నోటిఫికేషన్స్‌

ప్రభుత్వ రంగ సంస్థ - హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న హిందీ ట్రాన్స్‌లేటర్, ఏరియా సేల్స్‌ మేనేజర్‌/ అసిస్టెంట్‌ రీజినల్‌ మేనేజర్‌/ డిప్యూటీ మేనేజర్, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌/ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్, ఏరియా సేల్స్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Published : 07 Jul 2024 00:20 IST

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ప్రభుత్వ రంగ సంస్థ - హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న హిందీ ట్రాన్స్‌లేటర్, ఏరియా సేల్స్‌ మేనేజర్‌/ అసిస్టెంట్‌ రీజినల్‌ మేనేజర్‌/ డిప్యూటీ మేనేజర్, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌/ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్, ఏరియా సేల్స్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య 63. ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ 17 జులై 2024.


ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రిసెర్చ్‌ ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసిస్టెంట్, ప్రాజెక్ట్‌ మేనేజర్, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్, ప్లాంట్‌ మేనేజర్, ఫీల్డ్‌ మేనేజర్‌ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఆఫ్‌లైన్‌లో నిర్వహించే పోస్టులకు జులై 18, ఆన్‌లైన్‌లో నిర్వహించే పోస్టులకు జులై 19న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.


అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు

తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (స్విమ్స్‌ యూనివర్సిటీ), తిరుపతి 2024-25 విద్యా సంవత్సరానికి అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
దరఖాస్తు రుసుము రూ.2596. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ 22 జులై 2024.

పూర్తి వివరాలు, మరిన్ని నోటిఫికేషన్ల కోసం
క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


ప్రాక్టీస్‌  టెస్ట్‌
ఇండియన్‌ ఎకానమీ
పరిశ్రమలు - మార్కెట్‌

1. వనరులు ద్వితీయ కార్యకలాపాలు లేదా తయారీ ద్వారా మార్పు చెందడం?
1) పరిశ్రమ     2) వ్యవసాయం     3) నిర్మాణం     4) సేవలు
2. గుజ్జుతో కాగితం, కాగితంతో నోటు పుస్తకం తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో ఎన్నిరకాల విధులు ఉన్నాయి?
1) 2                    2) 3                         3) 4                   4) చెప్పలేం
3. అంతిమ వస్తువులను ఉత్పత్తి చేస్తే వాటికి సంబంధించి కిందివాటిలో పెరిగే అంశం?
1) విలువ        2) ప్రయోజనం       3) మార్కెట్‌    4) 1, 2
4. పర్యాటక పరిశ్రమ అందించే వాటిని ఏమంటారు?
1) నిర్మాణాలు     2)అభివృద్ధి         3)  సేవలు      4) పైవన్నీ
5. పరిశ్రమ పరిమాణం దేనిపై ఆధారపడి ఉంటుంది?
1) పెట్టుబడి    2) ఉపాధి    3)ఉత్పత్తి   4) పైవన్నీ

సమాధానాలు, మరిన్ని ప్రాక్టీస్‌ టెస్ట్‌ బిట్స్‌ కోసం
క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని