కరెంట్‌ అఫైర్స్‌

ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌-25లో నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా ఇటీవల ఎవరు గుర్తింపు పొందారు?

Published : 07 Jul 2024 00:20 IST

మాదిరి ప్రశ్నలు

  • ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌-25లో నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా ఇటీవల ఎవరు గుర్తింపు పొందారు? (సౌదీ స్మాష్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన ఈమె ఏకంగా  24వ ర్యాంకుకు చేరుకున్నారు.) 

            జ: మనికా బత్రా

  • సెంటర్‌ ఫర్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ (సీడబ్ల్యూయూఆర్‌) - 2024 నివేదిక ప్రకారం భారత్‌లో అగ్రశేణి విద్యాసంస్థగా ఏది నిలిచింది? (అంతర్జాతీయంగా ఈ విద్యాసంస్థ 410వ ర్యాంకులో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 20,966 విద్యాసంస్థల నుంచి అత్యుత్తమ విద్యాసేవలు అందించే రెండు వేల వర్సిటీలను గుర్తించి సీడబ్ల్యూయూఆర్‌ ర్యాంకులు ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో భారత్‌కు చెందిన 65 వర్సిటీలు, ఐఐటీ, ఐఐఎంలు చోటు పొందాయి. భారత్‌ నుంచి రెండో స్థానంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, బెంగళూరు (501వ ర్యాంకు) నిలిచింది. సీడబ్ల్యూయూఆర్‌ - 2024 ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో అన్నీ అమెరికా విశ్వవిద్యాలయాలే నిలిచాయి. తొలి అయిదు స్థానాల్లో వరుసగా హార్వర్డ్‌ వర్సిటీ, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్, యూనివర్సిటీ ఆఫ్‌  ఆక్స్‌ఫర్డ్‌లు నిలిచాయి.)  

            జ: ఐఐఎం అహ్మదాబాద్‌

  • క్రూరమైన రాచరిక చట్టాలు సహా దేశ న్యాయ వ్యవస్థలో సంస్కరణల కోసం పోరాటం సాగిస్తున్న ఏ దేశ హక్కుల యువ ఉద్యమ కారిణి నెతిపోర్న్‌ సనేసంగ్‌ఖోమ్‌ (28) 2024, మేలో అక్కడి ఓ జైలులో మరణించారు? 

    జ: థాయ్‌లాండ్‌

  • అయిదోసారి రష్యా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్లాదిమిర్‌ పుతిన్‌ 2024, మేలో ఏ దేశంలో రెండు రోజుల పాటు పర్యటించారు?   

            జ: చైనా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని