నోటీస్‌బోర్డు

భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖకు చెందిన దెహ్రాదూన్‌లోని వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 27 Dec 2021 06:48 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
డబ్ల్యూఐఐలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖకు చెందిన దెహ్రాదూన్‌లోని వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 98

పోస్టులు: ప్రాజెక్ట్‌ ఫెలో, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, వెటర్నరీ ఆఫీసర్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, జనవరి 25.

వెబ్‌సైట్‌: https://wii.gov.in/


ఎస్‌ఎస్‌సీ - సీజీఎల్‌ ఎగ్జామ్‌ 2021

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ (సీజీఎల్‌) 2021 పరీక్ష ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాల్లో గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టులు: అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌, ఇన్‌స్పెక్టర్‌ (సెంట్రల్‌ ఎక్సైజ్‌), అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, . జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ తదితరాలు.

అర్హత: అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి, చార్టర్డ్‌ అకౌంటెన్సీ లేదా కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్స్‌ లేదా కంపెనీ సెక్రటరీ/ ఎంకాం/  ఎంబీఏ(ఫైనాన్స్‌)/ మాస్టర్స్‌ ఇన్‌ బిజినెస్‌ ఎకనామిక్స్‌ ఉత్తీర్ణులై ఉండాలి. మిగిలిన అన్ని పోస్టులకూ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.

వయసు: పోస్టును బట్టి 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌ (టైర్‌ 1, టైర్‌ 2), డిస్క్రిప్టివ్‌ పేపర్‌ (టైర్‌ 3), స్కిల్‌ టెస్టు (టైర్‌-4) ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: జనవరి 25.

టైర్‌-1 కంప్యూటర్‌ రాతపరీక్ష:  ఏప్రిల్‌, 2022.

టయర్‌-2 అండ్‌ టయర్‌ 3 పరీక్ష తేదీలు:  వెల్లడించాల్సి ఉంది.

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/


యూపీఎస్‌సీ-187 పోస్టులు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 187  

పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్‌ కమిషన్‌ (క్రాప్స్‌)-02, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (క్వాలిటీ అస్యూరెన్స్‌)-157, జూనియర్‌ టైం స్కేల్‌ ఆఫీసర్‌ - 17, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ -09, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-02.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జనవరి 13.

వెబ్‌సైట్‌:www.upsc.gov.in/


ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్లు

ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగం రెగ్యులర్‌/ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 21  

పోస్టులు: అసిస్టెంట్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, మేనేజర్‌, చీఫ్‌ మేనేజర్‌, ఇంటర్నల్‌ అంబుడ్స్‌మెన్‌.

విభాగాలు: మార్కెటింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, చార్టర్డ్‌ అకౌంటెంట్‌, ఎస్‌ఎంఈ ప్రొడక్ట్స్‌, కంపెనీ సెక్రటరీ.

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో ఎంబీఏ/ పీజీడీఎం, ఐసీఎస్‌ఐలో కంపెనీ సెక్రటరీ మెంబర్‌, సీఏ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జనవరి 13.

వెబ్‌సైట్‌: https://sbi.co.in/


ప్రవేశాలు
క్లాట్‌ - 2022

దేశవ్యాప్తంగా ఉన్న 21 నేషనల్‌ లా యూనివర్సిటీల కన్సార్టియం అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి నిర్వహించే కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌)-2022 ప్రకటన విడుదల చేసింది.

* కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌)-2022
1) యూజీ ప్రోగ్రాం (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ లా డిగ్రీ)

అర్హత: ఇంటర్‌ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత. 2022 మార్చి/ ఏప్రిల్‌లో ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులే. 2) పీజీ ప్రోగ్రాం (ఏడాది ఎల్‌ఎల్‌ఎం డిగ్రీ)

అర్హత: ఎల్‌ఎల్‌బీ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత. 2022 ఏప్రిల్‌/ మేలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులే.

ఎంపిక విధానం: క్లాట్‌ 2021 పరీక్ష (ఆఫ్‌లైన్‌) ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.4000, ఎస్సీ/ ఎస్టీ/ బీపీఎల్‌ విద్యార్థులకు రూ.3500.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, జనవరి 01.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 31.

పరీక్ష తేది: 2022, మే 08.

వెబ్‌సైట్‌: https://consortiumofnlus.ac.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని