దూరవిద్యలో సైకాలజీ..?

పొలిటికల్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేశాను. దూరవిద్యలో విదేశీ యూనివర్సిటీ నుంచి సైకాలజీ డిగ్రీ చదవాలనుకుంటున్నాను. వివరాలు తెలుపగలరు.

Published : 10 Jan 2022 01:33 IST

పొలిటికల్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేశాను. దూరవిద్యలో విదేశీ యూనివర్సిటీ నుంచి సైకాలజీ డిగ్రీ చదవాలనుకుంటున్నాను. వివరాలు తెలుపగలరు.

- సరిత

పొలిటికల్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేసి సైకాలజీ చదవాలనుకొంటున్న నిర్ణయం సరైనదే కానీ, దూరవిద్యలో విదేశీ యూనివర్సిటీ నుంచి చేయాలనుకోవడం గురించి మరోసారి ఆలోచించండి. సాధరణంగా చాలా విదేశీ యూనివర్సిటీలు ఎంబీఏ, ఎంఎస్‌సీ డేటా సైన్స్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌ లాంటి పాపులర్‌ కోర్సులను ఆన్‌లైన్‌ విధానంలో అందిస్తున్నాయి. ఈ కోర్సులకు  ఫీజు కూడా ఎక్కువే. అతితక్కువ విదేశీ వర్సిటీలు మాత్రమే సైకాలజీ కోర్సును ఆన్‌లైన్‌లో అందిస్తున్నాయి. చేరేముందు ఆ విదేశీ యూనివర్సిటీల నాణ్యతా ప్రమాణాలను లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సైకాలజీ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సును దూరవిద్య ద్వారా కాకుండా రెగ్యులర్‌గా చదవడం శ్రేయస్కరం. అవకాశం ఉంటే- విదేశీ వర్సిటీల్లో సైకాలజీని రెగ్యులర్‌ పద్దతిలో చదివే ప్రయత్నం చేయండి. ఈ సబ్జెక్టుపై అంతగా ఆసక్తి ఉంటే మనదేశంలోనే రెగ్యులర్‌ /దూరవిద్య ద్వారా చదివి, పీహెచ్‌డీ కోసం విదేశాలకు వెళ్లటం మేలు. కోర్స్‌ ఎరా, ఎడెక్స్‌, యుడెమి లాంటి ఆన్‌లైన్‌ వేదికల ద్వారా సైకాలజీలో మీకు నచ్చిన అంశం ఎంచుకొని చదివి సబ్జెక్టుపై అవగాహన పెంచుకోండి. సైకాలజీ రంగంలో స్థిరపడాలనుకొంటే మనదేశంలోనే కౌన్సెలింగ్‌ లాంటి సబ్జెక్టుల్లో పీజీ/ పీజీ డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సులు చేసే అవకాశం ఉంది.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని