ సింగర్, సాంగ్‌ రైటర్, వోకలిస్ట్, కంపోజర్‌గా రాణిస్తోంది. ఈమె తన కళతో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి పని చేస్తోంది. 65వ గ్రామీ అవార్డుల్లో ఈమె పాట ‘దువా’ బెస్ట్‌ గ్లోబల్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ కేటగిరీకి నామినేట్‌ అయ్యింది.)      

జ:  పవిత్రాచారి

 ఐక్యరాజ్య సమితి అనుబంధ శిక్షణ, పరిశోధనా సంస్థ (యూఎన్‌ఐటీఏఆర్‌ - యునైటెడ్‌ నేషన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ట్రైనింగ్‌ అండ్‌ రిసెర్చ్‌) ఇటీవలి నివేదిక ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని టన్నుల ఈ -వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి? (2010తో పోలిస్తే ఇది ఏకంగా 82 శాతం అధికం. 2030 నాటికి ఈ-వ్యర్థాలు 8.2 కోట్ల టన్నులకు చేరవచ్చని అంచ[నా.)

జ:  6.2 కోట్ల టన్నులు

 ‘కాన్సెప్షువల్‌ ఫిజిక్స్‌’ పుస్తక రచయిత ఎవరు? (విద్యార్థులకు ఫిజిక్స్‌ ఎలా బోధించాలో ఈ పుస్తకంలో రచయిత అద్భుతంగా వివరించారు. క్లిష్టమైన అంశాలను అరటిపండు ఒలిచినట్లు చాలా సులువుగా అర్థమయ్యేలా కళ్లకు కట్టారు. ఈ రచయిత ఓ హైస్కూల్‌ టీచర్‌.)

జ:  పాల్‌ హెవిట్‌

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని శక్స్‌గామ్‌ లోయలో ఇటీవల ఏ దేశం అక్రమ నిర్మాణాలు చేపట్టడాన్ని భారత్‌ తీవ్రంగా నిరసించింది?

జ:  చైనా (పాకిస్థాన్‌ శక్స్‌గామ్‌ లోయను 1963లో చైనాకు అప్పగించింది. ఆక్రమిత కశ్మీర్‌పై ఎలాంటి యాజమాన్య హక్కులు లేని పాకిస్థాన్‌ ఏకంగా సుదీర్ఘ విస్తీర్ణం ఉన్న ప్రాంతాన్ని బీజింగ్‌కు ఇవ్వడం    గర్హణీయం. 1963లో ఇస్లామాబాద్, బీజింగ్‌ల మధ్య కుదిరిన ఒప్పందంలో ఆరో అధికరణ కీలకమైంది. కశ్మీర్‌పై భారత్, పాక్‌లు ఒక అంగీకారానికి వస్తే శక్స్‌గామ్‌పై తిరిగి చైనాతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందని ఆ అధికరణం పేర్కొంది.)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని