లైబ్రరీ

సమాజంలోని అన్ని రంగాలపై ప్రభావం చూపే రాజకీయ వ్యవస్థ (పాలిటీ).. పోటీ పరీక్షల కోణంలో కీలకమైనది. దీంతో పాటు భారత రాజ్యాంగంపై సమగ్ర అవగాహన అభ్యర్థులకు అవసరం.

Published : 08 Jul 2024 00:23 IST

మాజంలోని అన్ని రంగాలపై ప్రభావం చూపే రాజకీయ వ్యవస్థ (పాలిటీ).. పోటీ పరీక్షల కోణంలో కీలకమైనది. దీంతో పాటు భారత రాజ్యాంగంపై సమగ్ర అవగాహన అభ్యర్థులకు అవసరం. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన పుస్తకం- ‘భారత రాజ్యాంగం- రాజకీయ వ్యవస్థ’. రాజ్యాంగ వివరణతో పాటు  రాజ్యాంగ సవరణలు, సుప్రీంకోర్టు ముఖ్యమైన తీర్పులు, ఎలక్టోరల్‌ బాండ్స్, కేశవానందభారతి కేసు తీర్పు ప్రాముఖ్యం, ఇండియా వర్సెస్‌ భారత్, ఉమ్మడి పౌరస్మృతి, నూతన పార్లమెంటు భవనం- సెంగోల్,  కొత్త నేర న్యాయచట్టాలు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు .. మొదలైన పరిణామాలను ఈ పుస్తకంలో చర్చించారు. యూపీఎస్‌సీ, ఏపీ- తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ల ఆధ్వర్యంలోని గ్రూప్‌-1, 2, ఇతర పరీక్షార్థులకు ఉపయోగకరం.

భారత రాజ్యాంగం - రాజకీయ వ్యవస్థ (2 భాగాలు)

రచన: డా. సుంకర రమాదేవి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (పొలిటికల్‌ సైన్స్‌) 

మొత్తం పేజీలు: 1220. వెల: రూ.899.

ప్రతులకు: శ్రీ తేజ పబ్లికేషన్స్, గాంధీనగర్, హైదరాబాద్‌- 500080. ఫోన్‌: 8686430055 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని