ప్రాక్టీస్‌ బిట్లు

కామిని యొక్క వదనకాంతి పద్మమును విడిచి చంద్రుడిని పొందినది. ఇందులోని అలంకారం? 

Published : 11 Jul 2024 00:32 IST

టీఆర్‌టీ - తెలుగు: అలంకారాలు

1. కామిని యొక్క వదనకాంతి పద్మమును విడిచి చంద్రుడిని పొందినది. ఇందులోని అలంకారం? 

   1) పరివృత్త్యాలంకారం    2) పర్యాయాలంకారం  

  3) పరిసంఖ్యాలంకారం    4) వికల్పాలంకారం

2. పద్మమును చూచుచున్న నా మనస్సు కాంతా ముఖమునకు అధీనమగుచున్నది. ఇందులోని అలంకారం?

    1) భ్రాంతిమదలంకారం   2) స్మృతిమదలంకారం   

  3) వ్యాజస్తుతి         4) వ్యాజనిందాలంకారం

3. ఇచ్చిన వాటిలో శ్లేషాలంకారం కానిది? 

    1) అల్లనగాధి రాజసుతుడర్మిలి మ్రొక్కె  

    2) మామకాగమనవార్త నెరింగింపుము

    3) రామరామయనుచు నారాజ సఖుడు   

    4) దొంగను దొంగయే పట్టవలెను

4. ‘ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు వీరిలో నొక్కొక్కడు లోకపాలుడు. ఓ రాజా నీవును లోకపాలుడవు.’ ఈ వాక్యంలోని అలంకారం?

    1) తుల్యయోగిత అలంకారం   2) ఛేకోక్తి అలంకారం     

  3) వక్రోక్తి అలంకారం     4) స్వభావోక్తి అలంకారం

5. ‘కొన్ని నెలల పాటు కనులు మూసి ఓర్చుకొనుము.’ ఇందులోని అలంకారం?

    1) పరికరాలంకారం      2) సారాలంకారం  

    3) లోకోక్తి అలంకారం     4) విరోధాభాసాలంకారం

6. ‘సూరకవి వేలుపెవ్వడు? సోముడుత్పలాప్తుడా? కాడుగౌరీ సహాయుండనగ.’ ఇందులోని అలంకారం?

   1) లోకోక్తి అలంకారం     2) వక్రోక్తి అలంకారం  

  3) ఛేకోక్తి అలంకారం     4) స్వభావోక్తి 

సమాధానాలు: 1-2; 2-2; 3-4; 4-1; 5-3; 6-2 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని