కరెంట్‌ అఫైర్స్‌

కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్‌ కోర్టు జడ్జిగా నియమితులైన తెలుగు మహిళ ఎవరు? (తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు.

Published : 05 Jul 2024 00:34 IST

మాదిరి ప్రశ్నలు

కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్‌ కోర్టు జడ్జిగా నియమితులైన తెలుగు మహిళ ఎవరు? (తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు.)

జ: జయ బాడిగ


2024, మే 21 నుంచి పది రోజులపాటు ఏ రాష్ట్రంలోని మేలట్టూరులో భాగవత మేళా నాటక మహోత్సవాన్ని నిర్వహించారు? (ఏటా మేలో మేలట్టూరులో నిర్వహించే ఈ భాగవత మేళా నాటక మహోత్సవం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గాంచింది. తెలుగువారి అసలు సిసలు నాటకం యక్షగానం ప్రక్రియ మూలంగా రూపొందించిన అంశాలే భాగవత మేళాలో ఉంటాయి.)

జ: తమిళనాడు


ఈ ఏడాది జాతీయ అకౌంట్ల గణాంకాల ప్రకారం 2011 ఆర్థిక సంవత్సరంలో రూ.2.90 లక్షల కోట్లుగా ఉన్న కుటుంబాల రుణ భారం 2023, మార్చి నాటికి ఎంత మొత్తానికి పెరిగింది? (ఈ అప్పుల్లో అత్యధికం బ్యాంకులు ఇచ్చిన రుణాలే. ముఖ్యంగా కొవిడ్‌ తర్వాత కుటుంబాల రుణభారం భారీగా పెరిగింది. కొవిడ్‌కు ముందు ఇది రూ.7.37 లక్షల కోట్లుగా ఉంది.)

జ: రూ.15.57 లక్షల కోట్లు


మానసిక ఆరోగ్య అవగాహన మాసంగా ఏటా ఏ నెలను జాతీయ స్థాయిలో పాటిస్తారు? (‘టేక్‌ ద మూమెంట్‌’ అనే థీమ్‌తో ఈ ఏడాది మానసిక ఆరోగ్య అవగాహన మాసాన్ని నిర్వహించారు.)

జ: మే


ఒక నిమిషంపాటు ఫోన్‌ కనిపించకపోతే భయం, ఆందోళన, కోపం, వణుకు లాంటి   లక్షణాలు ఉండటాన్ని ఏమంటారు? 

జ: నోమో ఫోబియా (నో మొబైల్‌ ఫోన్‌ ఫోబియా)  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు