కరెంట్‌ అఫైర్స్‌

2024 మే 19 నుంచి భారత పార్లమెంటు భవన సముదాయం భద్రత బాధ్యతలను ఏ రక్షణ సంస్థ నిర్వహిస్తోంది? (ఈ సంస్థ ఉగ్రవాద నిరోధక భద్రత విభాగానికి చెందిన 3317 మంది...

Published : 10 Jul 2024 00:28 IST

మాదిరి ప్రశ్నలు

2024 మే 19 నుంచి భారత పార్లమెంటు భవన సముదాయం భద్రత బాధ్యతలను ఏ రక్షణ సంస్థ నిర్వహిస్తోంది? (ఈ సంస్థ ఉగ్రవాద నిరోధక భద్రత విభాగానికి చెందిన 3317 మంది సిబ్బంది పాత, కొత్త పార్లమెంటు భవనాల వద్ద భద్రత విధులు నిర్వహిస్తారని ప్రభుత్వం వెల్లడించింది.)

జ: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్‌) 


ప్రపంచ హైపర్‌ టెన్షన్‌ (అధిక రక్తపోటు) దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? (‘మెజర్‌ యువర్‌ బ్లడ్‌ ప్రెషర్‌ ఆక్యురేట్‌లీ, కంట్రోల్‌ ఇట్, లివ్‌ లాంగర్‌ అనే థీమ్‌తో ఈ ఏడాది ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. భారత్‌తో సహా ఆగ్నేయాసియాలో 29.4 కోట్లకు పైగా ప్రజలు రక్తపోటుతో బాధపడుతున్నారని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. అధిక రక్తపోటు కారణంగా గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్ల వంటి సాంక్రమికేతర వ్యాధులతో పాటు మరణం, వైకల్యం సంభవించే ముప్పు ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. అధిక ఉప్పు వినియోగం, పొగాకు, ఒత్తిడి, వాయు కాలుష్యం అధిక రక్తపోటుకు కారణాలని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.)

జ: మే 17


యూకేకు చెందిన హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌ - 2024 నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో భారత్‌ ఎన్నో స్థానంలో నిలిచింది? (ఈ నివేదిక ప్రకారం వీసా అవసరం లేకుండా భారతీయులు ప్రయాణించగలిగే దేశాల సంఖ్య 62గా ఉంది. సింగపూర్, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌ దేశాలు జాబితాలో ముందు వరుసలో నిలిచాయి.)

జ: 80వ స్థానం Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని