కరెంట్‌ అఫైర్స్‌

తమిళనాడుకు చెందిన 31 ఏళ్ల చెస్‌ క్రీడాకారుడు శ్యామ్‌ నిఖిల్‌ భారత్‌లో ఎన్నో గ్రాండ్‌ మాస్టర్‌ (జీఎం)గా ఇటీవల వార్తల్లో నిలిచాడు?

Published : 08 Jul 2024 00:20 IST

మాదిరి ప్రశ్నలు

  • తమిళనాడుకు చెందిన 31 ఏళ్ల చెస్‌ క్రీడాకారుడు శ్యామ్‌ నిఖిల్‌ భారత్‌లో ఎన్నో గ్రాండ్‌ మాస్టర్‌ (జీఎం)గా ఇటీవల వార్తల్లో నిలిచాడు?(జీఎం హోదా దక్కాలంటే చెస్‌ ప్లేయర్‌ 2500 ఎలో రేటింగ్‌ను దాటడంతోపాటు మూడు జీఎం నార్మ్‌లు సాధించాలి. ఈ రెండూ సాధ్యమైతేనే జీఎం హోదా  లభిస్తుంది. 2012లోనే శ్యామ్‌ 2500 ఎలో రేటింగ్‌ను అందుకోవడంతోపాటు రెండు జీఎం నార్మ్‌లు సాధించాడు. 12 ఏళ్ల తర్వాత తాజాగా శ్యామ్‌ దుబాయ్‌ పోలీస్‌ మాస్టర్స్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నీలో జీఎం హోదా ఖరారు కావడానికి అవసరమైన మూడో జీఎం నార్మ్‌ అందుకున్నాడు.) 

జ: 85వ

  • ప్రపంచంలోనే తొలిసారిగా జన్యుమార్పిడి చేసిన పంది మూత్రపిండాన్ని అమర్చుకున్న రిచర్డ్‌ రిక్‌ స్లేమాన్‌(62) ఇటీవల ఆకస్మికంగా మృతి చెందారు. ఈయన ఏ దేశస్థుడు? (ఈయనకు మసాచుసెట్స్‌ జనరల్‌ ఆసుపత్రిలో 2024, మార్చిలో వైద్యులు విజయవంతంగా పంది కిడ్నీని అమర్చారు. అది కనీసం రెండేళ్లపాటు ఎలాంటి సమస్యల్లేకుండా పని చేస్తుందని వైద్యులు అప్పట్లో తెలిపారు. సొంత కిడ్నీ పాడవడంతో 2018, డిసెంబరులో  స్లేమాన్‌కు మరో మనిషి కిడ్నీ అమర్చారు. 2023లో అది పాడవడంతో మరో ప్రత్యామ్నాయం లేక వైద్యులు జన్యుమార్పిడి పంది కిడ్నీని ఈయనకు అమర్చారు.)

జ: అమెరికా

  • సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ (ఎస్‌సీబీఏ) అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? (ఈ పదవికి జరిగిన ఎన్నికల్లో ఈయనకు 1066 ఓట్లు రాగా, ఈయన సమీప ప్రత్యర్థి, సీనియర్‌ న్యాయవాది ప్రదీప్‌ రాయ్‌కు 689 ఓట్లు వచ్చాయి. ఎస్‌సీబీఏ అధ్యక్ష పదవికి ఈయన ఎన్నిక కావడం ఇది నాలుగోసారి.) 

జ: కపిల్‌ సిబల్‌

  • రష్యా నూతన రక్షణ మంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?

జ: ఆండ్రీ బెలౌసోవ్‌
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని